హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు నుంచి బదిలీ చేసిన రాష్ట్రపతి ముర్ము
పలు హైకోర్టులకు సీజేలుగా మరికొందరు జడ్జీల నియామకం
గతంలో తెలంగాణ హైకోర్టు యాక్టింగ్ సీజేగా పనిచేసిన జస్టిస్ రామచంద్రరావు
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మామిడన్న సత్యరత్న రామచంద్రరావు నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రామచంద్రరావును జార్ఖండ్ హైకోర్టుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బదిలీ చేశారు. అలాగే మరికొందరు న్యాయమూర్తులను ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, జమ్మూకశీ్మర్–లడఖ్, మద్రాస్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించారు. మరో ముగ్గురు జ్యుడీíÙయల్ అధికారులను మద్రాస్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమించారు.
ఈ నెల 17న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో శనివారం కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2012లో ఏపీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు... 2013లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2021 ఆగస్టు 31న తెలంగాణ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించారు.
2021 అక్టోబర్ 12న పంజాబ్–హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అనంతరం 2023 మే 30న హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. రామచంద్రరావు తండ్రి జస్టిస్ ఎం.జగన్నాథరావు 1997–2000 మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment