రాంచీ: దాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు సాక్ష్యులను ఆయన ప్రవేశపెట్టారు. గత మంగళవారం కూడా లాలూ ఇదే కోర్టుకు హాజరై మరో కేసుకు సంబంధించి స్టేట్‌మెంట్ ఇచ్చారు.
రూ.900 కోట్ల దాణా కుంభకోణం ఆయన బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఐదు కేసులుండగా ఒక కేసుకు సంబంధించి దోషిగా తేలటంతో సీబీఐ న్యాయస్థానం గత మే నెలలో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.