![Union Cbinet approved the opening of 85 Kendriya and 28 Navodaya Vidyalayas](/styles/webp/s3/article_images/2024/12/7/kv.jpg.webp?itok=eiPdGE8B)
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే ఒక కేంద్రీయ విద్యాలయ విస్తరణకు అంగీకారం తెలిపింది. మంత్రివర్గం శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైంది. పలు నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు.
కొత్తగా ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాసంస్థలతో 82 వేల మందికిపైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని, వారికి నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 1,256 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో ఒకటి మాస్కోలో, మరొకటి ఖాట్మాండులో, ఇంకోటి టెహ్రాన్‌లో ఉన్నాయి. ఢిల్లీ మెట్రో నాలుగో దశలో భాగంగా 26.46 కిలోమీటర్ల పొడవైన రిథాలా–కుండ్లీ మార్గానికి సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment