మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ (ఫైల్ ఫొటో)
భోపాల్ : మహిళలు, చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడుతున్న మానవ మృగాలకు జీవించే హక్కులేదని, వారు భూమికే భారమని మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. గత మంగళవారం మధ్య ప్రదేశ్‌లోని మాందసౌర్‌లో చోటుచేసుకున్న ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి దుర్మార్గులు భూమికే భారమని, వారికి జీవించే హక్కులేదన్నారు. ఇలాంటి ఘటనల పట్ల కఠినంగా వ్యవహించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇలాంటి కేసుల్లో నిందితులకు త్వరగా శిక్షపడేలా చూడాలని ఆయన హైకోర్టు, సుప్రీం కోర్టులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మాందసార్ ఘటనపై స్పందిస్తూ.. ‘ ఇది చాలా బాధాకరమైన ఘటన. బాధితురాలి కుటుంబాని అండగా ఉంటాం. ప్రభుత్వ పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నాం. ఇప్పటికే ఆమె ఆరోగ్యంపై వైద్యులతో సంప్రదింపులు కూడా జరిపాను. ఆమె కోలుకున్నట్లు వారు తెలిపారు. ఇక నిందితుడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం’ అని సీఎం పేర్కొన్నారు. ఇక 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు మరణశిక్ష విధించేలా రూపొందించిన బిల్లును గతంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే.
అసలేం జరిగందంటే..
మాందసార్‌లోని ఓ స్కూల్‌లో ఎనిమిదేళ్ల చిన్నారిని నిందితుడు ఇర్ఫాన్ (20) అపహరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలికను తీసుకొచ్చేందుకు ఆమె తాత స్కూల్‌కు వెళ్లగా.. ఇంట్లో ఎవరికో సీరియస్ ఉందని ఆమె ‘అంకుల్’ అని చెప్పి తీసుకెళ్లిపోయాడని స్కూల్ యాజమాన్యం తెలిపింది. దీంతో కంగారు పడిన ఆ పెద్దాయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో గాలింపు చేపట్టారు. స్కూల్‌కు 700 మీటర్ల దూరంలోని పొదల్లో బాలిక రక్తపు మడుగులో కొట్టుమిట్లాడుతూ కనిపించింది. పక్కనే చిన్నారి స్కూల్ బ్యాగ్, లంచ్ బాక్స్, ఓ బీర్ బాటిల్ పడి ఉన్నాయి. బాలికను హూటాహూటిన మాందసౌర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా దూమారం రెగింది. చాలా మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిందితుడిని అరెస్ట్ చేయాలని ఆందోళనలు చేపడుతున్నారు.
చదవండి: ‘అంకుల్’ గొంతు కోశాడు
Comments
Please login to add a commentAdd a comment