ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): పెళ్లయిన ఆరునెలల నుంచే భర్త అనుమానంతో వేధించడంతో ఓ వివాహిత అర్ధంతరంగా తనువు చాలించింది. ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావంటూ నిత్యం అనుమానిస్తుండడంతో భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని పెద్దాపూర్‌లో చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ గూడూరి సంతోష్ కుమార్ వివరాల ప్రకారం... వికారాబాద్ జిల్లా పులిమద్ది గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(22)ని పెద్దాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర రమేష్(24)తో ఆరు నెలల క్రితం వివాహం జరిపించారు. కొద్ది రోజులు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది.
తర్వాత రోజూ భర్త అనుమానిస్తుండడంతో తట్టుకోలేక తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన గోడు చెప్పుకునేది. భర్త నుంచి వేధింపులు ఎక్కవ కావడంతో గురువారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు పెద్దాపూర్‌కు చేరుకొని బోరున విలపించారు.
చదవండి: క్వారీలో టిప్పర్ బోల్తా.. ముగ్గురి మృతి
సూసైడ్ లెటర్ కలకలం...
‘‘అమ్మ, నాన్న, తమ్ముడు నన్ను క్షమించండి. నా భర్త రమేష్... నాపై అనుమానంతో రోజు నరకం చూపుతున్నాడు. తట్టుకోలేక చనిపోతున్నా. రోజు నా ఫోన్ చెక్ చేయడం చేస్తున్నాడు. అందుకే చనిపోతున్న. అమ్మ, నాన్న, తమ్ముడు నన్ను క్షమించు. మిస్ యూ సో మచ్ లవ్ యూ. మీ బుజ్జీ’’. అంటూ లెటర్ ముగించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
చదవండి: ఆస్తి కోసం పేగు బంధాన్ని మరిచిన కూతురు.. కన్న తల్లిని కిరాతకంగా చంపి..
Comments
Please login to add a commentAdd a comment