సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్‌ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 15వేల స్కూళ్లు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. అలానే కొత్తగా మరో 750 ఏకలవ్య పాఠశాలలు.. 100 సైనిక్ స్కూళ్లు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గోవా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం 300 కోట్ల రూపాయలు కేటాయించారు. గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా నలుగురు భారతీయ వ్యోమగాములకు రష్యాలో శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. బడ్జెట్‌లో నిర్మల స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. స్టార్టప్‌లకు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతమిస్తామన్నారు. స్టార్టప్‌లకి టాక్స్ హాలీడేని మరో ఏడాది పొడిగించారు. లేహ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
బడ్జెట్‌లో స్కిల్ డెవలప్‌మెంట్‌కు 3వేల కోట్ల రూపాయలు.. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం 5వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు 1500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక మీదట 5 కోట్లు దాటిన లావాదేవీలన్నీ ఇకపై డిజిటల్ విధానంలోనే జరగాలని నిర్మలా సీతారామన్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment