హైదరాబాద్ : నగరంలోని మల్కాజ్గిరిలో ఫెడరల్ బ్యాంక్‌లో చోరీ జరిగింది. దుండగులు రెండోసారి బ్యాంక్పై గురిపెట్టి...అందినకాడికి దోచుకు వెళ్లారు. ఈరోజు తెల్లవారుజామున దుండగులు బ్యాంక్ గ్రిల్స్ తొలగించి లోనికి ప్రవేశించారు. సుమారు లక్ష రూపాయల నగదుతో పాటు,ఒక కేజీ బంగారాన్ని అపహరించినట్లు సమాచారం.
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. గతంలోనూ ఇదే బ్యాంకులో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు పాత నేరస్తులపై దృష్టి సారించారు. ఇదిలా ఉండగా బ్యాంకులో వచ్చిన వారెవరైనా చోరీకి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.