kendriya vidyalayas
-
కొత్తగా 85 కేవీలు, 28 ‘నవోదయ’లు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే ఒక కేంద్రీయ విద్యాలయ విస్తరణకు అంగీకారం తెలిపింది. మంత్రివర్గం శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైంది. పలు నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు. కొత్తగా ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాసంస్థలతో 82 వేల మందికిపైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని, వారికి నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 1,256 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో ఒకటి మాస్కోలో, మరొకటి ఖాట్మాండులో, ఇంకోటి టెహ్రాన్‌లో ఉన్నాయి. ఢిల్లీ మెట్రో నాలుగో దశలో భాగంగా 26.46 కిలోమీటర్ల పొడవైన రిథాలా–కుండ్లీ మార్గానికి సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. -
ఏపీలో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాలు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో నూతనంగా 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.5,872 కోట్ల రూపాయలతో 8 ఏళ్ల కాలంలో స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.దేశంలో ప్రస్తుతం 1256 కేంద్రీయ విద్యాలయాలు ఉండగా, ఏపీలో కొత్తగా మరో ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. అనకాపల్లి, వలసపల్లి , పాల సముద్రం, తాళ్లపల్లి నందిగామ, రొంపిచర్ల, నూజివీడు, డోన్లలో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.దేశవ్యాప్తంగా 28 కొత్త నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలలో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. -
కేవీల్లో ఎంపీల కోటా పునరుద్ధరణ యోచన లేదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు పార్లమెంట్ సభ్యుల కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో బుధవారం శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జయంత్ చౌధరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.ఎంపీలకు కోటా ఇవ్వడం వల్ల తరగతుల్లో విద్యార్థి-టీచర్ నిష్పత్తి భారీగా పెరిగిపోతుంది. ఇది బోధనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో ఈ కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి కేంద్రం వద్ద లేదు అని వెల్లడించారు.గతంలో ఎంపీల కోటాలో భాగంగా కేవీల్లో ఒక ఎంపీ గరిష్ఠంగా 10మంది పిల్లలను సిఫార్సు చేయొచ్చు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరికి కలిపి 7880 మంది విద్యార్ధులను కేవీల్లో చేర్పించే అధికారం ఉండేది. ఇలా కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు విద్యార్థులను సిఫార్సు చేసే పలు కోటాలను కేంద్రం 2022 ఏప్రిల్‌లో రద్దు చేసింది. తిరిగి వాటిని పునరుద్ధరించే యోచన లేదని మరోసారి స్పష్టం చేసింది. -
కేవీల్లో ఎంపీల కోటా పునరుద్ధరణ యోచన లేదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు పార్లమెంట్ సభ్యుల కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో సోమవారం కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి ఒక ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ విద్యా సంస్థలను ప్రాథమికంగా రక్షణ, పారా మిలటరీ, కేంద్ర అటానమస్ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసినవని వివరించారు. ఎంపీలకు కోటా ఇవ్వడం వల్ల ఒక్కో సెక్షన్లో 40 మంది విద్యార్థుల పరిమితి దాటిపోతోందన్నారు. ఇది బోధనపై ప్రభావం చూపుతోందని వివరించారు. గతంలో ఒక్కో ఎంపీ ఒక కేవీలో 10 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని సిఫారసు చేసేందుకు వీలుండేది. మొత్తం 543 మంది లోక్‌సభ, 245 మంది రాజ్యసభ సభ్యులు కలిపి కేవీల్లో ఏటా తమ కోటా కింద 7,880 మంది విద్యార్థుల ప్రవేశాలకు సిఫారసు చేసేవారు. -
కేంద్రీయ విద్యాలయాలు.. ఎంపీలకు షాక్!
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం వెల్లడించింది. ప్రత్యేక కోటా కింద కేటాయిస్తున్న ఈ సీట్లపై.. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) బుధవారం ప్రకటన చేసింది. కేవీఎస్ ఇప్పటివరకు ఒక్కో ఎంపీకి కోటా కింద 10 సీట్లు కేటాయిస్తూ వస్తోంది. అయితే ఈ కోటా పెంచాలని ఎంపీలు డిమాండ్ చేస్తుండగా.. ఇప్పుడు ఏకంగా కోటాను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ అడ్మిషన్లు ఉండవని ఉత్తర్వుల్లో పేర్కొంది. స్పెషల్ ప్రొవిజన్ కింద ఎంపీలు, కేంద్ర ఉద్యోగుల పిల్లలు, కేంద్ర ప్రభుత్వ అవార్డు గ్రహీతల పిల్లలు సహా 19 కేటగిరీల్లో కోటా కేటాయింపులు ఉంటూ వచ్చాయి. -
ఆన్లైన్లో ‘కేవీ’ పాఠాలు
న్యూఢిల్లీ: దేశంలోని కేంద్రీయ విద్యాలయా (కేవీ)ల్లో ఆన్లైన్లో క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్రీయ విశ్వవిద్యాలయ సంఘటన్ ప్రత్యేక ప్రోటోకాల్ రూపొందించిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఈమెయిల్, వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ ఫర్ సెకండరీ(ఎన్ఐఓఎస్) ద్వారా రికార్డు చేసిన పాఠాలు, లైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్వయం ప్రభ పోర్టల్‌లో ఏప్రిల్ 7 నుంచి సీనియర్ సెంకండరీ క్లాసెస్ ప్రారంభవుతాయని వెల్లడించారు. విద్యార్థులకు ఏదైనా సందేహం వస్తే స్కైప్, లైవ్ వెబ్ చాట్ సహాయంతో ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవచ్చని వివరించారు. (పింక్ సూపర్ మూన్ చూస్తారా?) -
కరోనా ఎఫెక్ట్: ఇకపై వాట్సాప్‌లో పరీక్షా ఫలితాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ సోకి ముగ్గురు మరణించారు. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి వేలాది మందిని బలితీసుకుంటూ భారత్‌లో కూడా చాపకిందనీరులా విస్తరిస్తోంది. అయితే ఈ వైరస్ విస్తరించకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకొంటున్నాయి. మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేయించారు. పలు రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతుండడంతో వాటిని మాత్రమే కొనసాగిస్తున్నారు. దేశ రాజధానిలో కూడా స్కూల్స్ మూతపడ్డాయి. అయితే ఇప్పటికే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులకు పరీక్షలు జరిగాయి. ఫలితాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఫలితాలు గతంలో ఎప్పుడూ కూడా విద్యార్థుల చేతికి ఇచ్చేవారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో విద్యార్థులను టచ్ చేయవద్దని అధికారులు నిర్ణయించారు. వినూత్నంగా ఫలితాలను తెలియచేయాలని అధికారులు భావించారు. దీంతో వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా పరీక్షా ఫలితాలను పంపేందుకు సిద్ధమౌతున్నాయి. చదవండి: వృద్ధి రేటుకు కరోనా కాటు.. అన్ని కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో ఫలితాలను నేరుగా కాకుండా.. ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా చేరవేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఏమైనా సందేహాలు ఉంటే.. పాఠశాలల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేరుగా కాలేజీలకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని చెప్తున్నారు. కేంద్రీయ విద్యాలయాలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అనుసరించాలని ఇతర విద్యాసంస్థలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఫోర్డ్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ -
‘విద్యార్థులకు విలువలు బోధించండి’
గ్రేటర్ నోయిడా: బోధనను కేవలం జ్ఞానాన్ని అందించడానికి మాత్రమే పరిమితం చేయకుండా విలువల గురించి కూడా విద్యార్థులకు తెలియజెప్పాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. గ్రేటర్ నోయిడాలోని కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం క్యాంపులో కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం హోంమంత్రి ప్రసంగించారు. జీవితంలో ఏ దశలోనైనా విలువలకు కట్టుబడి బతకడం విద్యార్థులకు నేర్పాలని టీచర్లను కోరారు. ‘పుస్తకాల్లోని పాఠాలను చెప్పడంతోనే సరిపోదు. పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలకు కట్టుబడి జీవించడం గురించి తెలియజెప్పాలి. వాటి గొప్పతనాన్ని చాటాలి. మెరుగైన సమాజం కోరుకునే ప్రతి ఒక్కరూ నైతిక విలువలకు కట్టుబడి బతకాల్సిందే. ఇతరులు బతికేలా మార్పు తీసుకురావాల్సిందే. అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంద’ని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. -
అవి పర్యావరణహిత పాఠశాలలు
ఆ రెండు పాఠశాలల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకోవచ్చు. వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం కనిపిస్తుంది. జలసంరక్షణ ఆనందాన్నిస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్న అవేమీ కార్పొరేట్ పాఠశాలలు కావు. అవి కేంద్రీయ విద్యాలయాలు. కేంద్రీయ విద్యాలయ యాజమాన్యం... వ్యర్థాల నిర్వహణ, వాతావరణం కలుషితం కాకుండా చూడడం, జల సంరక్షణ, తదితర అంశాలపై కొన్ని నిర్దేశాలను తన పరిధిలోని పాఠశాలలకు పంపింది. వాటి ఆచరణలో రెండు పాఠశాలలు 70 శాతం మార్కులతో ముందు నిలిచాయి. అవి రెండూ కేరళలోని పగోడ్, ఒట్టపాళియం స్కూళ్లు! బడి విడిచిపెట్టే 5 నిముషాలు వ్యర్థాల సేకరణ జరుగుతుంది. దాంతో రోజుకు 10కిలోల గ్యాస్ ఉత్పత్తవుతోంది. ఈ గ్యాస్‌తో స్కూలు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ విద్యుదవసరాలు తీరుతున్నాయి. ఇక వ్యర్థ జలాలను వృథాగా పోనీయకుండా, శుద్ధిచేసి, మరుగుదొడ్లలో, స్కూలును శుభ్రపరచడానికీ వినియోగిస్తున్నారు. మొక్కలకూ ఈ నీరే. విద్యార్థులు స్కూలుకు వచ్చేందుకు పెట్రోలు వాహనాలు కాకుండా సైకిళ్ళను ఉపయోగిస్తున్నారు. ఈ స్కూళ్లలో ప్లాస్టిక్ వినియోగం కనిపించదు. మనసుంటే మార్గముంటుందని నిరూపిస్తున్న ఈ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇతర పాఠశాలలకు దారి చూపుతున్నాయి. హరితావరణలను ప్రోత్సహించేందుకు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సిఎస్ఇ) గ్రీన్ స్కూల్స్ ప్రోగ్రామ్ (జిఎస్పి) విధానాన్ని అవలంబిస్తున్న... 54 స్కూళ్లలో కేరళలోని పగోడ్, ఒట్టపాళియం కేంద్రీయ విద్యాలయాలు ప్రథమ స్థానంలో నిలిచాయని సిఎస్ఇ డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణ్ చెప్పారు. -
కేవీల్లో ఆరు వేల టీచర్ పోస్టులు : జవదేకర్
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా విద్యా వ్యవస్థను మెరుగుపరిచి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం అవసరమని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. నాణ్యమైన విద్య అందినప్పుడే విద్యార్థులు సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా ఎదుగుతారని, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. దేశంలో నాణ్యమైన విద్యను అందించడం అవసరమన్నారు. దీనికి కేంద్రీయ విద్యాలయాలతో పునాది రాయి వేశామని, వీటిలో 6 వేలకు పైగా టీచర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థలో క్రీడలు భాగమేనని, ఇవి విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. ఆరు నగరాల్లో నిర్మించబోతున్న కేంద్రీయ విద్యాలయాలకు కావల్సిన భూములు అందుబాటులో లేవన్నారు. -
ఈ ఏడాదికి జర్మన్ ను కొనసాగించండి: సుప్రీం
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో జర్మన్ భాష కొనసాగింపుపై కేంద్రం పరిశీలన చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) మూడో భాషగా సంస్కృతాన్ని తప్పనిసరిచేస్తూ మానవ వనరుల శాఖ జారీచేసిన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థులు తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా మూడో ప్రాధాన్య భాషగా జర్మనీ, గత ప్రభుత్వం చేసుకున్న అవగాహన ఒప్పందం చట్టవిరుద్ధమని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ఇకపై ఆ ఒప్పందాన్ని కొనసాగించలేమని తెలిపారు. అయితే ప్రభుత్వం చేస్తున్న తప్పులకు విద్యార్థులను ఎందుకు బలి చేయాలని న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రశ్నించింది. జర్మన్ స్థానంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టడాన్నివచ్చే విద్యా సంవత్సరానికి వాయిదా వేయడంపై వివరణ ఇవ్వాలని సూచించింది. కాగా కేంద్రీయ విద్యాలయాలలో గత కొన్నేళ్లుగా జర్మని భాషను ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు. అందుకుగాను జర్మనికి చెందిన ఒక సంస్థతో ఆనాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్మన్ భాషను తొలగించి, సంస్కృతాన్ని పెట్టాలని కేంద్రీయ విద్యాలయాలకు ఆదేశం ఇచ్చింది. విద్యా సంవత్సరం మధ్యలో ప్రభుత్వం ఆదేశాలతో జర్మన్ భాష అభ్యసించే విద్యార్థులకు షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో బాధితు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. -
కేవీల్లో జర్మన్ స్థానంలో సంస్కృతం
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయ(కేవీ) పాఠశాలల్లో తృతీయ భాషగా జర్మన్ స్థానంలో ఇకపై సంస్కృతాన్ని బోధించనున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. జాతీయ అవసరాల దృష్ట్యా కేవీల గవర్నర్ల బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని, అయితే ఇది సంస్కృతాన్ని ప్రోత్సహించేందుకు తీసుకున్నది కాదని, విద్యార్థుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు సంబంధించినదని అన్నారు. కేవీల్లో తృతీయ భాషగా జర్మన్‌ను బోధించడంపై 2011లో కుదిరిన అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై ఇప్పటికే విచారణ ప్రారంభమైందన్నారు. జాతీయ విద్యావిధానంలో ‘త్రి భాషా పద్ధతి’కి వ్యతిరేకంగా ఉన్న ఆ ఒప్పందాన్ని ఎలా కుదుర్చుకున్నారని కేవీ బోర్డు సమావేశంలో ప్రశ్నించామన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆరు నుంచి ఎనిమిది తరగతుల్లో ఉన్న దాదాపు 68 వేల మంది విద్యార్థులపై ప్రభావం చూపనుంది.