
లాలూను మండేలాతో పోల్చిన జార్ఖండ్ మంత్రి
మెదినినగర్: దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలాతో పోల్చారు జార్ఖండ్ రాష్ట్ర మంత్రి అన్నపూర్ణా దేవి. ప్రధాని పదవికి భవిష్యత్లో లాలూ గట్టి పోటీదారు అవుతారని జోస్యం చెప్పారు.
వివక్ష వ్యతిరేక పోరాటయోధుడు నెల్సన్ మండేలా 27 ఏళ్లు జైలు జీవితం గడిపిన తర్వాత బయటకు వచ్చి దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవిని అధిష్టించారని గుర్తుచేశారు. అలాగే తమ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ప్రధాని పదవికి గట్టి పోటీదారు అవుతారని ఆర్జేడీ నాయకురాలు కూడా అయిన అన్నపూర్ణా దేవి వ్యాఖ్యానించారు. ఆర్జేడీ పాలమావ్ విభాగం కార్యకర్తల సమావేశంలో ఆమె వ్యాఖ్యలు చేశారు.