స్పెయిన్ సింహాసనానికి కాబోయే వారసురాలు ప్రిన్సెస్ లియోనోర్. అక్టోబర్ నెలతో ఆమెకు 18 ఏళ్లు నిండాయి. ఆ సందర్భంలో తన దేశ రాజ్యాంగానికి విధేయతతో ప్రమాణం చేసింది. సమయం వచ్చినప్పుడు రాణిగా అడుగులు వేసేందుకు ఆమె వారసత్వానికి పునాది వేసింది. అందుకు ఆమె మూడేళ్ల పాటు కఠినమైన శిక్షణ తీసుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో లియోనోర్ ఇప్పటికే తొలి అడుగులు వేశారు. తన శిక్షణకు సంబంధించిన మొదటి దశను అదిగమించి తదుపరి దశలోకి ఆమె ఎంట్రీ ఇచ్చింది.
తాజాగా తన తల్లిదండ్రులైన క్వీన్ లెటిజియా, కింగ్ ఫెలిపే ఇద్దరూ కలిసి తమ పెద్ద కుమార్తె అయిన లియోనోర్‌ను స్పెయిన్‌లోని అరగోన్‌లోని జనరల్ మిలిటరీ అకాడమీ ఆఫ్ జరాగోజా వద్ద వదిలివేశారు. స్పెయిన్ సింహాసనానికి వారసురాలు, కాబోయే రాణి అయిన 18 ఏళ్ల యువరాణి లియోనోర్, దేశ దేశాధినేతగా తన భవిష్యత్తు కోసం సిద్ధం చేయడానికి అధికారికంగా మూడు సంవత్సరాల కఠనమైన సైనిక శిక్షణను తీసుకునేందుకు ఆమె రెడీ అయ్యారు.
సైనిక్ స్కూల్‌లో చేరుతున్న సమయంలో తన తల్లిదండ్రులతో పాటు 16 ఏళ్ల సోదరి ప్రిన్సెస్ సోఫియాతో కలిసి అకాడమీకి వచ్చినప్పుడు ప్రిన్సెస్ లియోనార్ చాలా సంతోషంగా అక్కడ కనిపించారు. ఆమె తండ్రి కింగ్ ఫెలిపే సైనిక యూనిఫాం ధరించి, సైన్యం, నావికాదళం, స్పెయిన్ వైమానిక దళానికి చెందిన కెప్టెన్ జనరల్‌గా ఆమెకు సెల్యూట్ చేశాడు. కింగ్ ఫెలిపే స్పానిష్ సాయుధ దళాలకు సుప్రీం కమాండర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కూడా గతంలో బోర్బన్ సింహాసనాన్ని అందుకుంటున్న సమయంలో జనరల్ మిలిటరీ అకాడమీ ఆఫ్ జరాగోజాలో శిక్షణ పొందాడు.
ప్రిన్సెస్ లియోనార్ అమ్మగారు అయిన క్వీన్ లెటిజియా కూడా అక్కడ సంతోషంగా కనిపించింది. లియోనార్‌ను గట్టిగా కౌగిలించుకుంది. ఆ సమయంలో లియోనార్ ఒక అధికారితో కరచాలనం చేస్తున్నప్పుడు ఒక తల్లిగా ఎంతో గర్వంగా చూసింది. తన కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలికిన తర్వాత, యువరాణి అడుగులు అకాడమీ వైపు మెల్లిగా పడ్డాయి. ఆ సమయంలో తన సొంత సూట్‌కేస్‌ను కూడా ఆమె తీసుకుళ్లింది. యువరాణి అయినా కూడా అందరిలా ఎంట్రీ పుస్తకంలో తన పేరుతో పాటు సంతకం చేసి లోపలికి వెళ్లింది.
లియోనార్ తన ప్రాథమిక విద్యను శాంటా మారియా డి లాస్ రోసేల్స్ స్కూల్‌లో పొందింది. ఆమె మాధ్యమిక విద్య పూర్తయిన తర్వాత, ఆమె యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్‌లోని UWC అట్లాంటిక్ కాలేజీలో ఇంటర్నేషనల్ బాకలారియాట్ ప్రోగ్రామ్‌ను అభ్యసించింది. ఆ తర్వాత, 17 ఆగస్టు 2023న, లియోనార్ జనరల్ మిలిటరీ అకాడమీలో తన మూడేళ్ల సైనిక శిక్షణను ప్రారంభించింది. మొదటి స్టేజీ దాటుకున్న ఆమె తాజాగా కఠినమైన శిక్షణ తీసుకునేందకు సిద్ధం అయింది. లియోనార్ 2023-2024 విద్యా సంవత్సరానికి లేడీ క్యాడెట్‌గా శిక్షణ పొందుతుందని అక్కడి అధికారులు తెలిపారు.
మరుసటి సంవత్సరం, ప్రిన్సెస్ లియోనార్ నేవీలో శిక్షణ పొందుతారు. మారిన్ నావల్ మిలిటరీ స్కూల్‌లో మిడ్‌షిప్‌మ్యాన్‌గా జువాన్ సెబాస్టియన్ డి ఎల్కానో ట్రైనింగ్ షిప్‌లో పని చేస్తుంది. ఆ తర్వాత 2025 నుంచి 2026 వరకు శాన్ జేవియర్ జనరల్ ఎయిర్ అకాడమీకి ఎన్‌సైన్ విద్యార్థిగా చేరి అక్కడ ఎయిర్ అండ్ స్పేస్ ఆర్మీతో తన కోర్సులను పూర్తి చేస్తారు.
స్పెయిన్ సింహాసనానికి వారసురాలిగా ఎంపిక అయ్యేందకు ఈ తీవ్రమైన శిక్షణ తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే ఆమె తండ్రి కింగ్ ఫెలిప్ కూడా అనేక మిలిటరీ అకాడమీలలో శిక్షణ పొందాడు. సైన్యం, నేవీ నుంచి హెలికాప్టర్ పైలట్ వింగ్‌లలో తన పనితీరును కనపరిచారు. ఇంత కఠినమైన శిక్షణను ఆమె దాటుకుంటే ఆమె ఒక రికార్డును కూడా సొంతం చేసుకుంటుంది. లియోనార్ సింహాసనాన్ని అధిరోహిస్తే.. ఆమె 1833 నుంచి 1868 వరకు పాలించిన తన 4వ తరం నానమ్మ అయిన ఇసాబెల్లా II తర్వాత స్పెయిన్ మొదటి రాణి అవుతుంది.
సుమారు 160 సంవత్సరాల తర్వాత ఆ కుటుంబం నుంచి ఒక మహిళ మరోసారి యువరాణిగా అడుగుపెట్టబోతుంది. భవిష్యత్‌లో లియోనోర్.. స్పానిష్ సాయుధ దళాలకు సుప్రీం కమాండర్‌గా పని చేసే బాధ్యత కూడా దక్కుతుంది. లియోనోర్ సైనిక శిక్షణ ప్రాముఖ్యత గురించి స్పానిష్ రక్షణ మంత్రి మార్గరీటా రోబుల్స్ ఇలా అన్నారు, "యువరాణి జీవితంలో ఇదొక ముఖ్యమైన ఘట్టం... మన దేశం నాయకత్వం సంబంధించి ఇదొక ముఖ్యమైన అడుగు" అని తెలిపారు.
లియోనోర్ మూడేళ్ల పాటు శిక్షణ అనంతరం స్పెయిన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, స్పేస్ కమాండ్‌లో లెఫ్టినెంట్‌గా ఉంటారు. అలాగే నేవీలో ఎన్‌సైన్‌గా ఉంటారు. స్పెయిన్ సింహాసనాన్ని అధిష్టించడానికి ముందు వారి వారసులు సైనిక అనుభవాన్ని పొందడం గొప్ప రాజ సంప్రదాయం. బెల్జియం యువరాణి ఎలిసబెత్ 2020-2021 విద్యా సంవత్సరాన్ని బ్రస్సెల్స్‌లోని రాయల్ మిలిటరీ అకాడమీలో గడిపారు, స్వీడన్‌కు చెందిన క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియా 2022లో స్వీడిష్ సాయుధ దళాలతో శిక్షణను పొందారు.
ప్రిన్సెస్ లియోనార్ అక్టోబర్ 31, 2005న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ప్రస్తుత చక్రవర్తి, కింగ్ ఫెలిపే VI, క్వీన్ లెటిజియా దంపతులకు జన్మించారు. ఆమెలో దాగి ఉన్న విశేషమైన తెలివితేటలు స్పానిష్ ప్రజల హృదయాలను దోచుకున్నాయి, రాజ కుటుంబం ప్రతిష్టను నిలబెట్టే వారసురాలు పుట్టిందని వారు సంబరపడ్డారు. ప్రత్యేకించి ఆమె తాత, మాజీ రాజు జువాన్ కార్లోస్ వివాదాల తర్వాత 2014లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆమె తండ్రి సింహాసనాన్ని అధిష్టించారు. తాజాగా లియోనోర్‌కు స్పానిష్ కిరీటం అందనుంది. వారి కుటుంబ నిబంధనల ప్రకారం ఆమె శిక్షణ పొంది భవిష్యత్‌లో స్పైయిన్ రాణిగా అవతరించడమే కాకుండా దేశ పరిరక్షణలో భాగం పంచుకోనుంది.
La Princesa de Asturias, acompañada por los Reyes y la Infanta Sofía, firma en el libro de honor de la Academia General Militar, donde hoy dará comienzo a su formación castrense.
— Casa de S.M. el Rey (@CasaReal) August 17, 2023
➡️https://t.co/1hhg1pw3f3 pic.twitter.com/g95HgK5pnq
Comments
Please login to add a commentAdd a comment