minor rape case
-
మానవమృగం.. శిక్ష అనుభవించినా బుద్ధి మారలేదు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాట్నాకు చెందిన ఓ దుర్మార్గుడు రాకేష్ వర్మ(35) చేసిన నేరమే మళ్ళీ చేసి తానొక మానవ మృగాన్నని నిరూపించుకుని కటకటాల పాలయ్యాడు. గతంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి మళ్ళీ మరో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను స్థానికంగా ఒక ఆసుపత్రిలో చేర్పించగా ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెబుతున్నాయి ఆసుపత్రి వర్గాలు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేంద్ర సింగ్ చోహాన్ తెలిపిన వివరాల ప్రకారం సాట్నా జిల్లాలోని కృష్ణా నగర్లో నివాసముండే రాకేష్ వర్మ పన్నెండేళ్ల క్రితం నాలుగున్నరేళ్ల వయసున్న మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఆ నేరానికి అతడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఏడు సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించిన రాకేష్ వర్మ ఏడాదిన్నర క్రితమే జైల్లో సత్ప్రవర్తన కింద విడుదలయ్యాడు. బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జగత్ దేవ్ తాలిబ్ ప్రాంతం నుండి ఓ మైనర్ బాలికను లాలిస్తున్నట్లు నటించి అపహరించుకుపోయాడు. మాకు విషయం తెలిసిన తర్వాత గాలింపు చేపట్టగా బాలిక రేప్ కు గురైందని గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ప్రాధమిక చికిత్స అనంతరం మైనర్ బాలికను రేవాకు తరలించగా బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు అక్కడి వైద్యులు. ఇది కూడా చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం.. -
Amnesia Pub Incident: ఐదుగురు మైనర్లకు ముగిసిన పోలీస్ కస్టడీ
-
సర్కారు చేతకానితనం వల్లే అత్యాచారాలు: సంజయ్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్‌రేప్ ఘటనలో నేరం చేసిన వాళ్లపై కేసులు నమోదు చేయని పోలీసులు, న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ఎమ్మె ల్యే రఘునందన్‌రావుపై కేసులు పెట్టడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఈ తరహా ఘట నలు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిం చాయ నడానికి నిదర్శనమని, దీనికి ముమ్మాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేతకాని తనమే కారణ మని ఆయన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. నిందితులకు సంబంధించిన ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా దోషులను అరెస్ట్ చేయడంలో పోలీసులు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. టీఆర్ ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ‘నేరాలను అరికట్టడంలో తామే నంబర్ వన్ అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్, కేటీఆర్ గొంతు ఇప్పుడు ఎందుకు మూగబోయింది? ఈ ఘటనలపై ఎందుకు స్పందించడం లేదు’ అని ప్రశ్నించారు. కేసు లు పెడతామంటూ ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు. -
బిహార్‌లోని ఛప్రా జిల్లాలో దారుణం
-
స్కూల్లోనే బాలికపై క్లాస్మేట్స్ మృగవాంఛ
తొమ్మిదో తరగతి చదివే బాలికకు స్కూల్ నరకాన్ని తలపించింది. ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులు, విద్యార్థులు సహా ఏకంగా 18 మంది ఏడు నెలలుగా ఆమెపై మృగవాంఛ తీర్చుకుంటున్నారు. బాధితురాలు ధైర్యం చేయటంతో చివరకు విషయం వెలుగులోకి రాగా.. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... పట్నా: బిహార్‌లోని ఛప్రా జిల్లా పర్సాఘడ్‌లోని ఓ స్కూల్లో బాధిత బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. గతేడాది డిసెంబర్లో ఓ కేసులో బాలిక తండ్రి జైలు పాలయ్యాడు. ఈ క్రమంలో ఆమెకు దగ్గరైన ఓ క్లాస్మేట్ ఓదార్చినట్లు నటించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత స్కూల్ ప్రిన్స్‌పాల్, మరో ఇద్దరు టీచర్లు సహా ఐదుగురు విద్యార్థులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వారికి జత కలిసిన మరికొందరు విద్యార్థులు అప్పటి నుంచి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ ఏడు నెలలుగా మృగవాంఛ తీర్చుకుంటున్నారు. ఈ మధ్యే తండ్రి జైలు నుంచి విడుదల కావటంతో జరిగిన దారుణాన్ని అతనికి చెప్పుకుని కూతురు విలపించింది. దీంతో ఎక్మా పోలీస్ స్టేషన్లో తండ్రిసాయంతో బాధితురాలు ఫిర్యాదు చేసింది. మొత్తం 18 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రిన్సిపాల్‌తోపాటు ఓ టీచర్‌ను, ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు అధికారి అజయ్‌కుమార్ సింగ్ వెల్లడించారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం తరలించిన అధికారులు.. బాధితురాలికి సత్వర న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నారు. -
‘వాళ్లకు జీవించే హక్కులేదు’
భోపాల్ : మహిళలు, చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడుతున్న మానవ మృగాలకు జీవించే హక్కులేదని, వారు భూమికే భారమని మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. గత మంగళవారం మధ్య ప్రదేశ్‌లోని మాందసౌర్‌లో చోటుచేసుకున్న ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి దుర్మార్గులు భూమికే భారమని, వారికి జీవించే హక్కులేదన్నారు. ఇలాంటి ఘటనల పట్ల కఠినంగా వ్యవహించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇలాంటి కేసుల్లో నిందితులకు త్వరగా శిక్షపడేలా చూడాలని ఆయన హైకోర్టు, సుప్రీం కోర్టులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మాందసార్ ఘటనపై స్పందిస్తూ.. ‘ ఇది చాలా బాధాకరమైన ఘటన. బాధితురాలి కుటుంబాని అండగా ఉంటాం. ప్రభుత్వ పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నాం. ఇప్పటికే ఆమె ఆరోగ్యంపై వైద్యులతో సంప్రదింపులు కూడా జరిపాను. ఆమె కోలుకున్నట్లు వారు తెలిపారు. ఇక నిందితుడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం’ అని సీఎం పేర్కొన్నారు. ఇక 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు మరణశిక్ష విధించేలా రూపొందించిన బిల్లును గతంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. అసలేం జరిగందంటే.. మాందసార్లోని ఓ స్కూల్లో ఎనిమిదేళ్ల చిన్నారిని నిందితుడు ఇర్ఫాన్ (20) అపహరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలికను తీసుకొచ్చేందుకు ఆమె తాత స్కూల్‌కు వెళ్లగా.. ఇంట్లో ఎవరికో సీరియస్ ఉందని ఆమె ‘అంకుల్’ అని చెప్పి తీసుకెళ్లిపోయాడని స్కూల్ యాజమాన్యం తెలిపింది. దీంతో కంగారు పడిన ఆ పెద్దాయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో గాలింపు చేపట్టారు. స్కూల్‌కు 700 మీటర్ల దూరంలోని పొదల్లో బాలిక రక్తపు మడుగులో కొట్టుమిట్లాడుతూ కనిపించింది. పక్కనే చిన్నారి స్కూల్ బ్యాగ్, లంచ్ బాక్స్, ఓ బీర్ బాటిల్ పడి ఉన్నాయి. బాలికను హూటాహూటిన మాందసౌర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా దూమారం రెగింది. చాలా మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిందితుడిని అరెస్ట్ చేయాలని ఆందోళనలు చేపడుతున్నారు. చదవండి: ‘అంకుల్’ గొంతు కోశాడు -
‘అంకుల్’ గొంతు కోశాడు
ఏడేళ్ల చిన్నారిపై కిరాతకం. స్కూల్ నుంచి అపహరించిన ఓ మానవ మృగం అఘాయిత్యానికి పాల్పడింది. చావుబతుకుల మధ్య ఆ చిన్నారి ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే... మాందసౌర్: స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో బాధిత బాలిక(7) రెండో తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం బాలికను తీసుకొచ్చేందుకు ఆమె తాత స్కూల్‌కు వెళ్లాడు. అయితే ఇంట్లో ఎవరికో సీరియస్ ఉందని ఆమె ‘అంకుల్’ వచ్చి ఆమెను తీసుకెళ్లిపోయాడని స్కూల్ యాజమాన్యం తెలిపింది. దీంతో కంగారు పడిన ఆ పెద్దాయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో గాలింపు చేపట్టారు. స్కూల్‌కు 700 మీటర్ల దూరంలోని పొదల్లో బాలిక రక్తపు మడుగులో కొట్టుమిట్లాడుతూ కనిపించింది. పక్కనే చిన్నారి స్కూల్ బ్యాగ్, లంచ్ బాక్స్, ఓ బీర్ బాటిల్ పడి ఉన్నాయి. బాలికను హూటాహూటిన మాందసౌర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాలికపై అత్యాచారం జరిగిందని, గోంతు కోసి, ముఖంపై గాట్లు పెట్టారని, ఒళ్లంతా గాయాలయ్యానని వైద్యులు వెల్లడించారు. 24 గంటలు గడిచినా పరిస్థితి మెరుగుపడకపోవటంతో ఇండోర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిందితుడి అరెస్ట్... సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ‘అంకుల్’ కోసం గాలింపు చేపట్టారు. ఓ వ్యక్తిని బాలిక అనుసరిస్తున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. నిందితుడిని ఇర్ఫాన్‌గా గుర్తించిన పోలీసులు బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం అధికారులు తెలియజేయలేదు. ఈ ఘటనపై స్థానికుల ఆగ్రహానికి లోనయ్యారు. రోడ్ల మీదకు చేరి ధర్నా చేపట్టారు. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. -
రేప్ ఎలా చేశారో చెప్పు...
మైనర్ బాలికపై జరిగిన అకృత్యాన్ని రాజకీయం చేద్దామనుకున్న నేతలు అడ్డంగా బుక్కైపోయారు. బిహార్‌లో సంచలనం సృష్టించిన గయ తల్లికూతుళ్ల సామూహిక అత్యాచారం కేసులో కొందరు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రేప్ ఎలా జరిగిందో? చెప్పాలంటూ బాధితురాలిని ఇబ్బందులకు గురి చేయటంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్నా: గయ జిల్లా సోనిదిహ్ గ్రామం సమీపంలో బుధవార రాత్రి ఓ వైద్యుడ్ని చితకబాది చెట్టుకు కట్టేసి, తుపాకీతో బెదిరించి అతని భార్య(35), కూతుళ్ల(15) 20 మంది గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆపై రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తుల సాయంతో మరుసటి రోజు ఉదయం(గురువారం) కల్లా నిందితులందరినీ అరెస్ట్ చేశారు. ఈ ఘటన బిహార్‌తోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో బాధితురాలైన మైనర్ బాలికను శుక్రవారం వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న కొందరు ఆమెను బలవంతంగా కిందకి దించి పరామర్శించారు. ‘నీపై రేప్ ఎలా జరిగింది?.. ఎంత మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. మీ అమ్మ ఆ సమయంలో ఏం చేస్తోంది?... అంటూ ఇలా ప్రశ్నలు గుప్పించారు. అంతటితో ఆగకుండా ఆ బాలిక ఇష్టం లేకుండానే సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. అడొచ్చిన పోలీస్ సిబ్బందిని నెట్టేసి మరీ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆర్జేడీ నేతలపై కేసులు.. తొలుత ఆ వీడియోలు, ఫోటోలు ఆర్జేడీ నేతల ట్విటర్ అకౌంట్లలో, పార్టీ అధికారిక పేజీల్లో చక్కర్లు కొట్టాయి. ఆపై స్థానిక మీడియా ఛానెళ్లలో కూడా హల్ చల్ చేయటంతో పోలీసులు ఆర్జేడీ నేతలపై కేసు నమోదు చేశారు. ఆర్జేడీ జాతీయ కార్యదర్శి మెహతా, బెలగంజ్ ఎమ్మెల్యే సురేంద్ర ప్రసాద్ యాదవ్, మహిళా విభాగం ప్రెసిడెంట్ అభ్‌లతా, జిల్లా అధ్యక్షుడు ముర్షిద్ అలమ్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సరస్వతి దేవీ.. తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. పోలీసుల విధులకు విఘాతం కలిగించారన్న అభియోగాలను కూడా వారిపై నమోదు చేసినట్లు డీఐజీ ప్రకటించారు. తేజస్వి గుస్సా... అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీ నేతలపై కేసులు నమోదు చేయించిందని ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ చెబుతున్నారు. ఘటనపై నిజనిర్దారణ కమిటీ నియమించినట్లు, దానికి స్వయంగా తానే నేతృత్వం వహిస్తున్నట్లు తేజస్వి తెలిపారు. ఆరోపణలు రుజువైతే అందరిపై చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు మెహతా కూడా తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ‘అత్యాచారం జరిగిన 24 గంటల్లోపు బాధితులకు వైద్య పరీక్షలకు పంపాలి. కానీ, ఆలస్యంగా పోలీసులు ఆమెను తీసుకెళ్లటంతో అనుమానం వచ్చి అడ్డుకున్నాం. ఆమెతో మాట్లాడుతున్న సమయంలో మీడియా అక్కడికి వచ్చింది. అందుకే బాధితురాలు మాపై అసహనం ప్రదర్శించింది. అంతేతప్ప మేమేం ఆమెను ఇబ్బంది పెట్టలేదు’ అని మెహతా మీడియాకు తెలిపారు. బాధితురాలి మాట్లలో.. నేను బతిమాలుతున్న నన్ను బలవంతంగా వాహనం నుంచి దించేశారు. నన్ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. చాలా ఇబ్బందిగా అనిపించింది. అరిచేశా... ఆ మృగాళ్లకు ఉరి శిక్ష పడేదాక నా ముఖం ప్రపంచానికి చూపించకూడదనుకున్నా. కానీ, నేతల అత్యుత్సాహం నా ఉనికిని ప్రపంచానికి తెలియజేసింది. -
ఇది ప్రతీ ఇంట్లో జరిగేదే...!
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని శివారు గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురిపై ఓ తండ్రి ఆరు నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు. సవతి తల్లి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి రాగా, కేసు దర్యాప్తులో విస్తూపోయే విషయాలు వెలుగు చూశాయి. (24 గంటల్లో ఆరు అకృత్యాలు) పోలీసుల కథనం ప్రకారం... బిహార్‌కు చెందిన సదరు వ్యక్తి, పటౌడీలోని ఓ ఫ్యాక్టరీలో కూలీ పనులు చేసుకుంటూ అక్కడే నివసిస్తున్నాడు. మొదటి భార్య చనిపోవటంతో రెండో వివాహం చేసుకున్నాడు. అతనికి నలుగురు పిల్లలు. మొదటి భార్య కూతురి(13)పై కన్నేసిన ఆ మృగం గత ఆరు నెలలుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు. పైగా బాలికను.. ‘ఇది ప్రతీ ఇంట్లో జరిగేదే. ప్రతీ తండ్రి తన కూతురితో లైంగిక సంబంధం ఉంటుంది. అందులో తప్పు లేదు. కాబట్టి నోరు మూస్కో. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తా’ అని బెదిరించాడు. ధైర్యం చేసిన బాలిక చివరకు సవతి తల్లికి విషయం చెప్పింది. అయితే ఆమె నమ్మలేదు. కానీ, భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన ఆ మహిళ నిఘా వేసింది. శుక్రవారం సాయంత్రం పనిలోంచి తొందరగా ఇంటికి వచ్చింది. ఆ సమయంలో భర్త బాలికను వేధిస్తూ కనిపించాడు. ఆలస్యం చేయకుండా మానేసర్ మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆమె ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘నిందితుడిని గంటన్నర సేపు ప్రశ్నించాం. నేరం ఒప్పుకున్నాడు. అయితే ఆశ్చర్యకరంగా అతనిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించటం లేదు’ అని స్టేషన్ అధికారి పూనమ్ సింగ్ తెలిపారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శనివారం అతన్ని పటౌడీ కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం జ్యూడీషియల్ కస్టడీ విధించారు. మరోవైపు ఆ మృగాన్ని ఉరి తీయాలంటూ శనివారం కోర్టు బయట పలు సంఘాలు ధర్నా చేపట్టాయి. -
24 గంటల్లో ఆరు అకృత్యాలు
భువనేశ్వర్: మైనర్ చిన్నారులపై మృగాళ్ల అకృత్యాల పర్వం కొనసాగుతోంది. ఒడిశాలో 24 గంటల్లో ఆరు ఘటనలు చోటు చేసుకున్నాయి. చిన్నారులకు భద్రత కోసం ఆ రాష్ట్ర పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమానికి పిలుపునిచ్చిన కొద్ది గంటల్లోనే ఈ దారుణాలు వెలుగులోకి రావటం గమనార్హం. నబరంగ్‌పూర్‌లో... ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని బుధవారం ఇద్దరు యువకులు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాలిక ‘మా ఘర’ అనే ఎన్జీవో సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నిందితుల్లో ఒకడు పోలీసుల సమక్షంలో బాలికకు వివాహం చేసుకుంటానని చర్చలు జరపగా.. విషయం తెలుసుకున్న మా ఘర సంస్థ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టింది. ఇప్పటివరకు నిందితులను ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. బాలాసోర్‌లో... 15 ఏళ్ల బాలికను సవతి తల్లి వేధించిన ఘటన బుధవారం వెలుగు చూసింది. రెండేళ్లుగా 40 ఏళ్ల ఓ వ్యక్తితో బాలికపై ఆ సవతి తల్లి లైంగిక దాడి చేయిస్తోంది. దీంతో ఆ బాలిక మానసికంగా కుంగిపోయింది. చివరకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆమె ఆశ్రయించగా.. వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బాలికను కౌన్సిలింగ్‌కు పంపించి.. సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సవతి తల్లి కోసం గాలింపు చేపట్టారు. 10 ఏళ్ల బాలికపై... బాలాసోర్ జిల్లాలోనే ఘోరం చోటుచేసుకుంది. మానసిక రుగ్మతతో బాధపడుతున్న పదేళ్ల బాలికపై 56 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. చిన్నారి నాన్నమ్మ తిరిగొచ్చే సరికి, ఆమెను చూసి నిందితుడు పరారయ్యాడు. బాలిపాల్ పోలీస్ స్టేషన్లో ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కటక్‌లో.. కేంద్రపారా జిల్లాలో 11 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు మృగచేష్టలకు పాల్పడ్డాడు. 15 రోజుల క్రితం ఐస్ క్యూబ్‌ల కోసం దగ్గర్లోని దుకాణానికి వెళ్లిన చిన్నారిని.. ఆ షాపు యాజమాని ఇంట్లోకి లాక్కెల్లి దారుణానికి పాల్పడ్డాడు. భయంతో బాలిక ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేకపోయింది. బుధవారం రాత్రి మరోసారి ఆ చిన్నారిపై కన్నేయగా.. తప్పించుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. గురువారం ఉదయం పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్జీవో ఫిర్యాదుతో... కటక్‌లో ఓ మైనర్ చిన్నారిపై బంధువుల వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఈ ఘటనను అవమానంగా భావించి గప్‌చుప్‌గా ఉండగా.. ఓ ఎన్జీవో సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజమ్ జిల్లాలో.. 15 ఏళ్ల బాలికపై బంధువుల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు చేయటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ‘పరి పెయిన్ కథాటి’ పేరిట ఒడిశా పోలీసులు ఓ ప్రత్యేక క్యాంపెయిన్ బుధవారం ప్రకటించారు. చిన్నారుల్లో భద్రతా భావం పెంపొందించేందుకు మే 28 నుంచి జూన్ 12వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించదలిచారు. ఇంతలోనే వరుస ఘటనలు వెలుగులోకి రావటం విశేషం. -
దాచేపల్లి ఘటన: సుబ్బయ్య మృతిపై అనుమానాలు?
సాక్షి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన దాచేపల్లి అత్యాచార ఘటనలో నిందితుడు రామ సుబ్బయ్య మరణంపై అనుమానాలు మొదలయ్యాయి. సుబ్బయ్యని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అతడి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. చెట్టుకు ఉరేసుకున్నట్లు పోలీసులు మృతదేహం ఫోటోను చూపించిన తర్వాత.. వాళ్లు తమ వాదనను వినిపిస్తున్నారు. సుబ్బయ్య కాళ్లు నేలను తాకినట్లుగా ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుండటంతో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపణలకు దిగారు. మరోవైపు బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా సుబ్బయ్యను చంపి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశారు. ‘మా చేతుల్లో చావలేదని బాధపడుతున్నాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సుబ్బయ్య కొడుకును కూడా ఉరితీయాలి’ అని బాలిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్య 48 గంటల హైడ్రామా తర్వాత శవమై తేలాడు. గురజాల మండలం దైద వద్ద అటవీలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. మరి కాసేపట్లో దీనిపై పోలీసులు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. -
మైనర్ రేప్ కేసులో ఎమ్మెల్యేకు బెయిల్
పనాజీ: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో సెయింట్ క్రూజ్ ఎమ్మెల్యే అటానాసియో మోన్సిరేట్కు బెయిల్ మంజూరు చేస్తూ గోవా కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసుపై బుధవారం విచారణ జరిపిన చిల్డ్రన్స్ కోర్టు.. మోన్సరేట్తో పాటు మరో ఇద్దరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచికత్తుతో పాటు వారం రోజుల పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాల్సిందిగా మోన్సిరేట్ను కోర్టు ఆదేశించింది. ఈ ఏడాది మార్చి నెలలో కనిపించకుండా పోయిన ఓ బాలిక ఇటీవలే పోలీసుల గాలింపులో దొరికింది. అయితే సురక్షిత ప్రాంతానికి తరలించి వివరాలు సేకరించగా ఎమ్మెల్యే తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని సదరు బాలిక తెలిపింది. దీంతో పోలీసులు మోన్సురేట్పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే.. మోన్సిరేట్ మాత్రం ఇవన్నీ తనపై బురదజల్లే ప్రయత్నాలని కొట్టిపారేశాడు.