Navodaya Vidyalaya
-
కొత్తగా 85 కేవీలు, 28 ‘నవోదయ’లు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే ఒక కేంద్రీయ విద్యాలయ విస్తరణకు అంగీకారం తెలిపింది. మంత్రివర్గం శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైంది. పలు నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు. కొత్తగా ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాసంస్థలతో 82 వేల మందికిపైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని, వారికి నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 1,256 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో ఒకటి మాస్కోలో, మరొకటి ఖాట్మాండులో, ఇంకోటి టెహ్రాన్‌లో ఉన్నాయి. ఢిల్లీ మెట్రో నాలుగో దశలో భాగంగా 26.46 కిలోమీటర్ల పొడవైన రిథాలా–కుండ్లీ మార్గానికి సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. -
‘నవోదయ’లో విద్యార్థులకు అస్వస్థత
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రెండు రోజులుగా పలువురు విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా, శుక్రవారం వీరి సంఖ్య పెరగడం, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం జరగడంతో తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు స్థానిక వైద్య సిబ్బంది చికిత్స చేశారు. అయితే, విద్యార్థులు అస్వస్థతకు గురికావటానికి గల కారణాలు స్పష్టంగా తెలియడంలేదు. విద్యార్థులకు మెనూ ప్రకారం బుధవారం చికెన్ వడ్డించగా, అది తిన్నాక కడుపునొప్పి, వాంతులు అయ్యాయని విద్యార్థులు చెబుతున్నారు. కానీ ఇటీవల విద్యార్థులు సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లి వచ్చినప్పుడు తెచ్చుకున్న పిండి వంటలు తినడంతోనే ఇలా జరిగిందని ప్రిన్సిపాల్ చంద్రబాబు వివరణ ఇచ్చారు. విద్యార్థుల పరిస్థితిపై డీఎంహెచ్ఓ డాక్టర్ మాలతి పాఠశాలకు వచ్చి మెడికల్ ఆఫీసర్ కిషోర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో పిండివంటలతో పాటు భోజనం తయారీలో వాడే సరుకుల శాంపిళ్లను సేక రించారు. విద్యార్థులకు చికిత్స కొనసాగుతోందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని డీఎంహెచ్ఓ వెల్లడించారు. -
విద్యార్థులను ఇంటికి పంపాం : కేంద్రమంత్రి
ఢిల్లీ : లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న జవహార్ నవోదయ విద్యాలయాల్లో ఉండిపోయిన 3,169 మంది విద్యార్థులను సురక్షితంగా ఇంటికి పంపినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ గురువారం వెల్లడించింది. నవోదయ విద్యాలయ సమితి కింద అంతర్భాగమైన జవహార్ నవోదయ విద్యాలయాలను లాక్డౌన్ కారణంగా మార్చి 21 నుంచే మూసివేశారు. దీంతో కొంతమంది ఇళ్లకు వెళ్లిపోగా, 3వేలకు పైగానే స్పెషల్ క్లాసెస్ పేరిట అక్కడే ఉండిపోయారు. వీరిలో ఎక్కువగా 13 నుంచి 15 సంవత్సరాల వయసు వాళ్లు ఉన్నారు. (విద్యార్థులను ఇంటికి పంపాం : కేంద్రమంత్రి ) లాక్డౌన్ 4.0 అమలవుతున్న నేపథ్యంలో ప్రయాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశంలోని దాదాపు 173 ప్రాంతాల్లోని జవహార్ నవోదయ విద్యాలయాల్లో చిక్కుకుపోయిన 3,169 మంది విద్యార్థులను వాళ్ల ఇంటికి సురక్షితంగా పంపించినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించారు. కరోనావ్యాప్తి దృష్ట్యా మార్చి 24న దేశవ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలుత 21 రోజుల లాక్డౌన్ అని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే లాక్డౌన్ 4.0 లో భారీ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో పలువురు వారి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇక భారత్‌లో కరోనా కారణంగా ఇప్పటివరకు 3,435 మంది చనిపోగా, కేసుల సంఖ్య 1,12,359 కి పెరిగింది. గత 24 గంటల్లోనే 5,609 కేసులు నమోదవగా,132 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. (పది వేల మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా! ) -
మోదీతో చర్చకు నవోదయ విద్యార్థులు
విజయనగరం, శృంగవరపుకోట రూరల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఈ నెల 29న ఢిల్లీలో జరగబోయే ప్రత్యక్ష చర్చలో పాల్గొనేం దుకు ఎస్.కోట మండలం కిల్త ంపాలెం జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ దామా అంజయ్య తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన గురువారం మాట్లాడారు. ఢిల్లీలోని టాకా టోరా స్టేడియంలో ఈ నెల 29న ఉద యం 11 గంటలకు పరీక్ష పే చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు నవోద య విద్యాలయంలో 12వ తరగతి విద్యార్థిని జీవనజ్యోతి, పదో తరగతి విద్యార్థి జశ్వంత్‌లు అవకాశం చేజిక్కించుకున్నారని తెలిపారు. పరీక్షా కీ బాత్ పీఎంకే సాథ్ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శా ఖ వారు దేశ వ్యాప్తంగా ఆన్లైన్లో విద్యార్థుల కోసం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఈ విద్యాలయానికి చెం దిన వేల మంది విద్యార్థులు పాల్గొనగా ఇక్కడ చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు అవకాశం వరించిందన్నారు. ప్రస్తుత పరీక్ష విధానం తీరుతెన్నుల గురించి పలు విషయాలు ప్రధానమంత్రితో ప్రత్యక్షంగా చర్చించనున్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రితో చర్చా కార్యక్రమానికి ఉత్తరాం ధ్ర జిల్లాల నుంచి కేవలం కిల్తంపాలెం నవోదయ విద్యాలయానికి చెందిన ఇద ్దరు విద్యార్థులకు అవకాశం దక్కేలా ప్రోత్సహించి మార్గదర్శనం చేసిన కం ప్యూటర్ ఉపాధ్యాయుడు అశుతోష్, జీవశాస్త్ర అధ్యాపకుడు ఆర్.రాఘవేంద్రరావు సేవలను ప్రిన్సిపాల్ అంజయ్య, వైస్ ప్రిన్సిపాల్ ఎం.సత్యవతి కొనియాడారు. -
80 సీట్లు.. 8113 దరఖాస్తులు
కాగజ్‌నగర్: ఉమ్మడి జిల్లాలోని కాగజ్‌నగర్ పట్టణంలో గల జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి తీవ్ర పోటీ నెలకొంది. జాతీయ విద్యావిధానం అనుసరించి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి ఈసారి గతంలో పోల్చితే కాస్త తక్కువ పోటీ ఉంది. 2019– 20 విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం 80 సీట్లు ఉండగా ఏకంగా 8113 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన ఒక్కో సీటుకు 101 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. నవోదయలో ఒక్కసారి సీటు సాధించారంటే చాలు 12వ తరగతి వరకు ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్య, సంస్కృతి, సాంప్రదాయ విలువలు, సాహసోపేత కృత్యాలు, క్రీడలు, పౌష్టికాహారంతోపాటు సమున్నత శిక్షణ లభిస్తాయి. ఈ నేపథ్యంలో సాధారణంగానే పోటీ అధికంగా ఉంటుంది. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థుల ఓఎంఆర్ షీట్లను ఢిల్లీకి పంపిస్తారు. అక్కడే సీబీఎస్ఈలో విద్యార్థుల ఎంపిక జరుగుతోంది. గ్రామీణ విద్యార్థులకు ప్రాధాన్యం.. కాగజ్‌నగర్ నవోదయ విద్యాలయంలో ఇప్పటి వరకు 25 బ్యాచ్‌లు నిర్వహించారు. ప్రస్తుతం 26వ బ్యాచ్ కొనసాగుతుండగా 480 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా నవోదయలో ప్రవేశానికి గ్రామీణ విద్యార్థులకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇందులో 75 శాతం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, 25 శాతం పట్టణ ప్రాంతాల విద్యార్థులకు, 3 శాతం దివ్యాంగులకు రిజర్వు చేశారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, మిగతా ఖాళీలు ఓపెన్ కేటగిరిలో ఎంపిక చేస్తారు. బాలికలు 33 శాతం, బాలురు 77 శాతం రిజర్వేషన్‌తో ఎంపిక జరుగుతుంది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ, నేపాలీగారో భాషలలో పరీక్షలు నిర్వహిస్తుండడం విశేషం. తగ్గిన దరఖాస్తులు.. నవోదయలో 6వ తరగతిలో 80 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా 8113 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో సీటుకు 101 మంది పోటీ పడుతున్నా దరఖాస్తులు ఈసారి తక్కువగానే వచ్చాయి. 2018– 19 సంవత్సరానికి 12,421 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి దాదాపు 4వేల దరఖాస్తులు తగ్గాయి. అప్పుడు ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించగా ఈసారి కేవలం ఆన్లైన్ ద్వారానే స్వీకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఆన్లైన్ సెంటర్లు లేకపోవడంతో దరఖాస్తులు తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి వచ్చిన 8113 దరఖాస్తుల్లో ఆదిలాబాద్ జిల్లా నుంచి 1998, నిర్మల్ నుంచి 2046 మంది, మంచిర్యాల నుంచి 2094 మంది, కుమురం భీం జిల్లా నుంచి 1995 దరఖాస్తులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 32 పరీక్ష కేంద్రాలు.. ప్రవేశ పరీక్ష నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్, ఉట్నూర్ బ్లాక్‌లలో 8 కేంద్రాలు, నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, భైంసా బ్లాక్‌లలో 8 పరీక్ష కేంద్రాలు, మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట, చెన్నూర్, మందమర్రి బ్లాక్‌లలో 8 కేంద్రాలు, కుమురం భీం జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిర్పూర్(టి) బ్లాక్‌లలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 100 మార్కుల పరీక్షలో 50 ప్రశ్నలు, 50 మార్కులు మెంటల్ ఎబిలిటీపై, 25 ప్రశ్నలు, 25 మార్కులు, అర్థమెటిక్‌పై, 25 ప్రశ్నలు, 25 మార్కులు భాషా నైపుణ్యంపై పరీక్ష ఉంటుంది. 2న 9వ తరగతికి పరీక్ష.. కాగజ్‌నగర్ నవోదయలో 9వ తరగతిలో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ కోసం ఫిబ్రవరి 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకు సైతం తీవ్ర పోటీ నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 275 మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. 2న విద్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ చక్రపాణి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్‌టికెట్లు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతిభ ఆధారంగానే ఎంపిక విద్యార్థుల ప్రతిభ ఆధారంగానే నవోదయ విద్యాయంలో ప్రవేశాలకు ఎంపిక జరుగుతోంది. ప్రవేశ పరీక్ష పారదర్శకంగా నిర్వహిస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి అపోహలను నమ్మవద్దు. విద్యార్థుల ఎంపిక ఢిల్లీలోని విద్యాలయ సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే గతేడాదికంటే ఈసారి దరఖాస్తులు చాలా తగ్గాయి. ఈఏడాది కేవలం ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ చేపట్టడంతో వేలల్లో సంఖ్య తగ్గింది. – చక్రపాణి, ప్రిన్సిపల్ -
నవోదయ’కు 27లక్షల దరఖాస్తులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం 27లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఆరో తరగతిలో ప్రవేశాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన జరిగే రాత పరీక్షకు గత ఏడాది కంటే 5లక్షల మంది ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ పరీక్షకు ఇంతమంది దరఖాస్తు చేసుకోవటం ఇదే ప్రథమమని చెప్పారు. మొత్తం 601 జిల్లాల్లోని 623 పాఠశాలల్లో ఉన్న 45,000 సీట్లను ఈ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారని తెలిపారు. -
‘నవోదయ’లో ప్రవేశాలకు నూతన మార్గదర్శకాలు
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయని నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ ఎ.వై.రెడ్డి చెప్పారు. గుంటూరులోని ఓ హోటల్లో శుక్రవారం ఏపీ, తెలంగాణ, యానాం, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లోని నవోదయ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, విద్యాశాఖాధికారులతో ప్రవేశాల ప్రక్రియపై సమావేశాన్ని నిర్వహించారు. ఎ.వై.రెడ్డి మాట్లాడుతూ నూతన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన జరగనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల పరిశీలన క్షుణ్ణంగా జరిపి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎంపిక జరగాల్సి ఉందని స్పష్టం చేశారు. గతేడాది ప్లస్ టూ ఫలితాల్లో 99.44 శాతం ఉత్తీర్ణత నమోదుచేసి హైదరాబాద్ రీజియన్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. సమావేశంలో నవోదయ నేతృత్వ సంస్థ డెరైక్టర్ జంధ్యాల వెంకటరమణ, అసిస్టెంట్ కమిషనర్లు జి.అనసూయ, వి.జె.జగదీశ్వరాచారి పాల్గొన్నారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
మామునూరు ఏసీపీ మహేందర్ ముగిసిన నవోదయ క్లస్టర్ స్థాయి క్రీడోత్సవాలు మామునూరు : విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మామునూరు ఏసీపీ మహేందర్ అన్నారు. హన్మకొండ మండలం మామునూరులోని నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న క్లస్టర్ బాల్‌గేమ్స్ క్రీడలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. అండర్ 14, 17, 19 విభాగాల్లో రాష్ట్రంలోని తొమ్మిది నవోదయ విద్యాలయాలకు చెందిన 320 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనగా 225మంది బాలబాలికలు రీజినల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నవోదయ ప్రిన్సిపాల్ డాక్టర్ పడాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో ఏసీపీ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రీడలపై మక్కువ పెంచుకుంటే జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా రాణించొచ్చన్నారు. ప్రిన్సిపాల్ పడాల సత్యనారాయణ మాట్లాడుతూ ఇక్కడి పోటీల్లో ప్రతిభ చూపిన 225 మంది బాలబాలికలు రీజినల్ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో నవోదయ అధ్యాపకులు పాల్గొన్నారు. -
వారిని ఆదుకుంటాం..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఐఐటీలో ర్యాంకులు దక్కించుకుని ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు సాయం చేయడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందుకొచ్చారు. ఐఐటీలో 167, 410 ర్యాంకులతో టాప్ -500 లో వారు స్థానం దక్కించుకున్న రాజు, బ్రిజేష్ లకు శనివారం ఆయన ప్రత్యేకంగా అభినందలు తెలిపారు. కష్టాలను అధిగమించి ఐఐటీ ప్రవేశ పరీక్షలో అద్భుతమైన విజయం సాధించిన వారిద్దరికీ తన ట్విట్టర్లో విషెస్ చెప్పారు. మరో ట్వీట్లో జవహర్ నవోదయ విద్యాలయాన్ని కూడా అభినందించారు. ఇలాంటి గ్రామీణ ప్రాంతంలోని మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి, వారిని తీర్చిదిద్దడం గర్వంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు రాజు, బ్రిజేషలతో ఉదయం రాహుల్ గాంధీ మాట్లాడారని కాంగ్రెస వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ ఆయన కుమార్తె ఎమ్మెల్యే ఆరాధన సహా, స్థానిక పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపాయి. వారికి తగిన సహాయం చేయాల్సిన బాధ్యతను తివారీకి అప్పగించినట్టు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్ గఢ్ జిల్లాలోని రెహువా లాల్ గంజ్ గ్రామస్తుడైన ధర్మరాజ్ సరోజ్ కుమారులైన రాజు, బ్రిజేష ఐఐటీ ప్రవేశ పరీక్షలో 167, 410 ర్యాంకులు తెచ్చుకున్నారు. ఇద్దరూ స్థానిక జవహర్ నవోదయలో చదువుకుంటూ ఈ ఘనతను సాధించారు. అయితే వాళ్ల తండ్రి ఓ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తూ ఏడుగురు సభ్యులతో ఉన్న కుటుంబాన్ని నెట్టుకొస్తుండటంతో పిల్లల చదువు ఆ కుటుంబానికి పెనుభారంగా మారింది. జూన్ 25 లోపు దాదాపు లక్షరూపాయల పీజు కట్టాల్సి ఉంది. ఈ విషయం మీడియాలో విశేషంగా వచ్చింది. Congratulations to all those who cracked the IIT. Spoke to Brijesh &Raju from Pratapgarh on their tremendous success against all odds (1/2) — Office of RG (@OfficeOfRG) June 20, 2015 Proud of the Jawahar Navodaya Vidyalayas for discovering talent from rural areas &giving them such a wonderful springboard:Rahul Gandhi(2/2) — Office of RG (@OfficeOfRG) June 20, 2015