married Woman Committed suicide
-
భార్య బ్యూటీ పార్లర్.. కోల్‌కతాలో భర్త.. తరచూ ఫోన్ చేసి వేధిస్తుండటంతో..
శ్రీకాకుళం (టెక్కలి రూరల్) : టెక్కలి మేజర్ పంచాయతీ ఎన్టీఆర్ కాలనీకి చెందిన కిల్లారి లలిత(35) అనే వివాహిత గురువారం తన ఇంట్లో ఉరి వేసుకు ని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లలిత టెక్కలి సంతోషిమాత గుడి ఎదురుగా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. భర్త దుర్గారావు కోల్‌కతాలో పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్య తరచూ ఫోన్లో గొడవలు జరుగుతుండేవి. ఈ మధ్య దుర్గారావు వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. గురువారం కూడా భర్తతో గొడవపడి మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని లలిత ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే కుమార్తె రక్షిత స్థానికుల సహాయంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లిదండ్రులు ఒడిశాలో ఉన్నారని, వారు వచ్చాక కేసు నమోదు చేస్తామని టెక్కలి ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు తెలిపారు. -
కావ్యా.. ఎంత పనిచేశావమ్మా..
నల్గొండ (హాలియా) : అత్తింటి వేధింపులకు వివాహిత బలైంది. ఈ విషాదకర ఘటన అనుముల మండలం కొ ర్రివేనిగూడెంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాలియా ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొర్రివేనిగూడెం గ్రామానికి చెందిన సీతా లక్ష్మయ్య, వి జయ దంపతుల చిన్న కుమార్తె కావ్య(22)ను 7 నె లల క్రితం తిరుమలగిరి (సాగర్) మండలంలోని నేతాపురం గ్రామానికి చెందిన బొల్లెంపల్లి వెంకటేశ్వర్లు, పద్మ దంపతుల కుమారుడు బొల్లెంపల్లి మహేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.2లక్షలు, ఆరు తులాల బంగా రం, అర ఎకరం వ్యవసాయ భూమి ఇచ్చారు. కొద్ది రోజుల పాటు వీరి కాపురం సాఫీగానే సాగింది. కొద్ది నెలలుగా.. కొద్ది నెలలుగా కావ్యను భర్త మహేష్‌తో పాటు అత్తా, మామలు సూటిపోటి మాటలు అనడంతో పాటు ఆమెను అనునిత్యం అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా వేధించసాగారు. అత్తారింటి వేధింపులు భరించలేక కావ్య కొద్దిరోజుల క్రితం తల్లిగారింటికి వచ్చి అక్కడే ఉంటుంది. ప్రస్తుతం కావ్య 5 నెలల గర్భవతి. అత్తింటి వేధింపులకు తీవ్ర మనస్తాపానికి గురైన కావ్య ఈనెల 4న ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగింది. ఆపస్మార క స్థితిలో ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించా రు. అక్కడే చికిత్స పొందుతున్న కావ్య మంగళవా రం మృతిచెందింది. మృతురాలు తండ్రి సీతా లక్ష్మ య్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. -
భార్య చనిపోతే.. మరో కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు..
సాక్షి, రామభద్రపురం (విజయనగరం): మండలకేంద్రంలోని శ్రీరాంనగగర్ కాలనీ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఓ వివాహిత భర్త వేధింపులు తాళలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై సీఐ ఎల్ అప్పలనాయుడు, ఎస్సై కృష్ణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 8 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం బాసూరు గ్రామానికి చెందిన చోడవరపు సాంబినాయుడు, భార్య ఉషారాణి వ్యాపారం నిమిత్తం రామభద్రపురం మండలకేంద్రానికి వచ్చి శ్రీరాంనగర్ కాలనీలోఅద్దింట్లో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా బుధవారం రాత్రి ఉషారాణి బెడ్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలంలో వివరాలు సేకరిస్తున్న సీఐ అప్పలనాయుడు, ఎస్సై కృష్ణమూర్తి భార్య ఆత్మహత్య విషయంపై సాంబినాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు సరికదా ఎవరికీ చెప్పకుండా ఇద్దరు మిత్రుల సహాయంతో గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఓ ప్రైవేట్ అంబులెన్స్‌లో తన సొంతూరు తీసుకువెళ్తూ భార్య ఉషారాణి ఆత్మహత్య చేసుకుందన్న సమాచారం శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం బుక్కూరులో ఉన్న అత్తామామలకు చేరవేశాడు. దీంతో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బాసూరు వెళ్లి మృతదేహాన్ని కంటికిమింటికీ ఏకధారగా రోదించారు. అనంతరం మృతురాలి తండ్రి గర్భాన దుర్గారావు భర్త వేధింపులు తాళలేక తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు పాలకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రామభద్రపురంలో ఆత్మహత్య జరగడంతో పాలకొండ పోలీసులు కేసును ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో ఈ ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆత్మహత్య జరిగిన ఇంటిని పరిశీలించి మృతురాలి తండ్రి వద్ద వివరాలు సేకరించారు. చదవండి: (రియాల్టీ షో స్టార్ చిన్నారి సమన్వి దుర్మరణం) సాంబినాయుడికి రెండో వివాహం 2009లో మృతురాలి తండ్రి దుర్గారావు పెద్ద కుమార్తె అరుణకుమారికి సాంబినాయుడితో వివాహం చేశాడు. ప్రసవసమయంలో అరుణకుమారి మృతిచెందగా ప్రసవించిన పాప బతికింది. పాప బాగోగులు చూసేందుకు అల్లుడికి 2011లో తన మూడవ కుమార్తె ఉషారాణిని ఇచ్చి తండ్రి దుర్గారావు రెండోపెళ్లి చేశారు. ఆమెకు ఒక కుమార్తె పుట్టిన తర్వాత కడపలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న అల్లుడు రామభద్రపురం వచ్చి కోళ్లఫారంతో పాటు ఇనుప స్క్రాప్ కొనుగోలు వ్యాపారం చేస్తున్నాడు. మండలకేంద్రంలో మరో మహిళతో వివాహేతర సంబంధంతో అదనపు కట్నం తీసుకురావాలని మద్యం తాగి భార్యను రోజూ వేధించేవాడు. ఆ వేధింపులు తట్టుకోలేక తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘నన్ను క్షమించు... మిస్ యూ సో మచ్ లవ్ యూ..’
సాక్షి, సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): పెళ్లయిన ఆరునెలల నుంచే భర్త అనుమానంతో వేధించడంతో ఓ వివాహిత అర్ధంతరంగా తనువు చాలించింది. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావంటూ నిత్యం అనుమానిస్తుండడంతో భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని పెద్దాపూర్‌లో చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ గూడూరి సంతోష్ కుమార్ వివరాల ప్రకారం... వికారాబాద్ జిల్లా పులిమద్ది గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(22)ని పెద్దాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర రమేష్(24)తో ఆరు నెలల క్రితం వివాహం జరిపించారు. కొద్ది రోజులు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. తర్వాత రోజూ భర్త అనుమానిస్తుండడంతో తట్టుకోలేక తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన గోడు చెప్పుకునేది. భర్త నుంచి వేధింపులు ఎక్కవ కావడంతో గురువారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు పెద్దాపూర్‌కు చేరుకొని బోరున విలపించారు. చదవండి: క్వారీలో టిప్పర్ బోల్తా.. ముగ్గురి మృతి సూసైడ్ లెటర్ కలకలం... ‘‘అమ్మ, నాన్న, తమ్ముడు నన్ను క్షమించండి. నా భర్త రమేష్... నాపై అనుమానంతో రోజు నరకం చూపుతున్నాడు. తట్టుకోలేక చనిపోతున్నా. రోజు నా ఫోన్ చెక్ చేయడం చేస్తున్నాడు. అందుకే చనిపోతున్న. అమ్మ, నాన్న, తమ్ముడు నన్ను క్షమించు. మిస్ యూ సో మచ్ లవ్ యూ. మీ బుజ్జీ’’. అంటూ లెటర్ ముగించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: ఆస్తి కోసం పేగు బంధాన్ని మరిచిన కూతురు.. కన్న తల్లిని కిరాతకంగా చంపి.. -
నందిగామలో వివాహిత ఆత్మహత్యాయత్నం
సాక్షి, కృష్ణా: నందిగామలో లక్ష్మీ అనే వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకుంది. వెంటనే స్థానికులు ఆమెను రక్షించారు. తన భర్త చనిపోయి ఏడాది అవుతున్నా అత్తమామలు ఇంట్లోకి రానివ్వడం లేదని లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని.. అలాగే గ్రామ పెద్దల దగ్గర పంచాయితీ పెట్టించినా అత్తమామలు వారి మాట వినటంలేదని పేర్కొంది. అటు పోలీసులు ఇటు అత్తమామలు పట్టించుకోకపోవడంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు లక్ష్మీ తెలిపింది. -
వివాహిత ఆత్మహత్య
చిత్తూరు / వరదయ్యపాళెం: వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మం డలంలోని వెంగారెడ్డికండ్రిగ దళితవాడలో చోటు చేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన చలపతి, కర్లినాకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల ఇద్దరి మధ్య స్వల్ప పాటి వివాదాలు తలెత్తాయి. దీంతో మనస్తాపం చెందిన కర్లినా ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం ఉదయం మృతి చెందింది. ఎస్ఐ హరిప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత ఆత్మహత్య
తిరువొత్తియూరు: వివాహమైన రెండేళ్లకే చెన్నై ఓటేరిలో పోలీసు భార్య మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. చెన్నై ఓటేరి మలయప్పన్ వీధికి చెందిన విఘ్నేష్ (25) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. అతను చెన్నై కార్పొరేషన్ పోలీసు ఆయుధ విభాగంలో పోలీసు. కృష్ణగిరి రాయకోటకు చెందిన విఘ్నేష్‌కు కృష్ణగిరి డెంకినికోటకు చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ లక్ష్మీ (24)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాది బిడ్డ ఉంది. వేలూరులో పోలీసు శిక్షణ పొందిన తరువాత విఘ్నేష్ 10 రోజుల ముందు చెన్నైలో ఉద్యోగంలో చేరాడు. దీంతో చిన్నారిని లక్ష్మి తల్లిదండ్రుల ఇంట్లో వదిలిపెట్టి భార్య లక్ష్మితో కలిసి 10 రోజుల ముందు ఓటేరి మలయప్పన్ వీధిలో కాపురం పెట్టాడు. మంగళవారం ఉదయం విధులకు వెళ్లిన విఘ్నేష్ మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఎంతసేపటికీ తలుపులు తీయలేదు. దీంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశాడు. ఆ సమయంలో లక్ష్మి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతోంది. దిగ్భ్రాంతి చెందిన విఘ్నేష్ ఓటేరి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి అంబులెన్స్‌లో వచ్చిన వైద్యులు లక్ష్మి మృతి చెందినట్టు తెలిపారు. విషయం తెలిసి లక్ష్మి తండ్రి రామస్వామి ఓటేరికి చేరుకుని వరకట్న వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓటేరి సీఐ మహ్మద్ నాజర్ విచారణ చేపట్టారు. -
వివాహిత ఆత్మహత్య
తలుపుల: వేపమానిపేట సమీపంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన మేరకు.. తలుపులమండలం వేపమానిపేటకు చెందిన ఆర్టీసీ మెకానిక్ కుళ్లాయప్ప కుమార్తె శిరీష(25)కు తొమ్మిదేళ్ల కిందట ధర్మవరం మండలం నడిమిగడ్డపల్లికి చెందిన వీరనారప్పతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. మూడు నెలల కిందట భర్తతో గొడవపడి శిరీష తన వేపమానిపేటకు వచ్చి బాబాయి శ్రీనివాసులు ఇంట్లో ఉంటోంది. శనివారం తండ్రి పొలానికి వెళ్లి అక్కడ వేపచెట్టుకు శిరీష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ గోపాలక్రిష్ణ, ఏఎస్ఐ ఇస్మాయిల్ఖాన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని తహసీల్దార్ శివయ్య పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
పెళ్లైన ఆరు నెలలకే..
నూజివీడు : కుటుంబ సభ్యులను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న యువతి పెళ్లైన ఆరు నెలలకే విగతజీవిగా మారిన ఘటన పట్టణంలోని బాపూనగర్‌లో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్ నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన ఖుష్బూ (19), బాపూనగర్‌కు చెందిన రేపాని రాజు ప్రేమించుకుని గతేడాది డిసెంబరు నెలాఖరులో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఖుష్బూ భర్త ఇంటి వద్దనే ఉంటోంది. ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వద్దన్నా వినకుండా తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందనే బాధతో కుష్బూ తల్లిదండ్రులు నూజివీడు నుంచి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతానికి వెళ్లిపోయారు. అయితే శనివారం మధ్యాహ్నం వరకు భార్యాభర్తలు ఇరువురూ పనికి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత భర్త సెంటర్‌కు రాగా, భార్య రెండు మూడు సార్లు ఫోన్ చేసింది. దీంతో 3 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లగా ఖుష్బూ చీరతో ఉరి వేసుకుని ఉండటంతో వెంటనే రాజు ఇరుగుపొరుగు వారిని పిలిచి కిందకు దించి ఆసుపత్రికి తరలించాడు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. ఘటనపై పట్టణ ఎస్ఐ రంజిత్‌కుమార్ అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం రిపోర్టును బట్టి తర్వాత సెక్షన్లు మారుస్తామని ఎస్ఐ తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
భోగాపురం: అత్తింటి ఆరళ్లు.. వరకట్న వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో మార్కెట్ సమీపంలో నివాసం ఉంటున్న అడపా శ్రావణి (28), రోహిణికుమార్లకు ఐదేళ్ల కిందట వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. రోహిణికుమార్ చెన్నైలో ఉద్యోగం చేస్తుండగా.. మేడపైన అత్తమామలు.. కింద పోర్షన్లో శ్రావణి తన కుమార్తెతో ఉంటోంది. అయితే శనివారం రాత్రి శ్రావణి ఇంటిలో ఉరివేసుకుని కనిపించింది. అత్తమామాలు వరలక్ష్మి, చంద్రశేఖర్, భర్త రోహిణికుమార్ అదనపు కట్నం తేవాలంటే వేధించడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని శ్రావణి తల్లి రామలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తహసీల్దార్ శ్రీకాంత్ సమక్షంలో మృతదేహానికి శవపంచనామ నిర్వహించారు. సీఐ రఘువీర్ విష్ణు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ ఆత్మహత్యాయత్నం పార్వతీపురంటౌన్: మండలంలోని పెదబొండపల్లి గ్రామానికి చెందిన చెడ్రాపు విజయ ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. భర్త సింహాద్రి మందలించడంతో మనస్తాపానికి గురైన విజయ శనివారం ఉదయం ఇంటిలో ఉన్న గడ్డి మందు తాగేసింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆటోలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో విజయ కోలుకుంది. -
వివాహిత ఆత్మహత్య
గార: వివాహం జరిగి కొద్ది నెలలు కూడా అవకముందే అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో కన్నవారికి చెప్పుకోలేక.. అత్తింటి బాధలు భరించలేక వివాహత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కొత్తూరు సైరిగాంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లావేరు మండలం బయ్యానిపేటకు చెందిన ఆరంగి పావని (19)తో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సైరిగాం గ్రామానికి చెందిన ఆరంగి సత్యనారాయణకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఆ సమయంలో రూ.8లక్షలు కట్నంతో పాటు ఆరు తులాల బంగారం ఇచ్చారు. వీటితో పాటు ఇతర సామగ్రిని కూడా అందజేశారు. అదనంగా కట్నం తెమ్మని అత్తింటివారు వేధిస్తున్నా ఆ బాధలన్నీ దిగమింగింది. తన కష్టాన్ని కన్నవారి దగ్గర చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంది. చీర కొంగుతో ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్ప డింది. మృతురాలి తండ్రి పోలాకి గోవిందరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ బూర ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ వి. భీమారావు, తహసీల్దార్ ఎ.సింహాచలం పరిశీలించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. -
అత్తారింటికి వెళ్లిన కాసేపట్లోనే...
చిత్తూరు జిల్లా : ఎమ్మార్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణనగర్‌లో బుధవారం మధ్యాహ్నం వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వెస్టు డీఎస్పీ కనకరాజు, ఎమ్మార్‌పల్లి సీఐ మధు కథనం మేరకు...తిరుపతి రూరల్ మండలం తనపల్లి పంచాయతీ నల్లమానుకాలువ గ్రామానికి చెందిన జ్యుడిషియల్ ఉద్యోగి కుమారస్వామిరెడ్డి, ప్రశాంతి దంపతుల కుమార్తె దివ్య(25)ను ఐదేళ్ల క్రితం తిరుపతికి చెందిన శివకుమార్‌రెడ్డి, యశోదమ్మ దంపతుల కుమారుడు శశికాంత్‌రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి మోహిత్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరి కాపురం కొన్నేళ్లు సజావుగా సాగింది. కొద్ది రోజులుగా శశికాంత్‌రెడ్డి కట్నం తీసుకురమ్మని భార్యను వేధించసాగాడు. అవి ఎక్కువ కావడంతో బుధవారం మధ్యాహ్నం ఆమె ఇంట్లో ఉరేసుకుని మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. భర్త, అత్త చంపారు దివ్యను ఆమె భర్త, అత్త ఇద్దరూ కలిసి చంపేశారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. బుధవారం ఉదయం మా ఇంటికొచ్చి మాతో సంతోషంగా గడిపిందని, మధ్యాహ్నం అత్తారింటికి వెళ్లిన కాసేపట్లోనే శవంగా మారిందని వాపోయారు. వరకట్నం తీసుకురాలేదన్న కోపంతోనే తమ బిడ్డను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, బంధువుల ఫిర్యాదు మేరకు సీఐ మధు వరకట్న వేధింపుల కింద భర్త, అత్తపై కేసు నమోదు చేశారు. వెస్టు డీఎస్పీ కేసు దర్యాప్తు చేపట్టారు. -
నవ వధువు ఆత్మహత్య
► పెళైన నాలుగు నెలలకే పరలోకాలకు ► హత్యచేసి ఆత్మహత్యగా చెబుతున్నారని ఆరోపించిన శిరీషా తల్లితండ్రులు ► భర్త, అత్తమామల ఇంటిపై ► మృతురాలి బంధువుల దాడి ► పీబీనగర్లో ఘోరం లావేరు: కాళ్ల పారాణి ఆరకముందే వివాహిత పరలోకాలకు వెళ్లిపోయింది. పెళ్లైన నాలుగు నెలలకే ప్రాణాలు తీసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేకో, మరే కారణమో తెలియదు గాని ఫ్యాన్‌కు చీరతో ఊరివేసుకొని మృతి చెందింది. తమ కుమార్తెను భర్త, అత్తమామలు, ఆడపడుచు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు గొండేల జయరామ్, రమణమ్మ ఆరోపించారు. ఈ సంఘటనకు సంబంధించి లావేరు ఎస్ఐ సి.హెచ్.రామారావు, మృతురాలి భర్త, అత్తమామలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లావేరు మండలంలోని మురపాక పంచాయతీ పరిధి పి.బి.నగర్ కాలనీకి చెందిన బుర్రు మురళీ అంబేడ్కర్ అనే వ్యక్తితో వంగర గ్రామానికి చెందిన శిరీషాతో ఈ ఏడాది మే 1వ తేదీన వివాహం జరిగింది. ఆషాఢమాసంలో కన్నవారు ఇంటి వద్ద ఉన్న శిరీషా గత నెల 30వ తేదీన అత్తవారి గ్రామమైన పి.బి.నగర్ కాలనీకి వచ్చింది. శిరీషా భర్త మురళీఅంబేడ్కర్ నావీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం భోజన సమయంలో భర్త మురళీఅంబేడ్కర్కు, శిరీషాకు మధ్య భోజన విషయంలో వివాదం జరిగింది. మనస్థాపానికి గురై శిరీషా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎప్పటికీ బయటకు రాకపోవడంతో భర్త వెళ్లి తలుపులు కొట్టినా తలుపులు తీయలేదు. భర్త, అత్తమామలు తలుపులు విరగొట్టి చూడగా గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని మృతి చెంది ఉంది. ఈ విషయాన్ని లావేరు పోలీస్ స్టేషన్‌కు తెలియజేశామని శిరీషా భర్త, అత్తమామలు చెప్పారు. ఎస్ఐ సి.హెచ్.రామారావు, పి.సి.అప్పలనాయుడు, మురపాక వీఆర్వో గెడ్డాపు శ్రీనివాసరావు, తహశీల్దార్ వేణుగోపాలరావు సంఘటనా స్థలానికి వెళ్లి శిరీషా ఊరివేసుకున్న గదిని, ఫ్యాన్‌ను పరిశీలించారు. శిరీషా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను భర్తను, అత్తమామలను అడిగి తెలుసుకున్నారు. హత్యచేసి ఆత్మహత్యగా చెబుతున్నారు శిరీషాను భర్త, అత్తమామలు, ఆడపడుచు కలిసి గొంతు నులుపి హత్యచేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించారని మృతురాలి తల్లితండ్రులు గొండేల జయరామ్, రమణమ్మ, చిన్నాన్న ఆంజనేయు, సోదరుడు హరి ఆరోపించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న శిరీషా తల్లిదండ్రులు, బంధువులు ఆదివారం రాత్రి పి.బి.నగర్ కాలనీకి వచ్చారు. పెళ్లి అయిన నాలుగు నెలలకే కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. పెళ్లి సమయంలో రూ. 5 లక్షల కట్నం, 5 తులాలు బంగారం ఇచ్చామని మృతురాలి తల్లిదండ్రులు అన్నారు. అయినా తక్కువ కట్నం తెచ్చావు, వేరే అమ్మాయిని చేసుకుంటే రూ. 15 లక్షలు వచ్చేదని శిరీషాను భర్త, అత్తమామలు, ఆడపడుచు నిత్యం వేధించేవారన్నారు. తమ కుమార్తె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మురళీఅంబేడ్కర్ ఇంటిపై శిరీషా బంధువుల దాడి శిరీషాను బలవంతంగా చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతురాలి బంధువులు భర్త మురళీఅంబేడ్కర్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంటికి ఉన్న అద్దాలను, ఇంటిలో ఉన్న టీవీని పగులగొట్టారు. భర్త, అత్తమామలపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని ఇంటి లోపల పెట్టి రక్షించారు. కొంత సేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
బావిలో దూకి వివాహిత ఆత్మహత్య
భోగాపురం: మండలంలోని రామచంద్రపేట గ్రామంలో బావిలో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అప్పలనర్సమ్మ(23)కు, అదే గ్రామానికి చెందిన కొయ్య గోవిందతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. గోవింద రైతుకూలీ. అప్పలనర్సమ్మ కొద్దికాలంగా విజయనగరంలో కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటోంది. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే విజయనగరం వెళ్లివస్తానని చెప్పి ఇంటి వద్ద నుంచి బయల్దేరింది. సాయంత్రం ఇంటికి చేరలేదు. అప్పటినుంచి అన్నిచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో గ్రామానికి సమీపాన బావిలో ఆమె విగతజీవై పడి ఉండడాన్ని స్థానిక మహిళ గుర్తించింది. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించింది. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. ఆమె వేసుకున్న దుస్తులను బట్టి అప్పలనర్సమ్మగా గుర్తించారు. ఎస్సై దీనబంధు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఏ కష్టం వచ్చిందో.. వివాహిత ఆత్మహత్యపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలేవీ లేవని స్థానికులు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకునేటంత ఏ కష్టం వచ్చిందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.