Annapurna Devi
-
Dussehra 2024 : శరన్నవరాత్రులు, అన్నపూర్ణాదేవిగా పూజలు
దసరా సందర్బంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవ రాత్రులలో తొలి రోజు బాలా త్రిపుర సుందరిగా, రెండో రోజు గాయత్రిదేవిగా భక్తుల పూజలందుకున్న ఆ జగన్మాత మూడో రోజు(అక్టోబర్ 5వ తేదీ శనివారం)అమ్మవారిని అన్నపూర్ణా దేవి రూపంలో పూజిస్తారు. మూడోరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజలందుకోనుంది.ఆది పరాశక్తిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించి 'భిక్షాందేహి కృపావలంబన కరీ, మాతాన్నపూర్ణేశ్వరీ!' అని ప్రార్థిస్తారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అన్నం పరబ్రహ్మస్వరూపం. సకల జీవరాశికి ఆహారాన్ని ప్రసాదించాలని అన్నపూర్ణ దేవిని వేడుకుంటారు. అంతేకాదు ఈ రోజునే తల్లులందరూ స్తనవృద్ధి గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. (నవరాత్రుల ఉపవాసాలు : ఈజీగా, హెల్దీగా సగ్గుబియ్యం కిచిడీ)అన్నపూర్ణ దేవికి గంధం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఈ రంగులు ఇచ్చేందుకు ప్రతీక. ఈ రోజు అమ్మవారికి గారెలు, కట్టె పొంగలి, దధ్యోజనం నైవేద్యంగా పెడతారు. ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధివికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత కలుగుతాయి. మరోవైపు శరన్నవరాత్రుల్లో భాగంగా నాడు మూడో రోజు చంద్రఘంట మాతను ఆరాధిస్తారు. దుర్గా దేవి మూడో రూపమే చంద్రఘంట దేవి.చంద్రఘంట మాత పూజ చేసే వారు ఎక్కువగా ఎరుపు, నారింజ రంగులను ఉపయోగిస్తారు. ఎర్ర చందనం, ఎర్ర చున్ని, ఎర్రని పువ్వులు, ఎర్రని పండ్లను నైవేద్యంగా నివేదిస్తారు. అలాగే చంద్రఘంట అమ్మవారికి పాలతో చేసిన తియ్యని పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. (నవరాత్రి ప్రసాదాలు: పచ్చికొబ్బరితో లడ్డు ) -
కోల్‌కతా కేసులో మోదీకి లేఖ.. సీఎం మమతకి కేంద్రం కౌంటర్
ఢిల్లీ: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి స్పందిస్తూ దీదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బెంగాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నప్పటికీ.. పనితీరు బాగా లేదని విమర్శించారు. మహిళలకు భద్రత కల్పించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనలో ప్రధాని మోదీ నేరుగా స్పందించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. ఈ క్రమంలో 22వ తేదీన ఈ ఘటనపై తాను లేఖ రాసినా ఎలాంటి సమాధానం రాలేదని శుక్రవారం రాసిన మరో లేఖలో ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మమత లేఖపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవీ స్పందించారు.महिलाओं को सशक्त बनाना और उन्हें सुरक्षित वातावरण प्रदान करना भारत सरकार की सर्वोच्च प्राथमिकता है। सरकार महिला सुरक्षा के प्रति पूर्णतः समर्पित है और इसे अपनी प्रमुख जिम्मेदारी मानती है। (1/2) ...@narendramodi | @MamataOfficial pic.twitter.com/zKNa1AzNyN— Annapurna Devi (@Annapurna4BJP) August 30, 2024ట్విట్టర్ వేదికగా అన్నపూర్ణా దేవీ.. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలకు సంబంధించి కఠినమైన చట్టాలు, శిక్షలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. కానీ, బెంగాల్లో ఫాస్ట్ కోర్టుల పనితీరు బాగాలేదు. పశ్చిమ బెంగాల్లో 48,600 అత్యాచార, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యాచారం, పోక్సో కేసులను ప్రత్యేకంగా పరిష్కరించేందుకు బెంగాల్ ప్రభుత్వం అదనంగా 11 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, అమలు చేయలేదు. ఇవి ప్రత్యేకమైన పోక్సో కోర్టులు లేదా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అత్యాచారం, పోక్సో కేసులు రెండింటినీ విచారిస్తాయి అని చెప్పుకొచ్చారు. ముందుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని హితవు పలికారు. -
కేవీల్లో ఎంపీల కోటా పునరుద్ధరణ యోచన లేదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు పార్లమెంట్ సభ్యుల కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో సోమవారం కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి ఒక ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ విద్యా సంస్థలను ప్రాథమికంగా రక్షణ, పారా మిలటరీ, కేంద్ర అటానమస్ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసినవని వివరించారు. ఎంపీలకు కోటా ఇవ్వడం వల్ల ఒక్కో సెక్షన్లో 40 మంది విద్యార్థుల పరిమితి దాటిపోతోందన్నారు. ఇది బోధనపై ప్రభావం చూపుతోందని వివరించారు. గతంలో ఒక్కో ఎంపీ ఒక కేవీలో 10 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని సిఫారసు చేసేందుకు వీలుండేది. మొత్తం 543 మంది లోక్‌సభ, 245 మంది రాజ్యసభ సభ్యులు కలిపి కేవీల్లో ఏటా తమ కోటా కింద 7,880 మంది విద్యార్థుల ప్రవేశాలకు సిఫారసు చేసేవారు. -
అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో నాలుగో రోజైన గురువారం దుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి అమ్మవారికి పట్టు వ్రస్తాలను సమర్పించారు. గురువారం సుమారు 70 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. అన్నపూర్ణాదేవి విశేష అలంకారం కావడంతో భక్తులు ప్రసాద స్వీకరణకు బారులు తీరారు. సాయంత్రం శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభు త్వ విఫ్ కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. నేడు శ్రీలలితా త్రిపుర సుందరిగా.. దసరా ఉత్సవాల్లో 5వ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. -
రాష్ట్రాలు కోరితేనే నవోదయ విద్యాలయాలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలు కోరితేనే జవహర్ నవోదయ విద్యాలయాలు (జేఎన్వీలు) ఏర్పాటు చేస్తామని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణాదేవి చెప్పారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. నూతన నవోదయ విద్యాలయాల ఏర్పాటును కోరే రాష్ట్రాలు శాశ్వత భవన నిర్మాణాలకు తగిన భూమిని ఉచితంగా సమకూర్చాలని చెప్పారు. శాశ్వత భవనాల నిర్మాణం జరిగే వరకు విద్యాలయం నిర్వహణకు తాత్కాలిక భవనాలను రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా సమకూర్చాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అదనంగా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఒకటి, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ రోడ్ల నిర్వహణ రాష్ట్రాల బాధ్యతే ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రహదారుల నిర్వహణ బాధ్యత ఆయా రాష్ట్రాల బాధ్యతేనని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఈ పథకం కింద నిర్మించే గ్రామీణ రోడ్ల నిర్వహణకు అవసరమైన నిధులు గ్రాంట్ల రూపంలో ఆయా రాష్ట్రాలకు అందించాలని 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఏపీలో పీఎంకేవీవై–ఎస్టీటీలో 91,203 మందికి ప్లేస్మెంట్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై)లో భాగంగా షార్ట్ టర్మ్ ట్రైనింగ్ (ఎస్టీటీ) పొందిన 91,203 మందికి ప్లేస్మెంట్ అవకాశాలు కల్పించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు జవాబుగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. పీఎంఏవై–జీలో 46,718 ఇళ్ల నిర్మాణం ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ (పీఎంఏవై–జీ) పథకంలో భాగంగా ఏపీలో 46,718 ఇళ్లు నిర్మించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు జవాబుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి చెప్పారు. పీఎంజీఎస్వైలో ఏపీకి 3,285 కి.మీ. రహదారులు ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు 3,285 కిలోమీటర్ల రహదారులు కేటాయించామని, దీన్లో 2,314 కిలోమీటర్లకు అనుమతి ఇచ్చామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి చెప్పారు. వైఎస్సార్సీపీ సభ్యుడు పరిమళ్ నత్వానీ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. మిగిలిన కిలోమీటర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. -
నాట్య మయూరి అన్నపూర్ణాదేవి ఇకలేరు
సాక్షి, అమరావతి/విజయవాడ కల్చరల్: ప్రఖ్యాత నాట్య కళాకారిణి లంక అన్నపూర్ణాదేవి (70) అడుగులు ఆగిపోయాయి. నాట్యమయూరి, కళానిధి, కళాప్రపూర్ణ బిరుదులందుకున్న ఆమె విజయవాడ రామవరప్పాడులోని వృద్ధాశ్రమంలో మంగళవారం మృతి చెందారు. కృష్ణా జిల్లా తేలప్రోలులో బుధవారం అంత్యక్రియలు జరిగాయి. నాట్య కళాకారిణిగా జీవితంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని విజేతగా నిలిచి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఈ విషయమై గతేడాది సెప్టెంబర్‌లో ‘తడబడిన నాట్య మయూరి అడుగులు’ శీర్షికన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. అన్నపూర్ణాదేవి జీవన నేపథ్యమిదీ.. ► కృష్ణా జిల్లా గుడివాడలో లక్ష్మీనారాయణ, సుబ్బలక్ష్మి దంపతులకు 1949 మే నెలలో జన్మించిన లంక అన్నపూర్ణాదేవి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ► చిన్నప్పుడే ఆమె చింతా సీతారామాంజనేయులు, భాగవతుల రామతారకం వద్ద భరత నాట్యం నేర్చుకున్నారు. కూచిపూడి కులపతి చింతా కృష్ణమూర్తి వద్ద కూచిపూడి నృత్యాన్ని అభ్యసించి దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలిచ్చారు. ► 1962లో భారత్–చైనా యుద్ధ సమయం లో దేశ సరిహద్దులకు వెళ్లి సైనికులలో ఉ త్తేజం నింపేలా నాట్య ప్రదర్శనలిచ్చారు. ఇందుకు గాను నాటి ప్రధాని నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిర, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ అభినందనలు అందుకున్నారు. ► 1973లో రైలు ప్రమాదంలో అన్నపూర్ణకు ఒక కాలు మోకాలి వరకు తెగిపోగా, మరో కాలు మడమ వరకు దెబ్బతింది. ► ఆ తరువాత కొయ్య కాలు అమర్చుకుని దేశవ్యాప్తంగా 200కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ► 1982లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ ఘంటసాల సంగీత కళాశాలలో డ్యాన్స్ టీచర్ ఉద్యోగం ఇచ్చింది. ► 2006లో ఉద్యోగ విరమణ చేసిన ఆమె విజయవాడ సత్యనారాయణపురంలో స్థిర పడ్డా రు. గతేడాది సెప్టెంబర్‌లో అనారోగ్యం పా లైన ఆమెను బంధువులు, శిష్యు లు వైద్యం చేయించి వృద్ధాశ్రమంలో చేర్పించారు. కళాకారుల సంతాపం లంక అన్నపూర్ణాదేవి మృతి పట్ల నగరానికి చెందిన ఆంధ్ర నాట్యాచార్యుడు ఉమామహేశ్వర పాత్రుడు, పద్మశ్రీ హేమంత్, హైదరాబాద్‌కు చెందిన శిష్యురాలు భావన సంతాపం తెలిపారు. -
దారులన్నీ అమ్మ సన్నిధికే..
ఇంద్రకీలాద్రిపై నాల్గవరోజు జగన్మాత శ్రీఅన్నపూర్ణాదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్తజనబాంధవి, అన్నార్తుల పాలిట అన్నపూర్ణమ్మగా అందరింటా పూజలందుకునే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తజనం బారులు తీరారు. ఓ వైపు కుంకుమార్చనలు, మరోవైపు చండీయాగం, వేదఘోషతో కృష్ణాతీరం బుధవారం పులకించింది. సెలవు దినం కలసి రావడం పిల్లా–పెద్దా కొండకు బారులు తీరారు. క్యూలైనులన్నీ భక్తులతో కిక్కిరిసి కనిపించాయి. వచ్చిన ప్రతిభక్తుడికి సులభంగా ‘అమ్మ’ దర్శనం లభించేలా.. సంతృప్తిగా భోజన ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లేలా యంత్రాంగం చేపట్టిన చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి. సాక్షి, ఇంద్రకీలాద్రి (విజయవాడ) : అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను దర్శించుకునేందుకు అశేష భక్తజనం ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. జిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చి దుర్గమ్మను దర్శించుకున్నారు. బుధవారం సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు రద్దీ కనిపించింది. తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి విశేష అలంకారం, నిత్య పూజల అనంతరం ఆలయ ఈవో ఎంవీ. సురేష్‌బాబు, నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఇతర అధికారులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో క్యూలైన్లు కిటకిట లాడాయి. సర్వదర్శనం, రూ. 100 టికెట్ దర్శనానికి రెండు గంటల సమయం పట్టగా, రూ. 300, వీఐపీ క్యూలైన్లో నాలుగు గంటల సమయం పట్టింది. మహా మండపం ఆరో అంతస్తులో నిర్వహించిన విశేష కుంకుమార్చన, మల్లేశ్వరాలయం సమీపంలోని యాగశాలలో నిర్వహించిన చండీయాగంలో ఉభయదాతలు పాల్గొన్నారు. అంతరాలయం దర్శనం రద్దు రూ. 300, వీఐపీ టికెట్లు, ఉత్సవ కమిటీ సభ్యుల సిఫార్సుతో దర్శనానికి విచ్చేసిన భక్తులతో ప్రత్యేక క్యూలైన్ మార్గంలో రద్దీ కనిపించింది. దీంతో బుధవారం అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. అయితే ముందస్తుగా ఎటువంటి ప్రకటన చేయకుండా అంతరాలయ దర్శనాన్ని రద్దు చేయడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. క్యూలైన్లో సీపీ టికెట్ల తనిఖీ వీఐపీ క్యూలైన్లో రద్దీ అధికంగా ఉండటం, ఆర్జీత సేవలలో పాల్గొన్న ఉభయదాతలకు దర్శనం ఆలస్యం కావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో దేవస్థానానికి విచ్చేసిన నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు క్యూలైన్లను పరిశీలించారు. దీంతో సీపీని పలువురు భక్తులు నిలదీయడంతో ఆయన క్యూలైన్లో ఉన్న భక్తుల వద్ద టికెట్లను తనిఖీ చేశారు. అయితే వీరిలో అనేక మంది ఎటువంటి టికెట్లు లేకుండా దర్శనానికి క్యూలైన్లో వేచి ఉండటం గమనించారు. దీనిపై ఈవో ఎంవీ. సురేష్‌బాబుతో మాట్లాడారు. అంతే కాకుండా వీఐపీలకు కేటాయించిన సమయంలోనే దర్శనానికి అనుమతించాలని పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వీఐపీల పేరిట వచ్చేవారు దేవస్థానం నిర్ణయించిన సమయంలోనే క్యూలైన్లోకి అనుమతిస్తామని పోలీసులు సిబ్బంది పేర్కొనడంతో కొద్దిసేపు ప్రాంగణంలో గందరగోళ పరిస్ధితి ఏర్పడింది. మార్మోగిన పురవీధులు ఆలయాల్లో నిత్య పూజలు అందుకునే ఆది దంపతులు, దసరా మహోత్సవాల సందర్భంగా పల్లకిలో ఊరేగుతూ తమ మధ్యకు రావడంతో భక్తజనం పులకించారు. కోలాట నృత్యాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కేరళ వాయిద్యాలు, పంచ వాయిద్యాలతో నగరోత్సవం కోలాహలంగా సాగింది. యాగశాల నుంచి ప్రారంభమైన ఈకార్యక్రమం మహా మండపం, కనక దుర్గనగర్, కెనాల్‌రోడ్డు, వినాయకుడి గుడి, దుర్గాఘాట్, మీదగా ఆలయానికి చేరుకుంది. శ్రీచక్ర సంచారిణే వన్‌టౌన్ (విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మ నిత్యం శ్రీచక్రంలోనే సంచారం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సృష్టి, స్థితి, లయ కారిణి, లోకమాతగా పేర్కొనే జగన్మాత నిత్యం కొలు ఉండే పవిత్ర స్థలమే శ్రీచక్రమే. ఈ శ్రీచక్రానికి అధిష్టాన దేవత శ్రీ లలితాత్రిపుర సుందరీదేవి. అయితే లలితాదేవే దుర్గమ్మ, ఈ దుర్గమ్మే లలితాదేవని, రెండిటికీ బేధం లేదని పండితులు చెబుతారు. పూర్వం ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్దినీగా ఉగ్రరూపంలో దర్శనమిచ్చే దుర్గమ్మను శంకరాచార్యులవారు దర్శించారు. ఆమెను శాంతపరిచేందుకు శ్రీచక్రాన్ని దుర్గమ్మ సన్నిధిలో ప్రతిష్టించారు. అమ్మవారికి నిర్వహించే పూజలన్నీ శ్రీచక్రానికే నిర్వహించాలని సూచించారు. అప్పటి నుంచి అమ్మవారి సన్నిధిలో పూజలన్నీ శ్రీచక్రానికే నిర్వహిస్తున్నారు. లోకపావని కనకదుర్గమ్మ సన్నిధిలో శ్రీచక్ర నవావరణార్చన నిత్యం అత్యంత వైభవంగా జరుగుతోంది. లలితా త్రిపురసుందరీ దేవికి సాక్షాత్తూ లక్ష్మీ, సరస్వతులే వింజామరులు విసురుతూ సేవలందిస్తుంటారు. అత్యంత మహిమాన్వితమైన శ్రీచక్రం రెండు విధాలుగా మనకు కనిపిస్తుంది. మొదటిది భూప్రస్తరం. ఇది యంత్ర రూపంలో ఒక రాగి లేక వెండి రేకు మీద రేఖలతో చెక్కించబడి ఉంటుంది. రెండోది మేరు ప్రస్తరం. ఇది శ్రీచక్రంలోని బిందు త్రికోణాది రేఖలు, వృత్తాలు, దళాలు పైకి శిఖరంలాగా కనిపించేలా పోతపోయబడి ఉంటుంది. ఈ మేరు ప్రస్తరం శ్రీ చక్రం నవావరణార్చన జరపటానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానంలో లక్ష కుంకుమార్చన జరిగే అమ్మవారి దగ్గర, నిత్యపూజల అమ్మవారి దగ్గర, నవావరణార్చన దగ్గర మేరు ప్రస్తమైన శ్రీచక్రాల్నే ప్రతిష్టించడం జరిగింది. వాటికే అర్చకస్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. సాధారణ పూజలకు భిన్నంగా శ్రీచక్ర నవావరణార్చన జరగడం విశేషం. శక్తి ప్రధానమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం దినదిన ప్రవర్ధమానమై లక్షలాది మంది భక్తుల్ని ఆకర్షించటానికి కారణం ఇక్కడ నిరంతరం శ్రీచక్రానికి జరుపబడే పూజలే. అందుకే అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా శ్రీచక్రానికి నిత్యం శాస్త్రోక్తంగా పూజలను నిర్వహిస్తారు. ఈ పూజల నిమిత్తం దేవస్ధానం ప్రత్యేకంగా ఒక అర్చకుడిని సైతం నియమించింది. అనుకున్న కొర్కెలు తీరటం కోసం, ఐశ్వర్య ప్రాప్తికోసం, వ్యాపారాభివృద్ధి కోసం, సమస్త శుభాలు జరగటం కోసం ఈ అర్చనను అందరూ జరిపించుకుంటారు. దుర్గమ్మ సేవలో పీవీపీ ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్సార్ సీపీ నాయకులు పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) బుధవారం అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన పీవీపీని ఆలయ ఈవో ఎంవీ. సురేష్‌బాబు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న పీవీపీకి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందచేశారు. అనంతరం ఆలయ ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందచేశారు. ప్రముఖుల రాక దుర్గమ్మను బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కుమార్ విశ్వజిత్, ఆలయ పూర్వ ఈవో, సివిల్ çసప్లయిస్ ఎండీ సూర్యకుమారి, టీడీపీ నాయకులు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా, మీడియా పాయింట్లో మాట్లాడారు. దుర్గమ్మను బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కుమార్ విశ్వజిత్, ఆలయ పూర్వ ఈవో, సివిల్ çసప్లయిస్ ఎండీ సూర్యకుమారి, టీడీపీ నాయకులు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా, మీడియా పాయింట్లో మాట్లాడారు. నాల్గో రోజు ఆదాయం రూ. 35.56 లక్షలు దసరా ఉత్సవాలలో నాల్గో రోజున దేవస్థానానికి రూ. 35.56 లక్షల మేర ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. రూ. 300 టికెట్ల విక్రయం ద్వారా రూ. 12.75 లక్షలు, రూ.100 టికెట్ల విక్రయం ద్వారా రూ. 7.10 లక్షలు, వీఐపీ టికెట్ల దర్శనం రూ. 1.62 లక్షలు, లడ్డూ ప్రసాదం విక్రయం రూ. 8.40 లక్షలు, లక్ష కుంకుమార్చన టికెట్ల విక్రయం ద్వారా రూ. 66 వేల ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. మూడో రోజున దేవస్థానానికి మొత్తంగా రూ. 32.90 లక్షల మేర ఆదాయం సమకూరింది. గత ఏడాది దసరా ఉత్సవాలలో మూడో రోజున దేవస్థానానికి రూ. 42.97 లక్షల మేర ఆదాయం సమకూరగా, ఈ ఏడాది సుమారు రూ. 10 లక్షల మేర ఆదాయం తగ్గింది. –ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) నేటి అలంకారంశ్రీ లలితా త్రిపుర సుందరీదేవి దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలలో ఐదో రోజు గురువారం అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరిదేవిగా అలంకరిస్తారు. అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా వేంచేసి తన భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతిదేవీ ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరు మందహాసంతో, వాత్సల్య జితోష్నలను చిందిస్తూ, చెరుకు గడను చేత పట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చుని శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా, అమ్మవారు త్రిపురసుందరీదేవిగా భక్తుల చేత పూజలందుకుంటారు. -
లెజెండరీ మ్యుజీషియన్ అన్నపూర్ణా దేవి కన్నుమూత
సాక్షి, ముంబై : ప్రముఖ హిందూస్థానీ సంగీత విద్వాంసురాలు, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత అన్నపూర్ణా దేవి(91) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా వయోభారంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ తుదిశ్వాస విడిచారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని మహిళా వాయిద్యకారులకు ఆదర్శంగా నిలిచిన అన్నపూర్ణా దేవి మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. అన్నపూర్ణ దేవి ఫౌండేషన్ స్థాపించి సామాజిక సేవలో భాగమైన ఆమె మరణం తీరని లోటని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబమంతా సంగీత విద్వాంసులే.. అన్నపూర్ణా దేవి ప్రముఖ సంగీత విద్వాంసుడు, ఉస్తాద్ బాబా అలావుద్దీన్ ఖాన్, మదీనా బేగంల కుమార్తె. ఆమె అసలు పేరు రోషనార ఖాన్. తండ్రి నుంచి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రోషనార సర్బహర్(వీణ) వాయించడంలో ప్రావీణ్యం సంపాదించారు. ఆమె ప్రతిభను గుర్తించిన మిహైర్ ఎస్టేట్ మహరాజ బ్రిజినాథ్ ఆమె పేరును అన్నపూర్ణగా మార్చారు. అన్నపూర్ణ సోదరుడు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ కూడా సంగీత విద్వాంసుడే కావడం విశేషం. కాగా అన్నపూర్ణ తన 14వ ఏట ప్రముఖ సితార్ విద్వాంసుడు రవి శంకర్‌ను పెళ్లి చేసుకున్నారు. 20 ఏళ్ల అనంతరం ఆయన నుంచి విడాకులు తీసుకుని రుషి కుమార్ పాండ్యా అనే వ్యక్తిని వివాహమాడారు. ఆమె ఒక్కగానొక్క కుమారుడు (రవి శంకర్- అన్నపూర్ణ దంపతుల కుమారుడు) శుభేంద్ర శుభో శంకర్ 2013లో తన 50వ ఏట కన్నుమూశారు. -
అన్నపూర్ణాదేవిగా భద్రకాళి అమ్మవారు
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉదయం నాలుగు గంటలకు నిత్యాహ్నికం, సుప్రభాత పూజలు చేశారు. అనంతరం అమ్మవారి స్నపనమూర్తిని అన్నపూర్ణగా అలంకరించి బ్రహ్మచారిణి క్రమంలో పూజలు జరిపి మకర వాహనంపై ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ముఖ్యార్చకులు చెప్పెల నాగరాజుశర్మ , పార్నంది నర్సింహామూర్తి, పాలకుర్తి నర్సింహమూర్తి, టక్కరసు సత్యం ఆగమార్చన విధులు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు అమ్మవారి స్నపనమూర్తికి దేవజా క్రమంలో పూజలు నిర్వహించి చంద్రప్రభ వాహనంపై ఊరేగించారు. రాత్రి 9 గంటలకు మహాపూజ, కుమారీ, సువాసినీ పూజలు మహా నీరాజన మంత్రపుష్పము నిర్వహించారు. కాగా, మధ్యాహ్నం వేళలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఇదిలా ఉండగా, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, కేంద్ర సమాచారశాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.అంజనీదేవి, సూపరింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్, సిబ్బంది కూచన హరినా«థ్, కొత్తపల్లి వెంకటయ్య, అలుగు కృష్ణ, ఆశోక్, చింత శ్యాంసుందర్ పాల్గొన్నారు. కాగా, సోమవారం చంద్ర ఘంటాక్రమంలో పూజలు నిర్వహించి అమ్మవారిని గాయత్రీగా అలంకరించనున్నారు. -
లాలూను మండేలాతో పోల్చిన జార్ఖండ్ మంత్రి
మెదినినగర్: దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలాతో పోల్చారు జార్ఖండ్ రాష్ట్ర మంత్రి అన్నపూర్ణా దేవి. ప్రధాని పదవికి భవిష్యత్‌లో లాలూ గట్టి పోటీదారు అవుతారని జోస్యం చెప్పారు. వివక్ష వ్యతిరేక పోరాటయోధుడు నెల్సన్ మండేలా 27 ఏళ్లు జైలు జీవితం గడిపిన తర్వాత బయటకు వచ్చి దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవిని అధిష్టించారని గుర్తుచేశారు. అలాగే తమ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ప్రధాని పదవికి గట్టి పోటీదారు అవుతారని ఆర్జేడీ నాయకురాలు కూడా అయిన అన్నపూర్ణా దేవి వ్యాఖ్యానించారు. ఆర్జేడీ పాలమావ్ విభాగం కార్యకర్తల సమావేశంలో ఆమె వ్యాఖ్యలు చేశారు.