PIL Filed
-
టీడీఎస్ వ్యవస్థ రద్దుకు సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: ట్యాక్స్ డిడక్షన్ యట్ సోర్స్ (TDS) వ్యవస్థను ‘ఏకపక్షం, అసంబద్ధమైనది’గా పేర్కొంటూ సుప్రీంకోర్టు(Supreme Court)లో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(PIL) దాఖలైంది. సమానత్వంసహా వివిధ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేదిగా పేర్కొంటూ టీడీఎస్‌ను రద్దు చేయాలని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.మూలం వద్దే పన్నును మినహాయించడం, ఆదాయపు పన్ను శాఖలో డిపాజిట్ చేయడం తగిన విధానం కాదని పిటిషన్ వివరించింది. అశ్విని ఉపాధ్యాయ్ అనే లాయర్, అడ్వొకేట్ అశ్వనీ దూబే ద్వారా దాఖలు చేసిన ఈ పిటిషన్లో కేంద్రం, న్యాయ మంత్రిత్వ శాఖ, లా కమిషన్, నీతి ఆయోగ్‌లు ప్రతివాదులుగా ఉన్నారు. రాజ్యాంగంలోని 14 (సమానత్వపు హక్కు), 19 (వృత్తి చేసే హక్కు), 21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ) ఆర్టికల్స్‌కు వ్యతిరేకంగా టీడీఎస్ ఉందని, ఈ వ్యవస్థ ఏకపక్షంగా, అసంబద్ధంగా ఉందని ప్రకటించాలని పిల్ ద్వారా సుప్రీంకోర్టును కోరారు.ఇదీ చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడుటీడీఎస్ అంటే ఏమిటి?టీడీఎస్ అనేది ఆదాయ వనరు వద్దే పన్ను వసూలు చేసే పద్ధతి.. పేమెంట్ సమయంలోనే పన్నును మినహాయించి పన్ను చెల్లింపుదారు తరఫున ప్రభుత్వానికి పంపుతారు. జీతభత్యాలు, బ్యాంకుల ద్వారా వడ్డీ చెల్లింపులు, అద్దె చెల్లింపులు, ప్రొఫెషనల్ ఫీజులు, కమీషన్ వంటి విభిన్న చెల్లింపులు చేసేప్పుడు టీడీఎస్ కట్ అవుతుంది. -
YSRCP సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్ట్‌లు.. హైకోర్టులో పిల్ దాఖలు
గుంటూరు, సాక్షి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధుల అక్రమ అరెస్టులపై అడ్వకేట్ విజయబాబు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆర్టికల్ 14,19, 21ను అతిక్రమించి అరెస్టు చేశారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.‘‘పోలీసులు రెడ్ బుక్‌ను ఫాలో అవుతున్నారు. డీజీపీతోపాటు ఏడు మంది ఎస్పీలు, ఒక సీపీ ఎనిమిది మంది సీఐలు కొంతమంది పోలీసులు అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఏడేళ్లు లోపు శిక్ష పడే కేసులకు 41 ఏ నోటీస్ ఇవ్వడం లేదు. మా వద్ద ఉన్న సోషల్ మీడియా అక్రమ కేసులకు సంబంధించిన కొన్ని ఎఫ్ఐఆర్ వివరాలు ఈ పిల్ పొందుపరుస్తున్నాం. సోషల్ మీడియా అక్రమ అరెస్టులకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం అందించాలి. చట్టానికి, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అరెస్టు చేసిన వారికి ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలి’ అని విజయ్ బాబు పిల్లో పేర్కొన్నారు. -
రఘురామ అమాయకుడేమీ కాదు..
సాక్షి, అమరావతి : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ నర్సాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం వెనుక దురుద్దేశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఆయన తన వ్యక్తిగత కక్షతోనే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని తెలిపారు. అంతేకాక.. తన గురించి అనేక వాస్తవాలను తొక్కిపెట్టి ఆయన ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రఘురామ దాఖలు చేసిన వ్యాజ్యం రిట్, పిల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. తనపై కేసుల గురించి కనీస స్థాయిలో కూడా ఆయన ప్రసా్తవించలేదన్నారు. లోక్‌సభ స్పీకర్‌కు వైఎస్సార్సీపీ ఇచ్చిన ఫిర్యాదు గురించి, జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ముందున్న కోర్టు ధిక్కార ప్రోసీడింగ్స్‌ను కూడా తన వ్యాజ్యంలో పేర్కొనలేదన్నారు. పైపెచ్చు తనపై ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులు లేవంటూ డిక్లరేషన్ కూడా ఇచ్చారని ఏజీ శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అసలు రఘురామ చట్ట నిబంధనల గురించి తెలియని అమాయకుడేమీ కాదన్నారు. కోర్టుల్లో ఏం జరుగుతుందో ఆయన బాగా తెలుసన్నారు. అలాగే, కోర్టుల్లో జరిగే కేసుల విచారణలపై వ్యాఖ్యలు చేయడం కూడా ఆయనకు తెలుసునని తెలిపారు. పైగా ఆయన పార్లమెంట్ సభ్యుడని, అలాంటి వ్యక్తికి చట్ట నిబంధనల గురించి తెలియకపోవడానికి ఏముంటుందని శ్రీరామ్ చెప్పారు. అన్నీ తెలిసే ఆయన ఉద్దేశపూర్వకంగా తనకు సంబంధించిన కీలక విషయాలను పిటిషన్లో బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టారని కోర్టుకు వివరించారు. ముఖ్యమంత్రి, ఇతర ప్రభుత్వ పెద్దలపై విషం చిమ్ముతూ తప్పుడు ప్రచారం చేయడాన్నే రఘురామకృష్ణరాజు పనిగా పెట్టుకున్నారన్నారు. కోర్టులు ఒకవైపు కేసులను విచారిస్తుంటే మరోపక్క ఆయన మీడియా ముందు ఆ కేసుల గురించి మాట్లాడటమే కాక, వ్యక్తులపై విషం చిమ్ముతూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారని ఏజీ వివరించారు. ఆయన పలు మీడియా ఛానెళ్లతో ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ప్రభుత్వ పెద్దల గురించి మాట్లాడిన మాటల తాలూకు వీడియోలను పరిశీలించాలని ఆయన కోర్టును కోరారు. ఆ వీడియాలను తమ కౌంటర్‌తోపాటు జతచేశామని తెలిపారు. వాటిల్లో మాట్లాడిన మాటలను యథాతథంగా కౌంటర్లో పొందుపరిచామన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ.. ఈ వీడియోలను తాము ఇంటి వద్ద చూస్తామని, కౌంటర్లో రాసిన అంశాలను చూస్తామని తెలిపింది. తదుపరి విచారణను మార్చి 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సంక్షేమ పథకాల నిర్ణయాలపై పిల్.. రాష్ట్ర ప్రజల సంక్షేమ కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదించడంతోపాటు వాటివల్ల పలువురికి లబ్ధిచేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలున్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రఘురామ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని విచారణార్హతపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం లేవనెత్తింది. దీంతో ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులందరినీ ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేశారు. తాజాగా.. ఈ వ్యాజ్యంపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. రఘురామ దురుద్దేశంతోనే పిల్ దాఖలు చేశారని, ఇలాంటి వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. అడ్వొకేట్ జనరల్‌గా తాను కోర్టులకు సహకరిస్తుంటానని, తాను మొదట కోర్టు ఆఫీసర్నని, తనపై కూడా ఆయన నిందారోపణలు చేశారని తెలిపారు. ఆ వీడియోలనూ పరిశీలించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. విచారణార్హతపై వాదనలకే పరిమితం కావాలి అంతకుముందు.. రఘురామ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు నాయకులంటే ఎలా ఉండాలో వివరించడం మొదలుపెట్టారు. ధర్మాసనం ఆయన్ను వారిస్తూ, కేసు గురించి వాదనలు చెప్పాలని స్పష్టంచేసింది. దీంతో సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అందుకే తాము ఈ పిల్ దాఖలు చేశామన్నారు. ఈ వ్యాజ్యం దాఖలు వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. -
BRS Party: ఎకరం రూ.50 కోట్లుంటే.. ‘కారు’ చౌకగా 11 ఎకరాలా?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట సర్వే నంబర్ 239, 240లో అత్యంత విలువైన 11 ఎకరాల భూమిని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి రాష్ట్ర ప్రభుత్వం ఎలా కేటాయిస్తుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్జీవో) కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ‘ప్రజా నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్’ ఏర్పాటు చేస్తామని.. దీని కోసం 11 ఎకరాలను కేటాయించాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ రెండు నెలల క్రితం నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.50 కోట్లు ఎకరం మార్కెట్ విలువైన స్థలాన్ని.. కేవలం ఎకరం రూ.3,41,25,000కే ముట్టజెప్పేందుకు అంగీకరించింది. అధికారంలో మనమే ఉన్నాం కదా.. అని తమ పారీ్టకి ఇష్టారాజ్యంగా భూమి కేటాయించి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. పూర్తి కేటాయింపు జరిగే వరకు మీడియాకు, ఇతరులకు తెలియకుండా గోప్యంగా వ్యవహరించింది. మే 12న ప్రతిపాదన.. మే 16న కలెక్టర్ అనుమతి... మే 17న సీసీఎల్ఏ అనుకూల నివేదిక.. ఈ తర్వాత ఒకరోజులో తెలంగాణ రాష్ట్ర ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ(టీఎస్ఎల్ఎంఏ) మిగతా తతంగాన్ని పూర్తి చేసింది. అనంతరం కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతిపాదన నుంచి కేటాయింపు వరకు సాధారణంగా నాలుగైదు నెలలు పట్టే తతంగమంతా కేవలం 5 రోజుల్లో ముగించారు’ అని పిటిషన్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మిని్రస్టేషన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై త్వరలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యాలపై వ్యాజ్యం.. బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ..!
టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యాలతో పాటు బీసీసీఐ తాజా మాజీ బాస్ సౌరవ్ గంగూలీ, బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ తదితరులపై బీహార్‌కు చెందిన సామాజిక కార్యకర్త తమ్మనా హష్మీ ముజఫర్‌పూర్ జిల్లా కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. వీరంతా ఐపీఎల్‌కు సంబంధించిన ఆన్లైన్ గేమ్ ప్రమోషన్లలో పాల్గొనడం ద్వారా గ్యాంబ్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ హష్మీ ఆరోపించారు. పై పేర్కొన్న సెలబ్రిటీలు ఆకర్షణీయమైన బహుమతులతో దేశంలోని యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనివల్ల ప్రజలు, ముఖ్యంగా యువత జూదానికి బానిసలైపోతున్నారని హష్మీ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎంతో బాధ్యతగా ఉంటూ దేశానికి ఆదర్శంగా ఉండాల్సిన వీరు తమను తాము జూదంలో భాగం చేసుకుంటూ యువతకు చెడు వర్తమానం పంపుతున్నారని అన్నారు. ఇలా చేయడం దేశ యువత భవిష్యత్తుతో ఆడుకోవడమేనని తెలిపారు. హష్మీ దాఖలు చేసిన ఈ పిల్‌పై కోర్టు ఏప్రిల్ 22న విచారణ చేపట్టనుంది. కాగా, హష్మీ గతంలో కూడా పలువురు ప్రముఖులపై పిల్లు దాఖలు చేశారు. -
IND vs NZ: రెండో టి20ని వాయిదా వేయండి.. హైకోర్టులో పిల్ దాఖలు
India vs New Zealand 2021 2nd T20I: PIL Filed in Jharkhand HC for Postponement of 2nd T20: టీమిండియా, కివీస్‌ల మధ్య రెండో టి20 నవంబర్ 19న రాంచీ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను వాయిదా వేయాలంటూ దీరజ్ కుమార్ అనే లాయర్ జార్ఖండ్ హైకోర్టులో గురువారం పిల్ దాఖలు చేశారు. స్టేడియంలో వంద శాతం ప్రేక్షకులను ఎలా అనుమతి ఇస్తారంటూ ఆయన తన వాజ్యంలో పేర్కొన్నారు. కరోనా నిబంధనల కారణంగా ప్రజలు ఎక్కువగా గూమిగూడే మాల్స్, సినిమా థియేటర్స్, షాపింగ్ క్లాంపెక్స్ వంటి ప్రదేశాల్లో 50శాతం మందిని మాత్రమే అనుమతించాలని రాష్ట్రంలో్ నిబంధన ఉంది. ఇప్పుడు క్రికుట్ మ్యాచ్ పేరుతో 100 శాతం సీటింగ్‌కు అనుమతించడం కరెక్టు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మ్యాచ్‌కు 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని లేదంటే మ్యాచ్‌ను వాయిదా వేయాలని కోర్టును కోరారు. చదవండి: Rishab Pant: ధోనిలా అద్బుతాలు చేస్తాడని ఆశించా.. అలా జరగడం లేదు అయితే రాంచీ వేదికగా జరగనున్న టి20 మ్యాచ్‌కు 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మాత్రం మ్యాచ్ జరగనున్న స్టేడియానికి అన్ని సీట్లకు టికెట్స్ బుక్ చేసుకోవచ్చని ప్రకటన ఇవ్వడం వైరల్‌గా మారింది. ఇక ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టి20లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: Rachin Ravindra Facts: ఎవరీ రచిన్ రవీంద్ర.. సచిన్, ద్రవిడ్‌తో ఏంటి సంబంధం? -
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై హైకోర్టులో పిల్ దాఖలు
హైదరాబాద్: పంప్‌లైన్ విధానం ద్వారా 3 టీఎంసీల నీటిని తరలించడాన్ని సవాల్ చేస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై హైకోర్టులో పిల్ దాఖలైంది. తెలంగాణ ఇంజినీర్ ఫోరమ్ కన్వీనర్ దొంతుల లక్ష్మీ నారాయణ ఈ పిల్‌ను దాఖలు చేశారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది మాచర్ల రంగయ్య కోరిన అత్యవసర విచారణను కోర్టు నిరాకరించి, మరోసారి అప్లికేషన్ పెట్టుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. కాగా, పంప్‌లైన్ విధానం ద్వారా నీటిని తరలిస్తే ప్రభుత్వంపై ఏటా రూ.8 వేల కోట్ల అదనపు భారం పడుతుందని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. నీటి తరలింపు ప్రక్రియను పాత పద్ధతినే కొనసాగించాలని ఆయన కోర్టును కోరారు. ఇప్పటిదాకా 2 టీఎంసీల నీటిని కెనాల్ గ్రావిటేషనల్ టన్నెల్ అండ్ లిఫ్ట్ సిస్టం ద్వారా తరలించారన్న పిటిషనర్.. ప్రతి ఏటా ప్రభుత్వంపై వేల కోట్ల నిర్వహణ భారం పడుతుందని కోర్టుకు వివరించారు. పంప్‌లైన్ పద్ధతి ద్వారా నీటిని తరలిస్తే భూసేకరణ సమస్యతో పాటు, విద్యుత్ తదితర సమస్యలు ఎదురవుతాయన్నపిటిషనర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవద్దని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించిందని పిటిషనర్ కోర్టుకు వివరించారు. గతంలో మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు కాలువల ద్వారానే నీటి సరఫరా జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు. -
గోవధ ఆపాలంటూ హైకోర్టులో వ్యాజ్యం
సాక్షి, హైదరాబాద్: గోసంరక్షణ చట్టం, గోవధ నిషేధ చట్టం–2011కు వ్యతిరేకంగా దాఖలైన కేసుల్లో గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్ని సైతం అమలు కావడం లేదని, ఆవులను వధించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ తిరుమల, తిరుపతి దేవస్థానాల బోర్డు మెంబర్, యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కొలిశెట్టి శివకుమార్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. బక్రీద్ పేరుతో వేలాదిగా ఆవుల్ని, కోడె దూడల్ని సైతం వధిస్తారని, తక్షణమే తమ పిల్‌ను విచారణకు చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధర్ చేసిన విజ్ఙప్తిని చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ఆమోదించింది. మంగళవారం పిల్‌ను విచారణ చేస్తామని సోమవారం బెంచ్ హామీ ఇచ్చింది. పాడి,సాగులకు యోగ్యమైన వాటిని వధించకూడదని, వాహనాల్లో ఆవులు,ఎద్దుల్ని కుక్కేసి రవాణా చేయకూడదని ఇటీవల కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను, వేటిని వధించవచ్చునో పశువైద్యుడు నిర్ధారించిన తర్వాతే నిర్ధిష్ట వధశాల్లో పశువైద్యుడి సమక్షంలోనే చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని రాష్ట్రంలో అమలు కావడం లేదని పిల్లో పేర్కొన్నారు. ఆవులను అక్రమ రవాణా అవుతుంటే రాష్ట్ర పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, చెక్‌పోస్ట్‌ల వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను ఏర్పాటు చేసి హైకోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా చేయాలని కోరారు. ఆవులు, కోడెదూడల అక్రమ రవాణా అవుతుంటే గోవు పూజ్యనీయమని భావించే వాళ్లు అడ్డుకుంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని పోలీసులు ఉల్టా కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల్ని పోలీసులు అమలు చేయనందుకే సీఆర్పీఎఫ్ బలగాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆవుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని శివకుమార్ దాఖలు చేసిన పిల్లో కోరారు. -
శాకాహారులకు, మాంసాహారులకు వేరువేరు సీట్లు
న్యూఢిల్లీ : దేశీయ రైళ్లు శాకాహారులు, మాంసాహారులను వేరు చేయనున్నాయా? ఆన్‌బోర్డు రైళ్లలో శాకాహారులకు, మాంసాహారులకు వేరు వేరు సీట్లు కేటాయించనున్నారా? అంటే ఏమో అది జరగవచ్చు అంటున్నారు కొందరు. ఆహారపు అలవాట్లను ఆధారంగా చేసుకుని రైళ్లలో వేరు వేరు సీట్లు కేటాయించేలా కోర్టు జోక్యం చేసుకోవాలని గుజరాత్ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్‌ను అహ్మదాబాద్‌లోని ఖాన్పూర్కు చెందిన ఈఈ సైద్ అనే న్యాయవాది దాఖలు చేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు ప్రకారం ప్రయాణికుల ఆహారపు ఎంపికలను బట్టి రైళ్లలో సీట్లను కేటాయించేలా దేశీయ రైల్వేను ఆదేశించాలని కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. వచ్చే వారం ఈ పిల్ విచారణకు రానుంది. తాను వేసిన ఈ పిల్లో ఎలాంటి రాజకీయ కోణం లేదని పిటిషనర్ చెప్పారు. ప్రయాణికులకు మంచి ఆహారాన్ని అందించడంలో దేశీయ రైల్వే అత్యంత జాగ్రత్త వహించాలని సైద్ అన్నారు. ట్రైన్ బుక్ చేసుకునేటప్పుడే ఈ ఆప్షన్‌ను కల్పించాలని, దీంతో శాకాహార ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. వారి ఆహారపు అలవాట్లకు తగ్గట్టు సీట్లను ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించవచ్చన్నారు. సైద్ తాను శాకాహారిగా చెప్పారు. ఈ పిల్లో రైల్వే మంత్రిత్వ శాఖను, దేశీయ రైల్వే కేటరిగింగ్, టూరిజం కార్పొరేషన్‌ను, పశ్చిమ రైల్వే జోన్‌ను, గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు. -
భూసమీకరణపై హైకోర్టుకు 300 మంది రైతులు
హైదరాబాద్: రైతులు మూకుమ్మడి న్యాయపోరాటానికి సమాయత్తం అవుతున్నారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా సోమవారం హైకోర్టులో పిటిషన్లు వేయనున్నారు. రాజధాని నిర్మాణానికి రైతుల అంగీకారం లేకుండా భూములు సమీకరిస్తున్నారనీ, సారవంతమైన భూములను మినహాయించాలని కోరుతూ 300మంది రైతులు హైకోర్టును సోమవారం ఆశ్రయించనున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై సోమవారం విచారణ జరగనుంది. సీఆర్డీఏ చట్టం రాజ్యాంగవిరుద్ధమేగాక, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కూడా వ్యతిరేకమంటూ విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎ.గోపాలరావు, జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, ప్రముఖ పాత్రికేయులు ఎ.బి.కె.ప్రసాద్, సీనియర్ న్యాయవాది సి.సదాశివరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించనుంది. సీఆర్డీఏ చట్టంవల్ల గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అత్యంత సారవంతమైన భూములు నాశనమవుతున్నాయని, దీనివల్ల రైతాంగం తమ జీవోనోపాధిని కోల్పోతున్నారని, పర్యావరణం కూడా దెబ్బతింటుందని, అందువల్లే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తున్నామని పిటిషనర్లు వివరించారు.