ప్రధానమంత్రితో ప్రత్యక్ష చర్చలో పాల్గొనేందుకు ఎంపికైన నవోదయ విద్యార్థులు
విజయనగరం, శృంగవరపుకోట రూరల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఈ నెల 29న ఢిల్లీలో జరగబోయే ప్రత్యక్ష చర్చలో పాల్గొనేం దుకు ఎస్.కోట మండలం కిల్త ంపాలెం జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ దామా అంజయ్య తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన గురువారం మాట్లాడారు. ఢిల్లీలోని టాకా టోరా స్టేడియంలో ఈ నెల 29న ఉద యం 11 గంటలకు పరీక్ష పే చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు నవోద య విద్యాలయంలో 12వ తరగతి విద్యార్థిని జీవనజ్యోతి, పదో తరగతి విద్యార్థి జశ్వంత్‌లు అవకాశం చేజిక్కించుకున్నారని తెలిపారు.
పరీక్షా కీ బాత్ పీఎంకే సాథ్ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శా ఖ వారు దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో విద్యార్థుల కోసం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఈ విద్యాలయానికి చెం దిన వేల మంది విద్యార్థులు పాల్గొనగా ఇక్కడ చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు అవకాశం వరించిందన్నారు. ప్రస్తుత పరీక్ష విధానం తీరుతెన్నుల గురించి పలు విషయాలు ప్రధానమంత్రితో ప్రత్యక్షంగా చర్చించనున్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రితో చర్చా కార్యక్రమానికి ఉత్తరాం ధ్ర జిల్లాల నుంచి కేవలం కిల్తంపాలెం నవోదయ విద్యాలయానికి చెందిన ఇద ్దరు విద్యార్థులకు అవకాశం దక్కేలా ప్రోత్సహించి మార్గదర్శనం చేసిన కం ప్యూటర్ ఉపాధ్యాయుడు అశుతోష్, జీవశాస్త్ర అధ్యాపకుడు ఆర్.రాఘవేంద్రరావు సేవలను ప్రిన్సిపాల్ అంజయ్య, వైస్ ప్రిన్సిపాల్ ఎం.సత్యవతి కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment