ఢిల్లీ : లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న జవహార్ నవోదయ విద్యాలయాల్లో ఉండిపోయిన 3,169 మంది విద్యార్థులను సురక్షితంగా ఇంటికి పంపినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ గురువారం వెల్లడించింది. నవోదయ విద్యాలయ సమితి కింద అంతర్భాగమైన జవహార్ నవోదయ విద్యాలయాలను లాక్‌డౌన్ కారణంగా మార్చి 21 నుంచే మూసివేశారు. దీంతో కొంతమంది ఇళ్లకు వెళ్లిపోగా, 3వేలకు పైగానే స్పెషల్ క్లాసెస్ పేరిట అక్కడే ఉండిపోయారు. వీరిలో ఎక్కువగా 13 నుంచి 15 సంవత్సరాల వయసు వాళ్లు ఉన్నారు. (విద్యార్థులను ఇంటికి పంపాం : కేంద్రమంత్రి )
లాక్‌డౌన్ 4.0 అమలవుతున్న నేపథ్యంలో ప్రయాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశంలోని దాదాపు 173 ప్రాంతాల్లోని జవహార్ నవోదయ విద్యాలయాల్లో చిక్కుకుపోయిన 3,169 మంది విద్యార్థులను వాళ్ల ఇంటికి సురక్షితంగా పంపించినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించారు. కరోనావ్యాప్తి దృష్ట్యా మార్చి 24న దేశవ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలుత 21 రోజుల లాక్‌డౌన్ అని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే లాక్‌డౌన్ 4.0 లో భారీ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో పలువురు వారి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇక భారత్‌లో కరోనా కారణంగా ఇప్పటివరకు 3,435 మంది చనిపోగా, కేసుల సంఖ్య 1,12,359 కి పెరిగింది. గత 24 గంటల్లోనే 5,609 కేసులు నమోదవగా,132 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. (పది వేల మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా! )
Comments
Please login to add a commentAdd a comment