
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ కోరుతూ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఇప్పటికే సగం శిక్షను అనుభవించిన కారణంగా తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన అప్పీల్ చేశారు. దియోగర్ ట్రెజరీ విత్‌డ్రాయల్స్‌లో 90లక్షల రూపాయల మేర అవినీతి పాల్పడిన కేసులో లాలూకు 2017 డిసెంబర్‌లో సీబీఐ కోర్టు 42 నెలలు జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల జరిమానా విధించింది.
కాగా, దాణా కుంభకోణం కేసులో భాగంగా బిర్సాముండా సెంట్రల్ జైలులో లాలూ శిక్షను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేని కారణంగా ఆయన రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. లాలూ బెయిల్ పిటిషన్‌పై అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్, సీబీఐ న్యాయవాది రాజీవ్ సిన్హా స్పందిస్తూ పిటిషన్ అందిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment