ఏకంగా ఏటీఎం మిషన్‌ నే ఎత్తుకెళ్లారు.. | ATM Robbers decamp with ATM containing Rs 26.76 lakh | Sakshi
Sakshi News home page

ఏకంగా ఏటీఎం మిషన్‌ నే ఎత్తుకెళ్లారు..

Published Tue, Nov 10 2015 4:25 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

ఏకంగా ఏటీఎం మిషన్‌ నే ఎత్తుకెళ్లారు.. - Sakshi

ఏకంగా ఏటీఎం మిషన్‌ నే ఎత్తుకెళ్లారు..

జైపూర్(రాజస్తాన్): ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన దుండగులు అది కుదరకపోవడంతో ఏకంగా ఏటీఎం మెషిన్నే ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన జైపూర్కు 60కిలో మీటర్ల దూరంలో ఉన్న బైన్స్వాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..  కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి సమయంలో ఓ జాతీయ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో చోరీకి యత్నించారు.

అయితే వారికి ఏటీఎం నుంచి డబ్బులు తీయడం సాధ్యపడకపోవడంతో ఏకంగా రూ. 26.76 లక్షలు ఉన్న ఏటీఎం మెషిన్ని ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిందని తెలుసుకున్న సెక్యురిటీ గార్డు వెంటనే రాత్రి 2:30 సమయంలో సమాచారాన్ని పోలీసులకు చేరవేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement