పనాజీ: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో సెయింట్ క్రూజ్ ఎమ్మెల్యే అటానాసియో మోన్సిరేట్కు బెయిల్ మంజూరు చేస్తూ గోవా కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసుపై బుధవారం విచారణ జరిపిన చిల్డ్రన్స్ కోర్టు.. మోన్సరేట్తో పాటు మరో ఇద్దరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచికత్తుతో పాటు వారం రోజుల పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాల్సిందిగా మోన్సిరేట్ను కోర్టు ఆదేశించింది.
ఈ ఏడాది మార్చి నెలలో కనిపించకుండా పోయిన ఓ బాలిక ఇటీవలే పోలీసుల గాలింపులో దొరికింది. అయితే సురక్షిత ప్రాంతానికి తరలించి వివరాలు సేకరించగా ఎమ్మెల్యే తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని సదరు బాలిక తెలిపింది. దీంతో పోలీసులు మోన్సురేట్పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే.. మోన్సిరేట్ మాత్రం ఇవన్నీ తనపై బురదజల్లే ప్రయత్నాలని కొట్టిపారేశాడు.
మైనర్ రేప్ కేసులో ఎమ్మెల్యేకు బెయిల్
Published Wed, May 18 2016 11:28 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM
Advertisement