సాక్షి, రాంచీ: పశుగ్రాసం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించడంతో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాంచీలోని హాత్వార్ జైలులో ఉంచారు. ఈ జైలులో లాలూ తన రొటీన్ లైఫ్‌కు ఏ మాత్రం భంగం కలుగనిరీతిలో వ్యవహరిస్తున్నారు. జైలులోని అప్పర్ డివిజన్ సెల్‌లో లాలూ లీజర్ టైమ్ గడుపుతున్నారు. ఇదే జైలులో ఉన్న సహచర రాజకీయ నేతలతో పలుమార్లు తేనీరు సేవిస్తూ మంతనాలు జరుపుతూ లాలూ హుషారుగా కనిపిస్తున్నారు.
ఉదయాన్నే వార్తాపత్రికలు చదవడం, ఆయా వార్తలపై రాజకీయ సహచరులతో విపులంగా చర్చించడంతో లాలూ రోజు మొదలవుతుంది. వారి చర్చలు ప్రధానంగా బీహార్, జార్ఖండ్ రాజకీయాల చుట్టూ తిరుగుతాయని జైలు వర్గాలు తెలిపాయి. లాలూ సెల్‌కు దగ్గరలోనే అప్పర్ డివిజన్ సెల్ మెస్ ఉండటంతో రోజంతా లాలూ బృందానికి టీలు, స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి.
లాలూ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటుండగా అదే సమయంలో సెల్‌లోని ఇతర ఖైదీలు టీవీ చూస్తుంటారు. సెల్‌లో లాలూతో పాటు మాజీ ఎంపీ ఆర్‌కే రాణా, నేతలు జగదీష్ శర్మ, స్వర్ణ లక్రా, రాజా పీటర్, కమల్ కిషోర్ భగత్‌లున్నారు. ఇక లాలూకు ఇష్టమైన స్వీట్ కార్న్, వేయించిన బఠాణీలు, బాస్మతి రైస్ తదితర వంటకాలను జైలు మెస్‌లో అందుబాటులో ఉంచారు. లాలూ నివాసం నుంచి సంకట్ మోచన్ ఆలయ ప్రసాదం పంపారు.
Comments
Please login to add a commentAdd a comment