లాలూకు ఐదేళ్లు.. జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్ల శిక్ష | Lalu Prasad Yadav gets 5 year jail term | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 3 2013 3:26 PM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM

దాణా స్కాంలో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్కు ఐదేళ్లు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. లాలూకు 25 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. దీంతో ఎంపీ పదవికి ఆయన అనర్హుడయ్యారు. వీరిద్దరు సహా, మరికొందరు దోషులపై దాణా స్కాంలో శిక్ష విధించడంపై వాదనలు ఉదయం 11 గంటలకు మొదలయ్యాయి. రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ వాదనలు కొనసాగాయి. దోషులను వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించి ఈ తీర్పును వారికి కూడా వినిపించారు. జడ్జి ప్రవస్ కుమార్ సింగ్ ఈ తీర్పు వెలువరించారు. లాలూ ప్రసాద్కు దాదాపు నాలుగు నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు ముందుగానే అంచనా వేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement