చికిత్స కోసం ఆస్తులు అమ్ముకున్నాడు!. | Person Died Because Of Frequent Stomach Pain In Medak | Sakshi
Sakshi News home page

చికిత్స కోసం ఆస్తులు అమ్ముకున్నాడు!.

Feb 16 2020 11:49 AM | Updated on Feb 16 2020 2:32 PM

Person Died Because Of Frequent Stomach Pain In Medak - Sakshi

శ్రీనివాస్‌రెడ్డి (ఫైల్‌)

సాక్షి, సిద్దిపేట, రూరల్‌:  కడుపు నొప్పి తాళలేక పురుగుల మందు తాగడంతో  రెండు రోజులుగా చికిత్స పొందుతూ చెల్కల శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందిన ఘటన జక్కాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, పోలీసుల వివరాల ప్రకారం.. చెల్కల శ్రీనివాస్‌రెడ్డి (33) బతుకు దెరువు కోసం బయటి దేశం వెళ్లి అక్కడి వాతావరణం, భోజనం సరిగ్గా లేకపోవడంతో కడుపునొప్పితో బాధపడగా రెండేళ్ల క్రితం తిరిగొచ్చాడు. అప్పటి నుంచి శ్రీనివాస్‌రెడ్డి మెరుగైన వైద్యం కోసం చూపించుకుంటున్నాడు.

అతడు ఆస్తులు అమ్మి వైద్యం చేయించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో శ్రీనివాస్‌రెడ్డికి తన జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వ్యవసాయ బావి వద్ద పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. ఇదే క్రమంలో అతడి అన్నదమ్ములు చంద్రారెడ్డి, మల్లారెడ్డి రోజువారిగా బావి వద్దకు వెళ్లగా అక్కడ ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటున్న తమ్ముడిని చూసి వెంటనే కుటుంబ సభ్యులతో సిద్దిపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు.  వైద్యులు పరిస్థితి విషమించిందని గాంధీ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. గాంధీలో చికిత్స పొందుతూ శనివారం ఉద యం మృతి చెందినట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement