సంగారెడ్డిలో 13 ఏళ్ల పాపకు నిప్పంటించిన దుండగులు | Miscreants set ablaze 13 years student in Sangareddy | Sakshi
Sakshi News home page

సంగారెడ్డిలో 13 ఏళ్ల పాపకు నిప్పంటించిన దుండగులు

Published Mon, Jun 23 2014 5:39 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

Miscreants set ablaze 13 years student in Sangareddy

మెదక్: జిల్లాలోని సంగారెడ్డిలో సోమవారం దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న స్వాతి అనే పాఠశాల విద్యార్ధిని కిరోసిన్ పోసి దుండగులు నిప్పంటించిన సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.  
 
ఈ ఘటనలో 80 శాతం గాయాలైన స్వాతిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 13 ఏళ్లున్న స్వాతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన సంగారెడ్డిలోని హనుమాన్ నగర్ లో చోటు చేసుకుంది. 
 
స్వాతిపై దారుణానికి ఒడిగట్టిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement