దాణా కుంభకోణంలో రాంచీలో జైలు శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భద్రతకు ముప్పు పొంచివుందని జార్ఖండ్ పోలీసులు హెచ్చరించారు. లాలూ భద్రతపై జార్ఖండ్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆ రాష్ట్ర జైళ్ల శాఖను అప్రమత్తం చేశారు. లాలూ ఉన్న జైల్లోనే మావోయిస్టులు ఉండటం, అత్యున్నత స్థాయి వ్యక్తులు ఆయనను కలిసేందుకు జైలుకు వస్తుండటంతో భద్రతాపరమైన ముప్పు ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
ఐదేళ్లు జైలు శిక్షపడ్డ లాలూను రాంచీలో ఉంచిన సంగతి తెలిసిందే. ఆయనను వీఐపీ ఖైదీలా పరిగణించి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రత్యేక బెడ్రూమ్, దోమతెర, మంచం, టీవీ సెట్, వార్తా పత్రికలు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
రాంచీ జైల్లో లాలూ భద్రతకు ముప్పు
Published Sun, Oct 20 2013 4:29 PM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
Advertisement
Advertisement