సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ సోకి ముగ్గురు మరణించారు. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి వేలాది మందిని బలితీసుకుంటూ భారత్‌లో కూడా చాపకిందనీరులా విస్తరిస్తోంది. అయితే ఈ వైరస్ విస్తరించకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకొంటున్నాయి. మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేయించారు. పలు రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతుండడంతో వాటిని మాత్రమే కొనసాగిస్తున్నారు.
దేశ రాజధానిలో కూడా స్కూల్స్ మూతపడ్డాయి. అయితే ఇప్పటికే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులకు పరీక్షలు జరిగాయి. ఫలితాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఫలితాలు గతంలో ఎప్పుడూ కూడా విద్యార్థుల చేతికి ఇచ్చేవారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో విద్యార్థులను టచ్ చేయవద్దని అధికారులు నిర్ణయించారు. వినూత్నంగా ఫలితాలను తెలియచేయాలని అధికారులు భావించారు. దీంతో వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా పరీక్షా ఫలితాలను పంపేందుకు సిద్ధమౌతున్నాయి. చదవండి: వృద్ధి రేటుకు కరోనా కాటు..
అన్ని కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో ఫలితాలను నేరుగా కాకుండా.. ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా చేరవేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఏమైనా సందేహాలు ఉంటే.. పాఠశాలల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేరుగా కాలేజీలకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని చెప్తున్నారు. కేంద్రీయ విద్యాలయాలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అనుసరించాలని ఇతర విద్యాసంస్థలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఫోర్డ్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
Comments
Please login to add a commentAdd a comment