India vs New Zealand 2021 2nd T20I: PIL Filed in Jharkhand HC for Postponement of 2nd T20: టీమిండియా, కివీస్‌ల మధ్య రెండో టి20 నవంబర్ 19న రాంచీ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను వాయిదా వేయాలంటూ దీరజ్ కుమార్ అనే లాయర్ జార్ఖండ్ హైకోర్టులో గురువారం పిల్ దాఖలు చేశారు. స్టేడియంలో వంద శాతం ప్రేక్షకులను ఎలా అనుమతి ఇస్తారంటూ ఆయన తన వాజ్యంలో పేర్కొన్నారు. కరోనా నిబంధనల కారణంగా ప్రజలు ఎక్కువగా గూమిగూడే మాల్స్, సినిమా థియేటర్స్, షాపింగ్ క్లాంపెక్స్ వంటి ప్రదేశాల్లో 50శాతం మందిని మాత్రమే అనుమతించాలని రాష్ట్రంలో్ నిబంధన ఉంది. ఇప్పుడు క్రికుట్ మ్యాచ్ పేరుతో 100 శాతం సీటింగ్‌కు అనుమతించడం కరెక్టు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మ్యాచ్‌కు 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని లేదంటే మ్యాచ్‌ను వాయిదా వేయాలని కోర్టును కోరారు.
చదవండి: Rishab Pant: ధోనిలా అద్బుతాలు చేస్తాడని ఆశించా.. అలా జరగడం లేదు
అయితే రాంచీ వేదికగా జరగనున్న టి20 మ్యాచ్‌కు 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మాత్రం మ్యాచ్ జరగనున్న స్టేడియానికి అన్ని సీట్లకు టికెట్స్ బుక్ చేసుకోవచ్చని ప్రకటన ఇవ్వడం వైరల్‌గా మారింది. ఇక ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టి20లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
చదవండి: Rachin Ravindra Facts: ఎవరీ రచిన్ రవీంద్ర.. సచిన్, ద్రవిడ్‌తో ఏంటి సంబంధం?
Comments
Please login to add a commentAdd a comment