
భోగాపురం: అత్తింటి ఆరళ్లు.. వరకట్న వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో మార్కెట్ సమీపంలో నివాసం ఉంటున్న అడపా శ్రావణి (28), రోహిణికుమార్‌లకు ఐదేళ్ల కిందట వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. రోహిణికుమార్ చెన్నైలో ఉద్యోగం చేస్తుండగా.. మేడపైన అత్తమామలు.. కింద పోర్షన్‌లో శ్రావణి తన కుమార్తెతో ఉంటోంది. అయితే శనివారం రాత్రి శ్రావణి ఇంటిలో ఉరివేసుకుని కనిపించింది. అత్తమామాలు వరలక్ష్మి, చంద్రశేఖర్, భర్త రోహిణికుమార్ అదనపు కట్నం తేవాలంటే వేధించడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని శ్రావణి తల్లి రామలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తహసీల్దార్ శ్రీకాంత్ సమక్షంలో మృతదేహానికి శవపంచనామ నిర్వహించారు. సీఐ రఘువీర్ విష్ణు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
పార్వతీపురంటౌన్: మండలంలోని పెదబొండపల్లి గ్రామానికి చెందిన చెడ్రాపు విజయ ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. భర్త సింహాద్రి మందలించడంతో మనస్తాపానికి గురైన విజయ శనివారం ఉదయం ఇంటిలో ఉన్న గడ్డి మందు తాగేసింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆటోలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో విజయ కోలుకుంది.
Comments
Please login to add a commentAdd a comment