కేవీల్లో ఆరు వేల టీచర్ పోస్టులు : జవదేకర్
దేశ వ్యాప్తంగా విద్యా వ్యవస్థను మెరుగుపరిచి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం అవసరమని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. నాణ్యమైన విద్య అందినప్పుడే విద్యార్థులు సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా ఎదుగుతారని, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
దేశంలో నాణ్యమైన విద్యను అందించడం అవసరమన్నారు. దీనికి కేంద్రీయ విద్యాలయాలతో పునాది రాయి వేశామని, వీటిలో 6 వేలకు పైగా టీచర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థలో క్రీడలు భాగమేనని, ఇవి విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. ఆరు నగరాల్లో నిర్మించబోతున్న కేంద్రీయ విద్యాలయాలకు కావల్సిన భూములు అందుబాటులో లేవన్నారు.