యువతులను వేధించే పోకిరీల ఆగడాల గురించి తరచూ వింటుంటాం. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే కుర్రాళ్ల గురించి కూడా వినేవుంటాం. ఇలాంటి యువకుల నుంచి తప్పించుకునేందుకు మహిళలు, యువతులు నానా అవస్థలు పడుతుంటారు. తాజాగా పోకిరీల భయంతో ఇద్దరు బాలికలు చేసిన పని చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న గార్డుకు ఇద్దరు బాలికలు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో ఆయన వారిని ప్రశ్నించగా వారు తమకు ఎదురైన అనుభవాన్ని తెలిపారు. తాము హత్రాస్‌లో నివాసముంటామని, ట్యూషన్ ముగిశాక, ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు పోకిరీలు తమకు ఎదురయ్యారని, వారి నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు చేరుకుని హడావుడిగా రైలు ఎక్కినట్లు తెలిపారు. ఇంతలో రైలు స్టార్ట్ అయ్యిందని, తాము 140 కిలోమీటర్ల దూరంలోని ఇటావా స్టేషన్ రాగానే స్టేషన్‌లో దిగేశామని తెలిపారు. వీరి మాటలు విన్న గార్డు ఈ సమాచారాన్ని చైల్డ్ వెల్ఫేర్ సంస్థకు తెలిపారు. వారు ఈ బాలికలను వారి హత్రాస్‌లోని వారి ఇళ్లకు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment