Lalu prasad yadv
-
రేపే బిహార్ ఫలితాలు.. క్షీణించిన లాలూ ఆరోగ్యం
పట్నా : ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. రేపు(నవంబర్ 10) బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో లాలూప్రసాద్ యాదవ్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు వైద్యులు తెలిపారు. లాలూకు డయాలసిస్ కొనసాగుతుందని చెప్పారు. ఈ మేరకు సోమవారం లాలూ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ 2017 నుంచి జైలులో ఉన్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నానని, అయినప్పటీకి ఇప్పటివరకు ఆయనకు డయాలసిస్ చేయాల్సిన అవసరం రాలేదని వైద్యులు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో డయాలసిస్ చేస్తున్నట్లు రిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల ప్రచారంలో లాలూ ప్రసాద్ పాల్గొననప్పటికీ, ప్రతి రోజు పార్టీ కార్యక్రమాలు, ప్రజల అభిప్రాయాలను టీవీ చానళ్లు, వార్త పత్రికల ద్వారా సమీక్షించేవాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా ఆయన పరిశీలించారని చెప్పారు. రేపే ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో లాలూ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని, అందుకే ఆరోగ్యం క్షీణించిందని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. కాగా, 243 అసెంబ్లీ స్థానాలకు ఉన్న బిహార్‌లో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఆర్జేడీ-కాంగ్రెస్- కూటమికే జైకొట్టాయి. -
మీడియా ముందుకు రండి.. ప్రశాంత్ కిషోర్ ఛాలెంజ్
పట్నా : తమ పార్టీని సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో విలీనం చేయాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించారని బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ ఘటుగా స్పందించారు. లాలు కోరుకుంటే ఎప్పుడైనా తనతో పాటు మీడియా ముందుకు వచ్చి చర్చ జరపవచ్చని ఛాలెంజ్ చేశారు. మీడియా ముందు చర్చ జరిగితే ఎవరేంటో..ఆ రోజు ఏం జరిగిందో, ఎవరు ఎవరికి ఏం ఆఫర్ ఇచ్చారో ప్రజలకు తెలియజేయవచ్చు అని ట్విట్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు నిజాన్ని కాపాడుతున్నారా అని మండిపడ్డారు. చదవండి...‘ప్రశాంత్ కిశోర్ మా పార్టీని విలీనం చేయమన్నారు’ కాగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను ఆర్జేడీ తిప్పికొట్టింది. ‘పండిత్ జీ.. మీ వయసు మా పార్టీ అధినేత అనుభవమంతా కాదు. మీలాంటి రాజకీయ నాయకులను చాలా మంది వచ్చి వెళ్లారు. మోదీ, నితీష్ల దగ్గరకు వెళ్లి మీ స్టోరీలను అమ్ముకోండి. మేము నిజం బయటపెడితే మీ పరువు, కీర్తి పోతుంది’ అని పార్టీ ట్వీట్ చేసింది. సీఎం నితీశ్ తరఫున ప్రశాంత్ మమ్మల్ని కలిశారని, రెండు పార్టీలను విలీనం చేసి, ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దామని చెప్పారని రబ్రీ దేవి ఆరోపించారు. ఒక సందర్భంలో తనకు బాగా కోపం వచ్చి ఆయన్ను బయటకు వెళ్లిపోవాలని చెప్పానన్నారు. ప్రశాంత్ కిశోర్.. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నితీశ్ కుమార్, లాలూతో కలిసి పని చేశారు. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ సహా ఆరు పార్టీలు జనతా పరివార్‌గా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి. నితీశ్ కుమార్‌ను తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించాయి. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ 81 స్థానాలు, జేడీయూ 70, బీజేపీ 53 స్థానాల్లో గెలిచాయి.అనంతరం ఆర్జేడీ, జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2017లో నితీశ్ కూటమి నుంచి బయటకు వచ్చి.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. -
సీబీఐ కోర్టుకు హాజరైన లాలూ
రాంచీ: దాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు సాక్ష్యులను ఆయన ప్రవేశపెట్టారు. గత మంగళవారం కూడా లాలూ ఇదే కోర్టుకు హాజరై మరో కేసుకు సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చారు. రూ.900 కోట్ల దాణా కుంభకోణం ఆయన బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఐదు కేసులుండగా ఒక కేసుకు సంబంధించి దోషిగా తేలటంతో సీబీఐ న్యాయస్థానం గత మే నెలలో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.