Married Woman Suicide At Ramabhadrapuram Vizianagaram District - Sakshi
Sakshi News home page

భార్య చనిపోతే.. మరో కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు.. వివాహేతర సంబంధంతో..

Published Sat, Jan 15 2022 3:06 PM | Last Updated on Sat, Jan 15 2022 6:12 PM

Married Woman Suicide At Ramabadrapuram Vizianagaram District - Sakshi

ఉషారాణి (ఫైల్‌) 

సాక్షి, రామభద్రపురం (విజయనగరం): మండలకేంద్రంలోని శ్రీరాంనగగర్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఓ వివాహిత భర్త వేధింపులు తాళలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై సీఐ ఎల్‌ అప్పలనాయుడు, ఎస్సై కృష్ణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  8 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం బాసూరు గ్రామానికి చెందిన చోడవరపు సాంబినాయుడు, భార్య ఉషారాణి వ్యాపారం నిమిత్తం రామభద్రపురం మండలకేంద్రానికి వచ్చి శ్రీరాంనగర్‌ కాలనీలోఅద్దింట్లో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా బుధవారం రాత్రి ఉషారాణి బెడ్‌ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సంఘటన స్థలంలో వివరాలు సేకరిస్తున్న  సీఐ అప్పలనాయుడు, ఎస్సై కృష్ణమూర్తి  

భార్య ఆత్మహత్య విషయంపై సాంబినాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు సరికదా ఎవరికీ చెప్పకుండా ఇద్దరు మిత్రుల సహాయంతో గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఓ ప్రైవేట్‌ అంబులెన్స్‌లో తన సొంతూరు తీసుకువెళ్తూ భార్య ఉషారాణి ఆత్మహత్య చేసుకుందన్న సమాచారం శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం బుక్కూరులో ఉన్న అత్తామామలకు చేరవేశాడు. దీంతో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బాసూరు వెళ్లి మృతదేహాన్ని కంటికిమింటికీ ఏకధారగా రోదించారు.  అనంతరం మృతురాలి తండ్రి గర్భాన దుర్గారావు భర్త వేధింపులు తాళలేక తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు పాలకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రామభద్రపురంలో ఆత్మహత్య జరగడంతో పాలకొండ పోలీసులు కేసును ట్రాన్స్‌ఫర్‌ చేశారు.  దీంతో ఈ ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆత్మహత్య జరిగిన ఇంటిని పరిశీలించి మృతురాలి తండ్రి వద్ద వివరాలు సేకరించారు.

చదవండి: (రియాల్టీ షో స్టార్‌ చిన్నారి సమన్వి దుర్మరణం)
 
సాంబినాయుడికి రెండో వివాహం
2009లో మృతురాలి తండ్రి దుర్గారావు పెద్ద కుమార్తె అరుణకుమారికి సాంబినాయుడితో  వివాహం చేశాడు. ప్రసవసమయంలో అరుణకుమారి మృతిచెందగా ప్రసవించిన పాప బతికింది. పాప బాగోగులు చూసేందుకు అల్లుడికి 2011లో తన మూడవ కుమార్తె ఉషారాణిని ఇచ్చి తండ్రి దుర్గారావు రెండోపెళ్లి చేశారు. ఆమెకు ఒక కుమార్తె పుట్టిన తర్వాత కడపలో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న అల్లుడు రామభద్రపురం వచ్చి కోళ్లఫారంతో పాటు ఇనుప స్క్రాప్‌ కొనుగోలు వ్యాపారం చేస్తున్నాడు. మండలకేంద్రంలో మరో మహిళతో వివాహేతర సంబంధంతో అదనపు కట్నం తీసుకురావాలని మద్యం తాగి భార్యను రోజూ వేధించేవాడు. ఆ వేధింపులు తట్టుకోలేక తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement