లాలూప్రసాద్ యాదవ్కు బెయిల్ నిరాకరణ | Jharkhand High Court rejects Lalu Prasad Yadav bail plea | Sakshi
Sakshi News home page

లాలూప్రసాద్ యాదవ్కు బెయిల్ నిరాకరణ

Published Thu, Oct 31 2013 12:29 PM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM

లాలూప్రసాద్ యాదవ్కు బెయిల్ నిరాకరణ

లాలూప్రసాద్ యాదవ్కు బెయిల్ నిరాకరణ

దాణా కుంభకోణంలో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టులో చుక్కెదురైంది. లాలూకు బెయిల్ దక్కలేదు. బెయిల్ పిటిషన్ను అనర్హమైనదిగా పేర్కొంటూ గురువారం న్యాయస్థానం తోసిపుచ్చింది. లాలూకు బెయిల్ రాకపోవడంతో వ్యతిరేక నినాదాలు చేసిన ఆర్జేడీ కార్యకర్తల్ని భద్రతాధికారులు కోర్టు సముదాయం నుంచి బయటకు పంపించారు.

బెయిల్ కోసం లాలూ చేసిన దరఖాస్తును విచారించిన కోర్టు తీర్పును నేటికి రిజర్వ్లో ఉంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దాణా స్కాంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాకు బెయిల్ మంజూరవడంతో లాలూకు వస్తుందని భావించారు. అయితే నిరాశ ఎదురైంది. లాలూ, మిశ్రాతో పాటు మొత్తం 43 మందికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా పేర్కొంటూ శిక్షలు ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement