సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2 సైనిక్ పాఠశాలల ఏర్పాటు కు కేంద్రం అంగీకరించింది. ఇందులో ఇప్పటికే వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మం డలం ఎల్కతుర్తిలో ఒక స్కూల్‌ను మంజూరు చేయగా, మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేట్‌లో మరో స్కూల్ మం జూరుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఎల్కతుర్తి పాఠశాలను వచ్చే విద్యాసంవత్సరం నాటికి ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 50 ఎకరాల స్థలంలో దాదాపు రూ.100 కోట్లతో ఈ స్కూల్ ఏర్పాటుకు డీపీఆర్‌లు సిద్ధం చేసి, కేంద్రానికి పంపగా, అంగీకరించింది. దీంతో త్వరలోనే స్కూల్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర నిబంధనల ప్రకారం.. భవనాలు అందుబాటులోకి వచ్చాకే స్కూల్ ను ప్రారంభించాల్సి ఉంది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఈ చర్యలు చేపట్టాలని భావిస్తోంది. స్కూల్ నిర్మాణం కోసం సేకరించిన భూమిని కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
ఇందుకు దాదాపు రూ.4 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేసింది. భవన నిర్మాణాల కోసం ని«ధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి విద్యా శాఖ లేఖ రాసింది. నిర్మాణ పనులు త్వరగా పూర్త యితే వచ్చే జూన్‌లో 6వ తరగతిలో ప్రవేశాలకు చర్యలు చేపట్టే అవకాశముంది. ఏపీలోని విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో ప్రవేశాలను ప్రవేశ పరీక్ష ద్వారా చేపడుతున్నారు. మరోవైపు ఎంపీ జితేందర్‌రెడ్డి కేంద్రానికి చేసిన విజ్ఞప్తిని స్పెషల్ కేసుగా పరిగణనలోకి తీసుకొని అక్కడ మరో స్కూల్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. నారాయణ్‌పేట్‌లో స్కూల్ ఏర్పాటుకు అవసరమైన 50 ఎకరాల స్థలం చూపించాలని, డీపీఆర్ సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. త్వరలోనే దాన్ని కేంద్రానికి పంపి అనుమతి రాగానే నిర్మాణాలు పనులను చేపట్టాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment