5, 8 తరగతులకు డిటెన్షన్‌ విధానం | No Detention Policy Scrapped For Classes 5, 8 Students | Sakshi
Sakshi News home page

5, 8 తరగతులకు డిటెన్షన్‌ విధానం

Published Mon, Dec 23 2024 5:05 PM | Last Updated on Tue, Dec 24 2024 5:21 AM

No Detention Policy Scrapped For Classes 5, 8 Students

న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 5, 8 తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్‌ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. ఈ రెండు తరగతుల్లో ఫైనల్‌ పరీక్షలో ఫెయిలైనప్పటికీ విద్యార్థులు తదుపరి తరగతుల్లో కొనసాగేందుకు ఇప్పటిదాకా వీలుండేది. ఇకపై అలా కాదు.. ‘5వ తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు ఫైనల్‌ పరీక్షా ఫలితాలు వెలువడిన రెండు నెలల్లోగా మళ్లీ పరీక్షలు రాసేందుకు అవకాశం కలి్పంచాలి. ఆ పరీక్షలోనూ ఫెయిలైతే వారిని తిరిగి 5వ తరగతిలోనే కొనసాగించడం తప్పనిసరి. 8వ తరగతి ఉత్తీర్ణత సాధించని వారికీ ఇదే వర్తిస్తుంది. 

రెండోసారి పరీక్ష రాసే విద్యారి్థని క్లాస్‌ టీచర్, తల్లిదండ్రులు మార్గదర్శకత్వంలో పరీక్షలకు సమాయత్తం చేయాలి. విద్యార్థి ఏ విషయంలో వెనుకబడి ఉన్నాడో గుర్తించి, ఆయా అంశాల్లో ప్రావీణ్యం సాధించేందుకు ప్రోత్సహించాలి’అని కేంద్రం విడుదల చేసిన గజెట్‌ పేర్కొంది. అయితే, ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయకుండా ఏ ఒక్కరినీ స్కూల్‌ నుంచి తొలగించే ప్రసక్తే లేదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టానికి 2019లో చేపట్టిన సవరణతో ఇప్పటికే 16 రాష్ట్రాలు, 2 రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు 5, 8 తరగతులకు ‘నో డిటెన్షన్‌ విధానం’రద్దు చేశాయి. విద్య రాష్ట్రాల పరిధిలోని అంశమైనందున, గజెట్‌ను అనుసరించి రాష్ట్రాలు ఈ విషయంలో తగు చర్యలు చేపట్టాలని కోరింది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement