- మామునూరు ఏసీపీ మహేందర్
- ముగిసిన నవోదయ క్లస్టర్ స్థాయి క్రీడోత్సవాలు
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
Published Sat, Aug 20 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
మామునూరు : విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మామునూరు ఏసీపీ మహేందర్ అన్నారు. హన్మకొండ మండలం మామునూరులోని నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న క్లస్టర్ బాల్‌గేమ్స్ క్రీడలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి.
అండర్ 14, 17, 19 విభాగాల్లో రాష్ట్రంలోని తొమ్మిది నవోదయ విద్యాలయాలకు చెందిన 320 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనగా 225మంది బాలబాలికలు రీజినల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నవోదయ ప్రిన్సిపాల్ డాక్టర్ పడాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో ఏసీపీ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రీడలపై మక్కువ పెంచుకుంటే జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా రాణించొచ్చన్నారు. ప్రిన్సిపాల్ పడాల సత్యనారాయణ మాట్లాడుతూ ఇక్కడి పోటీల్లో ప్రతిభ చూపిన 225 మంది బాలబాలికలు రీజినల్ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో నవోదయ అధ్యాపకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement