
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం 27లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఆరో తరగతిలో ప్రవేశాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన జరిగే రాత పరీక్షకు గత ఏడాది కంటే 5లక్షల మంది ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ పరీక్షకు ఇంతమంది దరఖాస్తు చేసుకోవటం ఇదే ప్రథమమని చెప్పారు. మొత్తం 601 జిల్లాల్లోని 623 పాఠశాలల్లో ఉన్న 45,000 సీట్లను ఈ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారని తెలిపారు.