
గుంటూరు, సాక్షి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధుల అక్రమ అరెస్టులపై అడ్వకేట్ విజయబాబు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆర్టికల్ 14,19, 21ను అతిక్రమించి అరెస్టు చేశారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
‘‘పోలీసులు రెడ్ బుక్‌ను ఫాలో అవుతున్నారు. డీజీపీతోపాటు ఏడు మంది ఎస్పీలు, ఒక సీపీ ఎనిమిది మంది సీఐలు కొంతమంది పోలీసులు అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఏడేళ్లు లోపు శిక్ష పడే కేసులకు 41 ఏ నోటీస్ ఇవ్వడం లేదు. మా వద్ద ఉన్న సోషల్ మీడియా అక్రమ కేసులకు సంబంధించిన కొన్ని ఎఫ్ఐఆర్ వివరాలు ఈ పిల్ పొందుపరుస్తున్నాం. సోషల్ మీడియా అక్రమ అరెస్టులకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం అందించాలి. చట్టానికి, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అరెస్టు చేసిన వారికి ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలి’ అని విజయ్ బాబు పిల్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment