
గ్రేటర్ నోయిడా: బోధనను కేవలం జ్ఞానాన్ని అందించడానికి మాత్రమే పరిమితం చేయకుండా విలువల గురించి కూడా విద్యార్థులకు తెలియజెప్పాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. గ్రేటర్ నోయిడాలోని కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం క్యాంపులో కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం హోంమంత్రి ప్రసంగించారు. జీవితంలో ఏ దశలోనైనా విలువలకు కట్టుబడి బతకడం విద్యార్థులకు నేర్పాలని టీచర్లను కోరారు. ‘పుస్తకాల్లోని పాఠాలను చెప్పడంతోనే సరిపోదు. పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలకు కట్టుబడి జీవించడం గురించి తెలియజెప్పాలి. వాటి గొప్పతనాన్ని చాటాలి. మెరుగైన సమాజం కోరుకునే ప్రతి ఒక్కరూ నైతిక విలువలకు కట్టుబడి బతకాల్సిందే. ఇతరులు బతికేలా మార్పు తీసుకురావాల్సిందే. అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంద’ని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment