హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఎన్ఎస్సీ నగర్ వద్ద దారికాచిన దుండగలు అటుగా వస్తున్న దంపతులను చితకబాది వారి వద్ద నుంచి అందినకాడికి దోచుకున్నారు. దంపతుల వద్ద నుంచి 7 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.15వేల నగదు, బైక్ అపహరించుకు వెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.