ఐపీఎల్ 16వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 234 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. సూర్యకుమార్ యాదవ్ 61 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ 43 పరుగులు చేశాడు.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ ఐదు వికెట్లు పడగొట్టగా.. షమీ, రషీద్ ఖాన్ రెండేసీ వికెట్లు తీగయా.. జాషువా లిటిల్ ఒక వికెట్ తీశాడు. కాగా గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టిన జట్టుగా గుజరాత్ నిలిచింది. కాగా ఆదివారం(మే 28న) సీఎస్‌కేతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో తలపడనుంది.
సూర్యకుమార్(61) క్లీన్‌బౌల్డ్.. ఓటమి దిశగా ముంబై
61 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ మోహిత్ శర్మ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్ 155 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ముంబై విజయానికి 33 బంతుల్లో 79 పరుగులు కావాల్సి ఉంది.
గ్రీన్(30)ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై
కామెరాన్ గ్రీన్(30) రూపంలో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. జోషువా లిటిల్ బౌలింగ్‌లో గ్రీన్ క్లీన్‌బౌల్ట్ అయ్యాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. సూర్యకుమార్ 37, విష్ణు వినోద్ 3 పరుగులతో ఆడుతున్నారు.
తిలక్ వర్మ(43)ఔట్.. ముంబై ఇండియన్స్ 84/3
13 బంతుల్లోనే 43 పరుగులు చేసిన తిలక్ వర్మ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అవ్వడంతో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ముంబై 8 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసిది. సూర్య 21, కామెరాన్ గ్రీన్ 10 పరుగులతో ఆడుతున్నారు.
టార్గెట్ 234.. రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్
234 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన రోహిత్ శర్మ షమీ బౌలింగ్‌లో జోషువా లిటిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు నిహాల్ వదేరా(4) షమీ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 23 పరుగులు చేసింది.
సెంచరీతో మెరిసిన గిల్.. ముంబై ఇండియన్స్ టార్గెట్ 234
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోరు చేసింది. శుబ్‌మన్ గిల్ 129 పరుగులతో లీగ్‌లో మూడో శతకంతో చెలరేగగా.. సాయి సుదర్శన్ 43 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా 28 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్, పియూష్ చావ్లాలు చెరొక వికెట్ తీశారు.
శుబ్‌మన్ గిల్(129)ఔట్.. గుజరాత్ 198/2
129 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు ఆకాశ్ మధ్వాల్ తెరదించాడు. 17 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
గిల్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా గుజరాత్
ఐపీఎల్ 16వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ మూడో శతకంతో మెరిశాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 183 పరుగులు చేసింది. గిల్ 123, సుదర్శన్ 36 పరుగులతో ఆడుతున్నారు.
గిల్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ 12 ఓవర్లలో 119/1
ఐపీఎల్ 16వ సీజన్‌లో శుబ్‌మన్ గిల్ తన సూపర్‌ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ముంబైతో జరుగుతున్న క్వాలిఫయర్-2లో గిల్ మరో అర్థసెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. గిల్ 79, సాయి సుదర్శన్ 19 పరుగులతో ఆడుతున్నారు.
9 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 80/1
9 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోయి 80 పరుగులు చేసింది. గిల్ 48, సాయి సుదర్శన్ 10 పరుగులతో ఆడుతున్నారు.
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. సాహా(18) ఔట్
సాహా(18) రూపంలో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. పియూష్ చావ్లా తెలివిగా వైడ్ బాల్ వేయడం.. సాహా క్రీజు దాటి బయటకు రావడంతో ఇషాన్ కిషన్ స్టంప్ ఔట్ చేశాడు. ప్రస్తుతం గుజరాత్ ఏడు ఓవర్లలో వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. గిల్ 35, సాయి సుదర్శన్ 4 పరుగులతో ఆడుతున్నారు.
3 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 20/0
మూడు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. గిల్ 10, సాహా 9 పరుగులతో ఆడుతున్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వాల్
It's action time in #Qualifier2 and the coin spins in favour of #MumbaiIndians 🪙 - They'll be fielding first!#IPLPlayoffs #IPL2023 #GTvMI #TATAIPL #IPLonJioCinema | @gujarat_titans @mipaltan pic.twitter.com/kim66trDsY
— JioCinema (@JioCinema) May 26, 2023
ఇక క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు మే 28న సీఎస్‌కేతో ఫైనల్లో తలపడనుంది. మరి గుజరాత్ వరుసగా రెండోసారి ఫైనల్ ఆడుతుందా లేక ముంబై ఇండియన్స్ ఏడోసారి ఫైనల్‌కు చేరుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇరుజట్లు గతంలో మూడుసార్లు తలపడగా.. ముంబై ఇండియన్స్ రెండుసార్లు, గుజరాత్ టైటాన్స్ ఒకసారి నెగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment