న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు పార్లమెంట్ సభ్యుల కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో సోమవారం కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి ఒక ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ విద్యా సంస్థలను ప్రాథమికంగా రక్షణ, పారా మిలటరీ, కేంద్ర అటానమస్ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసినవని వివరించారు.
ఎంపీలకు కోటా ఇవ్వడం వల్ల ఒక్కో సెక్షన్‌లో 40 మంది విద్యార్థుల పరిమితి దాటిపోతోందన్నారు. ఇది బోధనపై ప్రభావం చూపుతోందని వివరించారు. గతంలో ఒక్కో ఎంపీ ఒక కేవీలో 10 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని సిఫారసు చేసేందుకు వీలుండేది. మొత్తం 543 మంది లోక్‌సభ, 245 మంది రాజ్యసభ సభ్యులు కలిపి కేవీల్లో ఏటా తమ కోటా కింద 7,880 మంది విద్యార్థుల ప్రవేశాలకు సిఫారసు చేసేవారు.
Comments
Please login to add a commentAdd a comment