Sainik schools
-
సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ.. ఆ వార్తల్లో నిజం లేదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు (Sankranti holidays) ఉంటాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. 2024–25 విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు స్థానికంగా సెలవులు ఇచ్చినందున ఈసారి 11–15 లేదా 12–16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సోషల్ మీడియాలో (Social Media) జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ జారీ 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఆలిండియా సైనిక్ స్కూల్ (Sanik School) ప్రవేశ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ జారీచేసింది. ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షకు జనవరి 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరో తరగతిలో ప్రవేశానికి మార్చి 31 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతి పాస్ అయి, 11 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న వారు 9వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు https://exams.nta.ac.in/AISSEE/చూడొచ్చు.స్టీల్‌ప్లాంట్‌లో అప్రెంటీస్‌కు దరఖాస్తుల ఆహ్వానంవిశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో (Vizag Steelplant) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ (గాట్), టెక్నీషియన్ అప్రెంటీస్ ట్రైనీ (టాట్)కు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. గాట్‌కు రూ.9 వేలు, టాట్కు రూ.8 వేలు స్టైఫండ్ చెల్లించనున్నారు. 2022 తర్వాత గ్రాడ్యుయేషన్, డిప్లమో పూర్తి చేసిన అభ్యర్థులు నాట్స్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. గూగుల్ ఫారం నింపేందుకు జనవరి 9 వరకు గడువు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.చదవండి: ఇంటర్ ఫీజు చెల్లింపునకు తత్కాల్ అవకాశంచైల్డ్ కేర్ లీవ్ షరతులతో ఇబ్బందులున్యాయం చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి డిమాండ్సాక్షి, అమరావతి: మహిళా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన చైల్డ్ కేర్ లీవ్‌లను 10 విడతల్లోనే వినియోగించుకోవాలన్న షరతుతో వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ షరతును రద్దు చేసి ఉద్యోగినులకు న్యాయం చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ డిమాండ్ చేశారు. షరతులతో సెలవు లక్ష్యం దుర్వినియోగమవుతోందన్నారు. అవసరం మేరకు మాత్రమే సెలవు ఉపయోగించుకునేలా, అపరిమిత విడతలతో చైల్డ్ కేర్ లీవ్ పొందేలా 199,36 జీవోలను సవరించాలని వారు విజ్ఞప్తి చేశారు. -
5, 8 తరగతులకు డిటెన్షన్ విధానం
న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 5, 8 తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. ఈ రెండు తరగతుల్లో ఫైనల్ పరీక్షలో ఫెయిలైనప్పటికీ విద్యార్థులు తదుపరి తరగతుల్లో కొనసాగేందుకు ఇప్పటిదాకా వీలుండేది. ఇకపై అలా కాదు.. ‘5వ తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు ఫైనల్ పరీక్షా ఫలితాలు వెలువడిన రెండు నెలల్లోగా మళ్లీ పరీక్షలు రాసేందుకు అవకాశం కలి్పంచాలి. ఆ పరీక్షలోనూ ఫెయిలైతే వారిని తిరిగి 5వ తరగతిలోనే కొనసాగించడం తప్పనిసరి. 8వ తరగతి ఉత్తీర్ణత సాధించని వారికీ ఇదే వర్తిస్తుంది. రెండోసారి పరీక్ష రాసే విద్యారి్థని క్లాస్ టీచర్, తల్లిదండ్రులు మార్గదర్శకత్వంలో పరీక్షలకు సమాయత్తం చేయాలి. విద్యార్థి ఏ విషయంలో వెనుకబడి ఉన్నాడో గుర్తించి, ఆయా అంశాల్లో ప్రావీణ్యం సాధించేందుకు ప్రోత్సహించాలి’అని కేంద్రం విడుదల చేసిన గజెట్ పేర్కొంది. అయితే, ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయకుండా ఏ ఒక్కరినీ స్కూల్ నుంచి తొలగించే ప్రసక్తే లేదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టానికి 2019లో చేపట్టిన సవరణతో ఇప్పటికే 16 రాష్ట్రాలు, 2 రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు 5, 8 తరగతులకు ‘నో డిటెన్షన్ విధానం’రద్దు చేశాయి. విద్య రాష్ట్రాల పరిధిలోని అంశమైనందున, గజెట్‌ను అనుసరించి రాష్ట్రాలు ఈ విషయంలో తగు చర్యలు చేపట్టాలని కోరింది. 𝐔𝐧𝐢𝐨𝐧 𝐄𝐝𝐮𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐫𝐲 𝐚𝐛𝐨𝐥𝐢𝐬𝐡𝐞𝐬 𝐭𝐡𝐞 '𝐍𝐨 𝐃𝐞𝐭𝐞𝐧𝐭𝐢𝐨𝐧 𝐏𝐨𝐥𝐢𝐜𝐲':Students in classes 5 and 8 who fail the annual exam can retake it within two months. If they fail again, they won't be promoted, but the school will not expel a… pic.twitter.com/AW4KRz8ch3— All India Radio News (@airnewsalerts) December 23, 2024 -
సైనిక్ స్కూళ్ల ప్రైవేటికరణ: ఖర్గే ఆరోపణలను ఖండించిన కేంద్రం
ఢిల్లీ: దేశంలోని సైనిక్ స్కూల్స్‌పై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర రక్షణ శాఖ ఖండించింది. సైనిక స్కూళ్లను ‘ప్రైవేటుపరం’ చేయాలనే కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఖర్గే చేసిన ఆరోపణలను ఖండించింది. ‘సైనిక స్కూళ్లలోని ఎంపిక విధానంలో రాజకీయ, సిద్ధాంతపరంగా దరఖాస్తు దారులపై ఎటువంటి ప్రభావం చూపించదు. ఈ పథకం లక్ష్యాలు, అమలును రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సైనిక్ స్కూల్స్‌పై చేస్తున్నవి వక్రీకరించే, తప్పుదారి పట్టించే ఆరోపణలు’ అని రక్షణ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. సైనిక స్కూళ్ల ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇందుకు సంబంధించి చేసుకున్న ఎంఓయులను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రాసిన లేఖలో కోరారు. సైనిక్ స్కూల్స్‌ను కూడా రాజకీయం చేయడానికి ప్రభుత్వం కఠోర ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇక.. ఆర్టీఐ రిపోర్టు ఆధారంగా.. సుమారు 62 శాతం సైనిక్ స్కూల్స్ బీజేపీ, బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ నేతలకు చెందినవిగా తెలిపారు. పక్షపాత రాజకీయాలకు దూరంగా సాయుధ బలగాలను వేరుగా ఉంచడం భారత ప్రజాస్వామ్యంలో అనుసరిస్తున్న సంప్రదాయమని, దానిని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని అన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యూహంలో భాగంగా సాయుధ బలగాల సహజ స్వభావాన్ని, నైతికతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. జాతీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని సైనిక్ స్కూల్స్ ప్రైవేటీకరణ విధానాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని కోరారు. వాటిపై చేసుకున్న ఎంఓయూలు కూడా చెల్లనివిగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోందని ఖర్గేలో రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. -
కఠినమైన శిక్షణలో మొదటి దశ దాటిన స్పెయిన్ యువరాణి
స్పెయిన్ సింహాసనానికి కాబోయే వారసురాలు ప్రిన్సెస్ లియోనోర్. అక్టోబర్ నెలతో ఆమెకు 18 ఏళ్లు నిండాయి. ఆ సందర్భంలో తన దేశ రాజ్యాంగానికి విధేయతతో ప్రమాణం చేసింది. సమయం వచ్చినప్పుడు రాణిగా అడుగులు వేసేందుకు ఆమె వారసత్వానికి పునాది వేసింది. అందుకు ఆమె మూడేళ్ల పాటు కఠినమైన శిక్షణ తీసుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో లియోనోర్ ఇప్పటికే తొలి అడుగులు వేశారు. తన శిక్షణకు సంబంధించిన మొదటి దశను అదిగమించి తదుపరి దశలోకి ఆమె ఎంట్రీ ఇచ్చింది. తాజాగా తన తల్లిదండ్రులైన క్వీన్ లెటిజియా, కింగ్ ఫెలిపే ఇద్దరూ కలిసి తమ పెద్ద కుమార్తె అయిన లియోనోర్ను స్పెయిన్‌లోని అరగోన్లోని జనరల్ మిలిటరీ అకాడమీ ఆఫ్ జరాగోజా వద్ద వదిలివేశారు. స్పెయిన్ సింహాసనానికి వారసురాలు, కాబోయే రాణి అయిన 18 ఏళ్ల యువరాణి లియోనోర్, దేశ దేశాధినేతగా తన భవిష్యత్తు కోసం సిద్ధం చేయడానికి అధికారికంగా మూడు సంవత్సరాల కఠనమైన సైనిక శిక్షణను తీసుకునేందుకు ఆమె రెడీ అయ్యారు. సైనిక్ స్కూల్లో చేరుతున్న సమయంలో తన తల్లిదండ్రులతో పాటు 16 ఏళ్ల సోదరి ప్రిన్సెస్ సోఫియాతో కలిసి అకాడమీకి వచ్చినప్పుడు ప్రిన్సెస్ లియోనార్ చాలా సంతోషంగా అక్కడ కనిపించారు. ఆమె తండ్రి కింగ్ ఫెలిపే సైనిక యూనిఫాం ధరించి, సైన్యం, నావికాదళం, స్పెయిన్ వైమానిక దళానికి చెందిన కెప్టెన్ జనరల్‌గా ఆమెకు సెల్యూట్ చేశాడు. కింగ్ ఫెలిపే స్పానిష్ సాయుధ దళాలకు సుప్రీం కమాండర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కూడా గతంలో బోర్బన్ సింహాసనాన్ని అందుకుంటున్న సమయంలో జనరల్ మిలిటరీ అకాడమీ ఆఫ్ జరాగోజాలో శిక్షణ పొందాడు. ప్రిన్సెస్ లియోనార్ అమ్మగారు అయిన క్వీన్ లెటిజియా కూడా అక్కడ సంతోషంగా కనిపించింది. లియోనార్ను గట్టిగా కౌగిలించుకుంది. ఆ సమయంలో లియోనార్ ఒక అధికారితో కరచాలనం చేస్తున్నప్పుడు ఒక తల్లిగా ఎంతో గర్వంగా చూసింది. తన కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలికిన తర్వాత, యువరాణి అడుగులు అకాడమీ వైపు మెల్లిగా పడ్డాయి. ఆ సమయంలో తన సొంత సూట్‌కేస్‌ను కూడా ఆమె తీసుకుళ్లింది. యువరాణి అయినా కూడా అందరిలా ఎంట్రీ పుస్తకంలో తన పేరుతో పాటు సంతకం చేసి లోపలికి వెళ్లింది. లియోనార్ తన ప్రాథమిక విద్యను శాంటా మారియా డి లాస్ రోసేల్స్ స్కూల్లో పొందింది. ఆమె మాధ్యమిక విద్య పూర్తయిన తర్వాత, ఆమె యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్‌లోని UWC అట్లాంటిక్ కాలేజీలో ఇంటర్నేషనల్ బాకలారియాట్ ప్రోగ్రామ్‌ను అభ్యసించింది. ఆ తర్వాత, 17 ఆగస్టు 2023న, లియోనార్ జనరల్ మిలిటరీ అకాడమీలో తన మూడేళ్ల సైనిక శిక్షణను ప్రారంభించింది. మొదటి స్టేజీ దాటుకున్న ఆమె తాజాగా కఠినమైన శిక్షణ తీసుకునేందకు సిద్ధం అయింది. లియోనార్ 2023-2024 విద్యా సంవత్సరానికి లేడీ క్యాడెట్‌గా శిక్షణ పొందుతుందని అక్కడి అధికారులు తెలిపారు. మరుసటి సంవత్సరం, ప్రిన్సెస్ లియోనార్ నేవీలో శిక్షణ పొందుతారు. మారిన్ నావల్ మిలిటరీ స్కూల్లో మిడ్షిప్మ్యాన్గా జువాన్ సెబాస్టియన్ డి ఎల్కానో ట్రైనింగ్ షిప్లో పని చేస్తుంది. ఆ తర్వాత 2025 నుంచి 2026 వరకు శాన్ జేవియర్ జనరల్ ఎయిర్ అకాడమీకి ఎన్సైన్ విద్యార్థిగా చేరి అక్కడ ఎయిర్ అండ్ స్పేస్ ఆర్మీతో తన కోర్సులను పూర్తి చేస్తారు. స్పెయిన్ సింహాసనానికి వారసురాలిగా ఎంపిక అయ్యేందకు ఈ తీవ్రమైన శిక్షణ తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే ఆమె తండ్రి కింగ్ ఫెలిప్ కూడా అనేక మిలిటరీ అకాడమీలలో శిక్షణ పొందాడు. సైన్యం, నేవీ నుంచి హెలికాప్టర్ పైలట్ వింగ్‌లలో తన పనితీరును కనపరిచారు. ఇంత కఠినమైన శిక్షణను ఆమె దాటుకుంటే ఆమె ఒక రికార్డును కూడా సొంతం చేసుకుంటుంది. లియోనార్ సింహాసనాన్ని అధిరోహిస్తే.. ఆమె 1833 నుంచి 1868 వరకు పాలించిన తన 4వ తరం నానమ్మ అయిన ఇసాబెల్లా II తర్వాత స్పెయిన్ మొదటి రాణి అవుతుంది. సుమారు 160 సంవత్సరాల తర్వాత ఆ కుటుంబం నుంచి ఒక మహిళ మరోసారి యువరాణిగా అడుగుపెట్టబోతుంది. భవిష్యత్‌లో లియోనోర్.. స్పానిష్ సాయుధ దళాలకు సుప్రీం కమాండర్‌గా పని చేసే బాధ్యత కూడా దక్కుతుంది. లియోనోర్ సైనిక శిక్షణ ప్రాముఖ్యత గురించి స్పానిష్ రక్షణ మంత్రి మార్గరీటా రోబుల్స్ ఇలా అన్నారు, "యువరాణి జీవితంలో ఇదొక ముఖ్యమైన ఘట్టం... మన దేశం నాయకత్వం సంబంధించి ఇదొక ముఖ్యమైన అడుగు" అని తెలిపారు. లియోనోర్ మూడేళ్ల పాటు శిక్షణ అనంతరం స్పెయిన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, స్పేస్ కమాండ్‌లో లెఫ్టినెంట్‌గా ఉంటారు. అలాగే నేవీలో ఎన్సైన్గా ఉంటారు. స్పెయిన్ సింహాసనాన్ని అధిష్టించడానికి ముందు వారి వారసులు సైనిక అనుభవాన్ని పొందడం గొప్ప రాజ సంప్రదాయం. బెల్జియం యువరాణి ఎలిసబెత్ 2020-2021 విద్యా సంవత్సరాన్ని బ్రస్సెల్స్‌లోని రాయల్ మిలిటరీ అకాడమీలో గడిపారు, స్వీడన్‌కు చెందిన క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియా 2022లో స్వీడిష్ సాయుధ దళాలతో శిక్షణను పొందారు. ప్రిన్సెస్ లియోనార్ అక్టోబర్ 31, 2005న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ప్రస్తుత చక్రవర్తి, కింగ్ ఫెలిపే VI, క్వీన్ లెటిజియా దంపతులకు జన్మించారు. ఆమెలో దాగి ఉన్న విశేషమైన తెలివితేటలు స్పానిష్ ప్రజల హృదయాలను దోచుకున్నాయి, రాజ కుటుంబం ప్రతిష్టను నిలబెట్టే వారసురాలు పుట్టిందని వారు సంబరపడ్డారు. ప్రత్యేకించి ఆమె తాత, మాజీ రాజు జువాన్ కార్లోస్ వివాదాల తర్వాత 2014లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆమె తండ్రి సింహాసనాన్ని అధిష్టించారు. తాజాగా లియోనోర్‌కు స్పానిష్ కిరీటం అందనుంది. వారి కుటుంబ నిబంధనల ప్రకారం ఆమె శిక్షణ పొంది భవిష్యత్‌లో స్పైయిన్ రాణిగా అవతరించడమే కాకుండా దేశ పరిరక్షణలో భాగం పంచుకోనుంది. View this post on Instagram A post shared by Princesa Leonor💕Infanta Sofía (@leonorandsofia) La Princesa de Asturias, acompañada por los Reyes y la Infanta Sofía, firma en el libro de honor de la Academia General Militar, donde hoy dará comienzo a su formación castrense. ➡️https://t.co/1hhg1pw3f3 pic.twitter.com/g95HgK5pnq — Casa de S.M. el Rey (@CasaReal) August 17, 2023 -
బీఎస్పీ అధికారంలోకి వస్తే 33 జిల్లాల్లో 33 సైనిక్ స్కూళ్ల ఏర్పాటు
హన్మకొండ చౌరస్తా, నయీంనగర్: వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 సైనిక్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని, ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.7,500 అందిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హామీనిచ్చారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో మంగళవారం ‘బహుజన విద్యార్థి భరోసా’సభలో బీఎస్పీ విద్యార్థి మేనిఫెస్టోను విడుదల చేశారు. బీఎస్పీ హామీలివే... పూలే విద్యార్థి భరోసా పేరుతో కాలేజీ విద్యార్థులకు అన్ని ప్రభుత్వ రంగ వాహనాల్లో ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పిస్తామని తెలిపారు. ప్రతి మండలం నుంచి వంద మందికి విదేశీ విద్య అందిస్తామని, అందులో 50మంది విద్యార్థినులు ఉంటారని వెల్లడించారు. రాష్ట్రంలోని 10లక్షల మందికి ఉన్నత విద్య కల్పిస్తామని, కేజీ నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు కోడింగ్ భాష నేర్పుతామని హామీనిచ్చారు. 8నుంచి 12 తరగతి విద్యార్థులకు 4వ భాషగా కోడింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తామన్నారు. విద్యార్థి, నిరుద్యోగ ఆత్మహత్యలు లేకుండా కార్యాచరణ రూపొందిస్తామని, విద్యార్థులకు ఉద్యోగాలు రాకపోతే కాంట్రాక్టర్లను చేస్తామని వాగ్దానం చేశారు. శ్రీకాంతాచారి పేరు తో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, పేపర్ లీకేజీలు లేకుండా చర్యలు చేపడతామని, పూర్ణ, ఆనంద్ క్రీడా స్ఫూర్తితో ప్రతి జిల్లాలో అంతర్జాతీ య ప్రమాణాలతో క్రీడా స్టేడియాలను నిర్మిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. అసెంబ్లీ జరుగుతుండగా గద్దర్ మరణ వార్త తెలిసినా సీఎం కేసీఆర్ కనీసంగా స్పందించలేదని, సంతాప తీర్మానం చేయలేదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. -
జనవరి 9న సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష
సాక్షి, అమరావతి: సైనిక్ స్కూళ్లలోని 6, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం వచ్చే ఏడాది జనవరి 9న ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈనెల 26 వరకు దరఖాస్తులకు గడువుగా నిర్ణయించారు. డిసెంబర్ చివరి వారంలో అడ్మిట్ కార్డులను విడుదల చేసి.. వచ్చే ఏడాది జనవరి 9న పరీక్ష నిర్వహిస్తారు. జనవరి చివరి వారంలో ‘కీ’, ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల చేస్తారు. మార్చిలో మెడికల్ టెస్టు నిర్వహించి.. ఏప్రిల్‌లో అడ్మిషన్లు చేపడతారు. 6వ తరగతిలో ప్రవేశం కోసం నాలుగు విభాగాల్లో 300 మార్కులకు పరీక్ష పెడతారు. 125 ప్రశ్నలతో కూడిన ఈ పరీక్షను విద్యార్థులు 2.30 గంటల్లో రాయాల్సి ఉంటుంది. ఇందులో గణితం నుంచి మూడేసి మార్కులకు 50 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జి, లాంగ్వేజెస్, ఇంటెలిజెన్స్ విభాగాల్లో రెండేసి మార్కులకు 25 చొప్పున ప్రశ్నలుంటాయి. అలాగే 9వ తరగతిలో ప్రవేశం కోసం 400 మార్కులకు 150 ప్రశ్నలతో పరీక్ష పెడతారు. మూడు గంటల్లో వీటికి జవాబులు రాయాల్సి ఉంటుంది. గణితం నుంచి నాలుగేసి మార్కులకు 50 ప్రశ్నలు, ఇంగ్లిష్, ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ విభాగాల్లో రెండేసి మార్కులకు 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. -
దేశంలో కొత్తగా 100 సైనిక పాఠశాలలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 100 సైనిక పాఠశాలలను కొత్తగా ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2022–23 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న కొత్త సైనిక పాఠశాలల్లో 6వ తరగతిలో 5వేల మంది విద్యార్థులను చేర్చుకుంటారు. వీటి ఏర్పాటులో రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక పాఠశాలల్లో 6వ తరగతి విద్యార్థులు 3వేల మంది ఉన్నారు. అదేవిధంగా, స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) అటల్ మిషన్ 2025–26 వరకు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) ఫలితాల సుస్థిరత, అన్ని నగరాల్లో ఘన వ్యర్థాల శాస్త్రీయ ప్రాసెసింగ్ సాధించడం, లక్ష లోపు జనాభా ఉన్న నగరాల్లో వ్యర్థ జలాల నిర్వహణపై దృష్టి సారించనుంది. స్వచ్ఛ భారత్ మిషన్(పట్టణ) 2.0 నిమిత్తం రూ.1,41,600 కోట్లు కేటాయించగా దీంట్లో కేంద్ర వాటా రూ.36,465 కోట్లు. పథకం చివరి దశకు చేరే నాటికి కేంద్రం వాటా రూ.62,009 కోట్లకు పెరుగుతుంది. పట్టణ పరివర్తన, పునరుజ్జీవనకు అటల్ మిషన్ ఫర్ రెజునవేషన్, అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) 2.0ను 2025–26 వరకు సాగించేందుకు మంత్రివర్గం అనుమతించింది. ఈ పథకం వ్యయం రూ.2,77,000 కోట్లు కాగా కేంద్రం వాటా రూ.76,760 కోట్లుగా ఉంది. తాజాగా 4,378 పట్టణాల్లో గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. 500 అమృత్ నగరాల్లో వందశాతం మురుగునీటి నిర్వహణతోపాటు 2.68 కోట్ల కుళాయి కనెక్షన్లు, 2.64 కోట్ల మురుగు నీటి కనెక్షన్లు అందించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 1 నుంచి మార్చి 2022 వరకూ నైట్రోజన్, ఫాస్పరస్, పొటాష్, సల్ఫర్లకు పోషక ఆధారిత సబ్సిడీ రేట్లకు ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. కేజీ సబ్సిడీ ధర నత్రజనికి రూ.18.789, పాస్ఫరస్‌కి రూ.45.323, పొటాష్ రూ.10.116, సల్ఫర్‌కు రూ.2.374కు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. దీని అమలుతో రూ.28,602 కోట్ల భారం పడుతుందని కేంద్రం పేర్కొంది. -
బడ్జెట్ 2021: కొత్తగా 100 సైనిక్ స్కూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 15వేల స్కూళ్లు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. అలానే కొత్తగా మరో 750 ఏకలవ్య పాఠశాలలు.. 100 సైనిక్ స్కూళ్లు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గోవా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం 300 కోట్ల రూపాయలు కేటాయించారు. గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా నలుగురు భారతీయ వ్యోమగాములకు రష్యాలో శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. బడ్జెట్లో నిర్మల స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. స్టార్టప్‌లకు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతమిస్తామన్నారు. స్టార్టప్లకి టాక్స్ హాలీడేని మరో ఏడాది పొడిగించారు. లేహ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్కు 3వేల కోట్ల రూపాయలు.. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం 5వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు 1500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక మీదట 5 కోట్లు దాటిన లావాదేవీలన్నీ ఇకపై డిజిటల్ విధానంలోనే జరగాలని నిర్మలా సీతారామన్ సూచించారు. -
రాష్ట్రానికి రెండు సైనిక్ స్కూళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2 సైనిక్ పాఠశాలల ఏర్పాటు కు కేంద్రం అంగీకరించింది. ఇందులో ఇప్పటికే వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మం డలం ఎల్కతుర్తిలో ఒక స్కూల్‌ను మంజూరు చేయగా, మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేట్‌లో మరో స్కూల్ మం జూరుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఎల్కతుర్తి పాఠశాలను వచ్చే విద్యాసంవత్సరం నాటికి ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 50 ఎకరాల స్థలంలో దాదాపు రూ.100 కోట్లతో ఈ స్కూల్ ఏర్పాటుకు డీపీఆర్‌లు సిద్ధం చేసి, కేంద్రానికి పంపగా, అంగీకరించింది. దీంతో త్వరలోనే స్కూల్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర నిబంధనల ప్రకారం.. భవనాలు అందుబాటులోకి వచ్చాకే స్కూల్ ను ప్రారంభించాల్సి ఉంది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఈ చర్యలు చేపట్టాలని భావిస్తోంది. స్కూల్ నిర్మాణం కోసం సేకరించిన భూమిని కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు దాదాపు రూ.4 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేసింది. భవన నిర్మాణాల కోసం ని«ధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి విద్యా శాఖ లేఖ రాసింది. నిర్మాణ పనులు త్వరగా పూర్త యితే వచ్చే జూన్‌లో 6వ తరగతిలో ప్రవేశాలకు చర్యలు చేపట్టే అవకాశముంది. ఏపీలోని విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో ప్రవేశాలను ప్రవేశ పరీక్ష ద్వారా చేపడుతున్నారు. మరోవైపు ఎంపీ జితేందర్‌రెడ్డి కేంద్రానికి చేసిన విజ్ఞప్తిని స్పెషల్ కేసుగా పరిగణనలోకి తీసుకొని అక్కడ మరో స్కూల్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. నారాయణ్‌పేట్‌లో స్కూల్ ఏర్పాటుకు అవసరమైన 50 ఎకరాల స్థలం చూపించాలని, డీపీఆర్ సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. త్వరలోనే దాన్ని కేంద్రానికి పంపి అనుమతి రాగానే నిర్మాణాలు పనులను చేపట్టాలని భావిస్తోంది. -
జైళ్లను సైనిక్ స్కూళ్లుగా మార్చడమే లక్ష్యం
జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ వరంగల్: రాష్ట్రంలోని జైళ్లన్నింటినీ సైనిక్ స్కూళ్లుగా మార్చడమే జైళ్ల శాఖ లక్ష్యమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్(జైళ్లు) వీకేసింగ్ అన్నారు. వరంగల్ కేఎంసీలో సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో కుల, మత, ప్రాంతీయతత్వాలతో ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయన్నారు. సిటిజన్ ఫోరం ఏర్పడటంతోనే సరిపోదని డివిజన్, మండలంతోపాటు గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పడి ప్రజలను భాగస్వామ్యం చేసినప్పుడే బంగారు తెలంగాణ సుసాధ్యమవుతుందన్నారు. గతేడాది 80 వేల మంది ఖైదీలను అక్షరాస్యులుగా మార్చామన్నారు. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ఏమీ కేటాయించలేదన్నారు. రెండేళ్లుగా జైళ్లశాఖను అవినీతి రహిత శాఖగా మార్చడం, చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తించిన ప్రభుత్వం జైళ్లలో మరిన్ని సౌకర్యాల కల్పనకు వచ్చే బడ్జెట్లో రూ.30 కోట్లు కేటాయిస్తోందన్నారు. సదస్సులో జైలు సూపరింటెండెంట్ ఎం.సంపత్, శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, సిటిజన్ ఫోరం అర్బన్ కమిటీ సభ్యులు పరశురాములు, గిల్దార్ సుల్తానా, బాలరాజు, నరేశ్, వీరభద్రరావు, మంజుల, రమాదేవి, ఉమేందర్, యాకుబ్‌పాషా పాల్గొన్నారు.