No proposal
-
అలాంటివేం లేవు.. టెస్లాకు షాకిచ్చిన భారత ప్రభుత్వం
అమెరికా విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎలాన్ మస్క్కు చెందిన ఈ కంపెనీ కార్ల దిగుమతిపై సుంకం రాయితీలు, స్థానిక విలువ జోడింపు మినహాయింపుల ప్రతిపాదనలేవీ పరిగణగించడం లేదని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం నుంచి టెస్లా పలు రాయితీలు, మినహాయింపులు ఆశిస్తున్న విషయం తెలిసిందే. భారీ బ్యాటరీలు, సెమీకండక్టర్లు, అయస్కాంత భాగాలపై స్థానిక విలువ జోడింపు నుంచి టెస్లా, ఇతర బహుళజాతి కార్ కంపెనీలను మినహాయించే ప్రతిపాదన ఏదైనా ఉందా అంటూ లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతిపై విధించే సుంకంపై రాయితీ కూడా ఏమీ ఉండదని తెలిపారు.. ఇది కూడా చదవండి: AI warning: బ్యాంకులకూ ముప్పు తప్పదా? హెచ్చరిస్తున్న జెరోధా సీఈవో నితిన్ కామత్ భారత ప్రభుత్వం రూ.25,938 కోట్ల బడ్జెట్ వ్యయంతో ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్ పరిశ్రమలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించిందని పేర్కొన్న ఆయన ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి విడి భాగాలతో సహా రేపటితరం ఆటోమోటివ్ టెక్నాలజీస్ ఉత్పత్తుల్లో దేశీయ తయారీని పెంచడమే లక్ష్యంగా ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు వివరించారు. -
కేవీల్లో ఎంపీల కోటా పునరుద్ధరణ యోచన లేదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు పార్లమెంట్ సభ్యుల కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో సోమవారం కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి ఒక ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ విద్యా సంస్థలను ప్రాథమికంగా రక్షణ, పారా మిలటరీ, కేంద్ర అటానమస్ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసినవని వివరించారు. ఎంపీలకు కోటా ఇవ్వడం వల్ల ఒక్కో సెక్షన్లో 40 మంది విద్యార్థుల పరిమితి దాటిపోతోందన్నారు. ఇది బోధనపై ప్రభావం చూపుతోందని వివరించారు. గతంలో ఒక్కో ఎంపీ ఒక కేవీలో 10 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని సిఫారసు చేసేందుకు వీలుండేది. మొత్తం 543 మంది లోక్సభ, 245 మంది రాజ్యసభ సభ్యులు కలిపి కేవీల్లో ఏటా తమ కోటా కింద 7,880 మంది విద్యార్థుల ప్రవేశాలకు సిఫారసు చేసేవారు. -
బంగారం వెల్లడికి ఎటువంటి పథకం లేదు
న్యూఢిల్లీ: ప్రభుత్వం బంగారానికి సంబంధించి ఎటువంటి క్షమాభిక్ష పథకాన్ని పరిశీలించడం లేదని కేంద్ర అధికార వర్గాలు స్పష్టం చేశాయి. లెక్కలు చూపని బంగారాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఓ స్వచ్ఛంద వెల్లడి పథకాన్ని త్వరలో కేంద్రం తీసుకురానుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఈ తరహా పథకం ఆదాయపన్ను శాఖ పరిశీలనలో లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. బడ్జెట్ ప్రక్రియ ఆరంభమైందని, ఈ ప్రక్రియకు ముందు ఈ తరహా వదంతులు రావడం సహజమేనని పేర్కొన్నాయి. ఓ పరిమితికి మించి లెక్కలు చూపని బంగారం కలిగి ఉన్న వారు స్వచ్ఛందంగా వెల్లడించి ప్రభుత్వం నిర్దేశించిన పన్ను చెల్లించేలా ఒక పథకం ప్రవేశపెట్టనున్నారని మీడియాలో కథనాలు రావడం గమనార్హం. -
రూ.2వేల నోటుపై కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ తరువాత ఆర్బీఐ కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2000 నోటుపై కేంద్రం మరోసారి కీలక ప్రకటన చేసింది. నల్లధనాన్ని నిరోధించే క్రమంలో రూ.500, వెయ్యినోట్లను రద్దు చేసినట్టుగానే 2వేల నోటును కూడా రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఆర్థికశాఖ లోక్సభలో క్లారిటీ ఇచ్చింది. రూ.2000 నోట్లను రద్దు చేసే ఉద్దేశం లేదని, ఆర్థికశాఖ సహాయమంత్రి రాధాకృష్ణన్ లోక్సభలో ఒక లిఖిత పూర్వక సమాధానంలో స్పష్టతనిచ్చారు. మరోవైపు అయిదు నగరాల్లో రూ.10 ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. రూ.10 ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చే క్రమంలో క్షేత్రస్థాయిలో కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్లలో ట్రయల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కాగా, ప్రస్తుతం ఉన్న రూ.500 నోట్ల సైజు 66 ఎంఎంX150 ఎంఎం ఉండగా, రూ.2000 నోట్ల సైజు 66 ఎంఎంX166 ఎంఎంగా ఉందని చెప్పారు. అలాగే రెండు కరెన్సీ నోట్ల మధ్య వ్యత్యాసాన్ని సులభంగా గుర్తించడానికి వీలుగా 10 మి.మీ తేడా ఉంచినట్టు తెలిపారు. -
రూ.2 వేల నోటుపై వివరణ ఇచ్చిన జైట్లీ
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం చలామణిలోకి తీసుకొచ్చిన కొత్త రూ.2వేల నోటుపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీవివరణ ఇచ్చారు. రూ.2 వేల నోటును రద్దు చేసే ఆలోచన లేదని శుక్రవారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో స్పష్టం చేశారు. డీమానిటైజేషన్ తరువాత తీసుకొచ్చిన రూ .2 వేల నోటును ఉపసంహరించుకోవాలనే ప్రతిపాదన లేదని లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో జైట్లీ తెలిపారు. అలాగే రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత రూ 12.44 లక్షల కోట్ల (డిసెంబర్ 10, 2016 నాటికి) మొత్తం పాతనోట్లు బ్యాంకులకు చేరినట్టు లోక్సభలో చెప్పారు. మార్చి 3, 2017 నాటికి మొత్తం చలామణీలో వున్న కరెన్సీ విలువ రూ.12 లక్షలకోట్లుగా ఉండగా, జనవరి 27 నాటికి రూ.9.921 లక్షల కోట్లుగా ఉందని వివరించారు. అయితే ఈ వివరాలను ఇంకా పరిశీలించాల్సి ఉందని, అకౌంటింగ్ లో తప్పులు, డబుల్ కౌంటింగ్ తదితర కారణాల రీత్యా పూర్తివివరాలు ఇంకా అందాల్సి ఉందన్నారు. అనినీతిని, నల్లధనం, నకీలి కరెన్సీ, టెర్రరిజాన్ని నిరోధించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దును చేపట్టిందని ఆర్థిక మంత్రి సభలో ప్రకటించారు. డీమానిటైజేషన్ కాలంలో నగదు విత్ డ్రా లపై కొన్ని నిబంధనలు విధించినా, ఆ తర్వాత క్రమంగా వాటిని తొలగించామని జైట్లీ చెప్పారు.