IPL 2023, GT Vs MI: Gujarat Record Highest Total In IPL, MI Biggest Defeat Since 2017 - Sakshi
Sakshi News home page

GT VS MI: ముంబై చెత్త రికార్డు.. గుజరాత్‌ ఐపీఎల్‌ రికార్డు

Published Wed, Apr 26 2023 9:08 AM | Last Updated on Wed, Apr 26 2023 9:47 AM

Gujarat Record Highest Total In IPL, MI Biggest Defeat Since 2017 - Sakshi

ఐపీఎల్‌-2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిన్న (ఏప్రిల్‌ 25) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌-ముంబై ఇండియన్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌.. ముంబై ఇండియన్స్‌ను 55 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో గుజరాత్‌ టీమ్‌ తమ ఆల్‌టైమ్‌ బెస్ట్‌ ఐపీఎల్‌ రికార్డు నమోదు చేయగా.. ముంబై ఇండియన్స్‌ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. గుజరాత్‌ ఐపీఎల్‌లో తమ అత్యధిక టీమ్‌ స్కోర్‌ను (207/6) నమోదు చేస్తే.. ముంబై ఇండియన్స్‌ 2017 తర్వాత అత్యంత భారీ పరాజయాన్ని (55 పరుగుల తేడాతో) చవిచూసింది.   

ఇదే మ్యాచ్‌లో ముంబై మరో చెత్త రికార్డు సైతం నమోదు చేసింది. ఈ ఏడాది రెండు మ్యాచ్‌ల పవర్‌ ప్లేల్లో (తొలి 6 ఓవర్లలో) 30 కంటే తక్కువ పరుగులు స్కోర్‌ చేసింది. ఆర్సీబీతో మ్యాచ్‌లో 3 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసిన ముంబై టీమ్‌.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్‌ నష్టానికి 29 పరుగులు చేసింది. ఈ ఏడాది పవర్‌ ప్లేల్లో అత్యల్ప స్కోర్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ నమోదు చేసింది. ఆ జట్టు తొలి 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి కేవలం 26 పరుగులు మాత్రమే చేసింది.  

మ్యాచ్‌ విషయానికొస్తే.. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగింది. అన్ని విభాగాల్లో ఆ జట్టు సమతూకంగా సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (34 బంతుల్లో 56; 7 ఫోర్లు, సిక్స్‌), డేవిడ్‌ మిల్లర్‌ (22 బంతుల్లో 46; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), అభినవ్‌ మనోహర్‌ (21 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రాహుల్‌ తెవాటియా (5 బంతుల్లో 20 నాటౌట్‌; 3 సిక్సర్లు) రాణించగా.. అనంతరం బౌలింగ్‌లో నూర్‌ అహ్మద్‌ (4-0-37-3), రషీద్‌ ఖాన్‌ (4-0-27-2), మోహిత్‌ శర్మ (4-0-38-2), హార్ధిక్‌ పాండ్యా (2-0-10-1) సత్తా చాటి గుజరాత్‌ను గెలిపించారు.  

ముంబై బౌలర్లు తొలుత గుజరాత్‌ను కట్టడి చేసినప్పటికీ, ఆఖర్లో టెయిలెండర్లు విజృంభించడంతో ముంబై టీమ్‌ తగిన మూల్యం చెల్లించుకుంది. మెరిడిత్‌ (4-0-49-1), గ్రీన్‌ (2-0-39-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌లోనూ ముంబై చేతులెత్తేసింది. రోహిత్‌ శర్మ (2), ఇషాన్‌ కిషన్‌ (13), తిలక్‌ వర్మ (2), టిమ్‌ డేవిడ్‌ (0) దారుణంగా విఫలమయ్యారు. ముంబై ఇన్నింగ్స్‌లో నేహల్‌ వధేరా (21 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. అయితే అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement