Detention policy
-
సైనికుల్ని మార్చుకుందాం
కీవ్: నిర్బంధంలో ఉన్న సైనికులను మార్చుకుందామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాకు ప్రతిపాదించారు. రష్యా నిర్బంధంలోని తమ సైనికులను వదిలేస్తే పట్టుబడ్డ ఉత్తర కొరియా సైనికులను ఆ దేశానికి అప్పగించేందుకు సంసిద్ధత వెలిబుచ్చారు. ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను పట్టుకున్నామన్న ఉక్రెయిన్ ప్రకటనను దక్షిణ కొరియా ధ్రువీకరించడం తెలిసిందే. ‘‘మా దగ్గర మరింతమంది కొరియా సైనికులున్నారు. రష్యా పట్టుకున్న మా సైనికులను అప్పగిస్తే ఉత్తర కొరియాకు వారి సైనికులను అప్పగించడానికి సిద్ధం’’అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని గురించిన వాస్తవాలను బయట పెట్టేవారికి, శాంతి స్థాపనకు ప్రయత్నించే వారికి అవకాశం కల్పిస్తామన్నారు. బెడ్‌పై పడుకొన్న, దవడకు బ్యాండేజ్‌తో మంచంపై కూర్చున్న ఇద్దరు ఉత్తర కొరియా యుద్ధ ఖైదీల వీడియోను పోస్ట్ చేశారు. అందులో అనువాదకుల సహాయంతో జెలెన్స్కీ వారితో మాట్లాడుతూ కన్పించారు. ‘‘ఉక్రెయిన్‌తో పోరాడతామని నాకు తెలియదు. శిక్షణ మాత్రమేనని మా కమాండర్లు చెప్పారు’’అని ఆ సైనికులు చెప్పుకొచ్చారు. వారిలో ఒకరు ఉత్తరకొరియా తిరిగి వెళ్లాలని భావిస్తుండగా, అవకాశమిస్తే ఉక్రెయిన్‌లోనే ఉండిపోతానని రెండో సైనికుడు చెప్పాడు. 2022లో ఉక్రెయిన్‌పై దాడి మొదలైనప్పటి నుంచి రష్యా, ఉత్తర కొరియా సైనిక సహకారాన్ని పెంచుకుంటున్నాయి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా ఇప్పటికే 10,000 మందికి పైగా సైనికులను పంపిందని ఉక్రెయిన్, అమెరికా, దక్షిణ కొరియా ఆరోపించాయి. దీన్ని ఆ దేశాలు కొట్టిపారేశాయి. కానీ రష్యా సైన్యం ఉత్తర కొరియా సైనిక సాయంపైనే ఆధారపడి ఉందనడంలో సందేహం లేదని జెలెన్స్కీ అన్నారు. -
5, 8 తరగతులకు డిటెన్షన్ విధానం
న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 5, 8 తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. ఈ రెండు తరగతుల్లో ఫైనల్ పరీక్షలో ఫెయిలైనప్పటికీ విద్యార్థులు తదుపరి తరగతుల్లో కొనసాగేందుకు ఇప్పటిదాకా వీలుండేది. ఇకపై అలా కాదు.. ‘5వ తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు ఫైనల్ పరీక్షా ఫలితాలు వెలువడిన రెండు నెలల్లోగా మళ్లీ పరీక్షలు రాసేందుకు అవకాశం కలి్పంచాలి. ఆ పరీక్షలోనూ ఫెయిలైతే వారిని తిరిగి 5వ తరగతిలోనే కొనసాగించడం తప్పనిసరి. 8వ తరగతి ఉత్తీర్ణత సాధించని వారికీ ఇదే వర్తిస్తుంది. రెండోసారి పరీక్ష రాసే విద్యారి్థని క్లాస్ టీచర్, తల్లిదండ్రులు మార్గదర్శకత్వంలో పరీక్షలకు సమాయత్తం చేయాలి. విద్యార్థి ఏ విషయంలో వెనుకబడి ఉన్నాడో గుర్తించి, ఆయా అంశాల్లో ప్రావీణ్యం సాధించేందుకు ప్రోత్సహించాలి’అని కేంద్రం విడుదల చేసిన గజెట్ పేర్కొంది. అయితే, ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయకుండా ఏ ఒక్కరినీ స్కూల్ నుంచి తొలగించే ప్రసక్తే లేదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టానికి 2019లో చేపట్టిన సవరణతో ఇప్పటికే 16 రాష్ట్రాలు, 2 రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు 5, 8 తరగతులకు ‘నో డిటెన్షన్ విధానం’రద్దు చేశాయి. విద్య రాష్ట్రాల పరిధిలోని అంశమైనందున, గజెట్‌ను అనుసరించి రాష్ట్రాలు ఈ విషయంలో తగు చర్యలు చేపట్టాలని కోరింది. 𝐔𝐧𝐢𝐨𝐧 𝐄𝐝𝐮𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐫𝐲 𝐚𝐛𝐨𝐥𝐢𝐬𝐡𝐞𝐬 𝐭𝐡𝐞 '𝐍𝐨 𝐃𝐞𝐭𝐞𝐧𝐭𝐢𝐨𝐧 𝐏𝐨𝐥𝐢𝐜𝐲':Students in classes 5 and 8 who fail the annual exam can retake it within two months. If they fail again, they won't be promoted, but the school will not expel a… pic.twitter.com/AW4KRz8ch3— All India Radio News (@airnewsalerts) December 23, 2024 -
సెల్ఫీలు దిగితే క్రిమినల్ కేసు.. నోటిఫికేషన్ విడుదల
సెల్ఫీల మోజులో ఆపదలను కొని తెచ్చుకోవడం సర్వసాధారణంగా మారింది. ప్రపంచంలో ప్రతీ ఏటా నమోదు అవుతున్న సెల్ఫీ మరణాల్లో.. మన దేశం వాటా ఎక్కువగానే ఉంటోంది. పైగా వర్షాకాలం సీజన్లో టూరిస్ట్ ప్రాంతాలకు క్యూ కడుతుండడం వల్ల ఇవి మరింత ఎక్కువగా నమోదు అవుతున్నాయని సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని ఓ జిల్లాలో సెల్ఫీలపై పూర్తి నిషేధం విధించారు. సూరత్: గుజరాత్‌లోని దంగ్ జిల్లా అధికారులు సెల్ఫీలను నిషేధిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు ఫైన్‌తో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. సాత్పుర లాంటి టూరిస్ట్ ప్రదేశాల్లో సెల్ఫీలు దిగడం తీవ్ర నేరంగా పరిగణిస్తామని ఆ నోటిఫికేషన్లో అధికారులు హెచ్చరించారు. ఈమేరకు జూన్ 23నే అదనపు కలెక్టర్ పేరిట పబ్లిక్ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నీటి ప్రవాహాల ప్రాంతాలను సెల్ఫీ బ్యాన్ ఏరియాలుగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు వర్షాకాలం కావడంతో ప్రమాదాలకు ఆస్కారం ఉన్నందున.. బట్టలు ఉతకడం, ఈత, స్నానం చేయడం నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో 2019లో వాఘై-సాపుతరా హైవేపై సెల్ఫీలను దిగడం నిషేధించిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు ప్రస్తావిస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించడమనే వంకతో.. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని ఈ సందర్భంగా అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, కరోనా నిషేధాజ్ఞలు ఎత్తివేయడంతో ప్రస్తుతం దంగ్ టూరిస్ట్ ప్రాంతాలకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్ఫీ నిషేధాజ్ఞలు జారీ కావడం కొసమెరుపు. ఇక ఈ స్ఫూర్తితో తమ దగ్గర ఇలాంటి ఇలాంటి చట్టం తేవాలని కేరళలోని టూరిస్ట్ ప్రాంతాల ఊర్లు కొన్ని డిమాండ్ చేస్తుండడం విశేషం. చదవండి: ఫోన్ చోరీ.. సెల్ఫీలు చూసి వ్యక్తి షాక్! -
ఈసారికి నో డిటెన్షన్..!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో డిటెన్షన్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఫైనలియర్‌కు మినహా ఆయా కోర్సుల్లోని మిగతా సంవత్సరాలకు డిటెన్షన్ నిలిపివేతను అమలు చేయాలని యోచిస్తోంది. తద్వారా డిగ్రీలో ప్రథమ, ద్వితీయ, ఇంజనీరింగ్‌లో వాటితోపాటు తృతీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసి (ఇప్పుడే నిర్వహించకుండా), ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను మాత్రం లాక్డౌన్ తరువాత యథావిధిగా నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. రిజిస్ట్రార్లతో మండలి చైర్మన్ చర్చలు.. ఉన్నతవిద్యలో వివిధ కోర్సులకు సంబంధించిన వార్షిక (సెమిస్టర్) పరీక్షలను ఇప్పటికే నిర్వహిం చాల్సి ఉండగా ప్రస్తుత లాక్డౌన్ కారణంగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై ఉన్నత విద్యామండలి సమాలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి చర్చలు జరిపారు. ప్రస్తుతానికి డిటెన్షన్‌ను తాత్కాలికంగా నిలిపేసి ఫైనలియర్ విద్యార్థులు మినహా మిగతా సంవత్సరాల విద్యార్థులను పైతరగతులకు పంపాలన్న అభిప్రాయానికి చైర్మన్, రిజిస్ట్రార్లు వచ్చారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: 10 గంటల్లో వైరస్ కట్టడి 6.5 లక్షల మందికి తప్పనున్న టెన్షన్... రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేస్తుండగా వారిలో ఫైనలియర్ విద్యార్థులు దాదాపు 3.5 లక్షల మంది ఉన్నారు. సాధారణ పరిస్థితుల్లో ఉన్నత విద్యా కోర్సుల వార్షిక పరీక్షలను (సెమిస్టర్) నిర్వహించాల్సి ఉంది. డిగ్రీలో ఫస్టియర్ విద్యార్థులకు రెండో సెమిస్టర్, సెకండియర్ వారికి నాలుగో సెమిస్టర్, థర్డ్ ఇయర్ విద్యార్థులకు ఆరో సెమిస్టర్ పరీక్షలను నిర్వహిం చాల్సి ఉంది. ఇంజనీరింగ్‌లో రెండో సెమిస్టర్, నాలుగో సెమిస్టర్, ఆరో సెమిస్టర్‌తోపాటు 4వ సంవత్సర విద్యార్థులకు 8వ సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా మార్చి 15 నుంచి విద్యాసంస్థలు మూతపడటంతో ఆయా పరీక్షలను నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వివిధ కోర్సుల్లోని ఫైనలియర్ విద్యార్థులు మినహా మిగిలిన విద్యార్థులకు డిటెన్షన్‌ను తాత్కాలికంగా నిలిపేసి పైతరగతికి (తర్వాతి సెమిస్టర్‌కు) ప్రమోట్ చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తుండటం విద్యార్థులకు ఊరట కలిగిస్తోంది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే ప్రస్తుతానికి పరీక్షల టెన్షన్ తప్పుతుందని విద్యార్థులు భావిస్తున్నారు. ఎత్తివేత ఎందుకంటే.. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అమల్లోకి తెచ్చిన చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం నిబంధన ప్రకారం విద్యార్థుల ఒక సంవత్సరం చదువులో కనీసం 50 శాతం సబ్జెక్టులు ఉత్తీర్ణులై ఉంటే ఆ తర్వాతి సంవత్సరంలోని సెమిస్టర్‌కు ప్రమోట్ చేయాలి. అదే డిటెన్షన్ విధానం కూడా. ఆ నిబంధన ప్రకారం పరీక్షలు నిర్వహించకుండా, విద్యార్థులు ఉత్తీర్ణులు కాకుండా పైతరగతులకు ప్రమోట్ చేసే వీల్లేదు. అందుకే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ ఒక్క సెమిస్టర్‌కు డిటెన్షన్‌ను ఎత్తివేయాలని ఉన్నతవిద్యా మండలి నిర్ణయించింది. తర్వాత నిర్వహిస్తాం పరీక్షలు నిర్వహించలేనందున వాటిని తర్వాత రాసేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేం దుకు ఈ చర్యలు చేపట్టాలనుకుంటున్నాం. విద్యార్థులు ఆయా పరీక్షలను ఎప్పుడు రాయాల్సి ఉంటుందో తర్వాత నిర్ణయిస్తాం. చదవండి: గ్రామసింహాలూ వేట వైపు? – ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి (ఉన్నతవిద్యా మండలి చైర్మన్) -
నిర్బంధ కేంద్రాల్లో భారతీయులు
వాషింగ్టన్/హూస్టన్: ఇటీవల అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి నిర్బంధానికి గురైన వారిలో వంద మంది వరకు భారతీయులు కూడా ఉన్నారు. న్యూ మెక్సికో రాష్ట్రంలోని నిర్బంధ కేంద్రంలో 40 నుంచి 45 మంది, ఓరెగాన్ రాష్ట్రంలోని కేంద్రంలో మరో 52 మంది భారతీయులు ఉన్నారనీ, ఆ రెండు నిర్బంధ కేంద్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 52 మందిలో అత్యధికులు సిక్కులు, క్రైస్తవులేనని అధికారులు చెప్పారు. ‘ఓరెగాన్‌లోని నిర్బంధ కేంద్రాన్ని ఇప్పటికే మా అధికారి సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. న్యూ మెక్సికోలోని కేంద్రానికి కూడా మరో అధికారి వెళ్తారు’ అని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడి జైళ్లలో మగ్గుతున్న భారతీయుల్లో అత్యధికులు సిక్కులే ఉంటున్నారు. 2013–17 మధ్యలో దాదాపు 27 వేల మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ నిర్బంధానికి గురవ్వగా, చాలామంది ఇప్పటికీ జైళ్లలోనే ఉన్నారు. నిర్బంధ కేంద్రం సందర్శించిన మెలానియా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ శుక్రవారం టెక్సాస్‌లోని నిర్బంధ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ కేంద్రంలో హొండురాస్, గ్వాటెమాలా, ఎల్‌సాల్వడార్ దేశాలకు చెందిన 55 మంది చిన్నారులు ఉండగా వారితో మెలానియా నేరుగా మాట్లాడారు. అక్కడి సామాజిక కార్యకర్తలు, ప్రభుత్వాధికారులతో మాట్లాడుతూ.. పిల్లలను తమ తల్లిదండ్రుల వద్దకు వీలైనంత తొందరగా చేర్చడానికి తన నుంచి ఎలాంటి సాయం కావాలో చెబితే చేస్తానని ఆమె హామీనిచ్చారు. అయితే నిర్బంధ కేంద్రానికి బయల్దేరే ముందు మెలానియా ధరించిన వస్త్రాలపై ‘ఐ రియల్లీ డోంట్ కేర్. డూ యూ?’ (నేను ఏ మాత్రం లెక్కచేయను. మీరు చేస్తారా?) అని రాసి ఉండటం వివాదాస్పదమైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య ధరించిన వస్త్రాలపై స్పందిస్తూ ‘ఆమె వస్త్రాలపై రాసిన వ్యాఖ్యలు నకిలీ వార్తల మీడియాను ఉద్దేశించినవి’ అని ట్వీట్ చేశారు. -
2018 నుంచి డిటెన్షన్ అమలుచేస్తాం: కేంద్రం
అగర్తలా: పాఠశాలలో ఉత్తీర్ణులు కాని విద్యార్థులను అదే తరగతిలో ఉంచే డిటెన్షన్ విధానాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామని కేంద్ర మానవవనరుల సహాయ మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలిపారు. డిటెన్షన్ లేకపోవడంతో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని రాష్ట్రాలు చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం విద్యాహక్కు చట్టం–2009ను సవరించడానికి రాష్ట్రాలన్నీ అంగీకరించాయని పాండే తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు ఉత్తీర్ణులు కాకపోయినా పైతరగతులకు పంపాల్సి ఉంటుంది. దేశంలోని 20 విశ్వవిద్యాలయాలను ప్రపంచస్థాయి విద్యా సంస్థలుగా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ సంకల్పించినట్లు పాండే వెల్లడించారు. -
గ్రామీణ విద్యార్థులకు డి‘టెన్షన్’
సాక్షి, హైదరాబాద్: డిటెన్షన్ విధానాన్ని విద్యాశాఖ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. గ్రామీణ ప్రాంత, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు శాపంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో కేంద్రం.. నూతన విద్యావిధానంపై చర్చించింది. కేంద్రం సూచించిన 13 అంశాలపై మంగళవారం విద్యాశాఖ అభిప్రాయసేకరణను ప్రారంభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు డీఈవోలు, ఉపాధ్యాయ విద్య కాలేజీల ప్రిన్సిపాళ్లు, సర్వ శిక్షాఅభియాన్ అకడమిక్ మానిటరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 13 అంశాల్లో ఒకటైన డిటెన్షన్ విధానంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్థిక అసమానతల కారణంగా పేద విద్యార్థులు బాలకార్మికులుగా మారుతున్నారని డీఈవోలు, ప్రిన్సిపాళ్లు పేర్కొన్నారు. అలాగే, ఈ సమావేశంలో ప్రాథమిక విద్యాబోధనలో టీచర్ల అంకితభావం, కంప్యూటర్, వృత్తి విద్య వంటి అంశాలపై చర్చించారు. విస్తృత అభిప్రాయసేకరణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రస్థాయిలో అదనపు డెరైక్టర్, జిల్లాలో డీఈవో, మండలంలో ఎంఈవో, గ్రామస్థాయిలో హెడ్మాస్టర్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వచ్చిన అభిప్రాయాలను www.mygov.in లో అప్లోడ్ చేస్తారు. జిల్లాస్థాయిలో: 31న డిప్యూటీ ఈవో, ఎంఈవో, ఉపాధ్యాయ విద్యా కాలేజీల నుంచి అభిప్రాయ సేకరణ. మండల స్థాయిలో: సెప్టెంబరు 7న ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలతో. గ్రామస్థాయిలో: సెప్టెంబరు 11న గ్రామ విద్యా కమిటీలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, బలహీనవర్గాల అభిప్రాయాల సేకరణ. మండల, మున్సిపాలిటీ స్థాయిలో: వచ్చే నెల 18న పట్టణ స్థానిక సంస్థల ప్రతి నిధులు, కౌన్సిలర్ల అభిప్రాయ సేకరణ. మళ్లీ జిల్లా స్థాయిలో: వచ్చే నెల 25న జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్తు, జిల్లా విద్యా కమిటీలు, డీఈవోలు, ఎంఈవోలు, వయోజన విద్యా విభాగం వారితో. మరోసారి రాష్ట్రస్థాయిలో: సెప్టెంబరు 30న విద్యాశాఖ డెరైక్టరు, అదనపు డెరైక్టర్లు, ఉపాధ్యాయ సంఘాలు ప్రతినిధుల తదితరుల అభిప్రాయాలు తీసుకుంటారు. ఇదీ డిటెన్షన్ నేపథ్యం.. ఏడో తరగతిలో ఉన్న డిటెన్షన్ విధానం వల్ల అనేకమంది గ్రామీణ విద్యార్థులు ఫెయిలై చదువు ఆపేస్తున్నారని, బాల కార్మికులుగా మారిపోతున్నారని గతంలో కేంద్రమే ఆ విధానాన్ని ఎత్తేసింది. పదోతరగతి వరకు నాన్ డిటెన్షన్ ఉండాలని, విద్యార్థి పదో తరగతికి వచ్చే వరకు మధ్యలో చదువు ఆగిపోవద్దని పేర్కొంది. ప్రస్తుతం పదో తరగతికి కామన్ పరీక్ష విధానం అమలు చేస్తూ, అందులో ఫెయిలైనవారిని పైతరగతికి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ డిటెన్షన్ విధానంపై చర్చ ప్రారంభించడం గమనార్హం.