టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యాలతో పాటు బీసీసీఐ తాజా మాజీ బాస్ సౌరవ్ గంగూలీ, బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ తదితరులపై బీహార్‌కు చెందిన సామాజిక కార్యకర్త తమ్మనా హష్మీ ముజఫర్‌పూర్ జిల్లా కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. వీరంతా ఐపీఎల్‌కు సంబంధించిన ఆన్‌లైన్ గేమ్ ప్రమోషన్లలో పాల్గొనడం ద్వారా గ్యాంబ్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ హష్మీ ఆరోపించారు.
పై పేర్కొన్న సెలబ్రిటీలు ఆకర్షణీయమైన బహుమతులతో దేశంలోని యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనివల్ల ప్రజలు, ముఖ్యంగా యువత జూదానికి బానిసలైపోతున్నారని హష్మీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎంతో బాధ్యతగా ఉంటూ దేశానికి ఆదర్శంగా ఉండాల్సిన వీరు తమను తాము జూదంలో భాగం చేసుకుంటూ యువతకు చెడు వర్తమానం పంపుతున్నారని అన్నారు.
ఇలా చేయడం దేశ యువత భవిష్యత్తుతో ఆడుకోవడమేనని తెలిపారు. హష్మీ దాఖలు చేసిన ఈ పిల్‌పై కోర్టు ఏప్రిల్ 22న విచారణ చేపట్టనుంది. కాగా, హష్మీ గతంలో కూడా పలువురు ప్రముఖులపై పిల్‌లు దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment