రేప్ చేయడానికి వెయ్యి మైళ్లు ప్రయాణం..!
వార్విక్ షైర్: సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మైనర్ బాలికపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. న్యూడ్ ఫొటోలను వెబ్ సైట్ లో పెడతాను, స్నేహితులకు ఇస్తానంటూ బాలికను బ్లాక్ మెయిల్ చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. చివరికి కటకటాల పాలయ్యాడు.
ఆ వివరాలిలా ఉన్నాయి... నిందితుడు మార్క్ గ్రీనల్(26) లివర్ పూల్ లో ఉండేవాడు. అతడికి ఫేస్ బుక్ ద్వారా నూనిటాన్ లో ఉండే స్కూలు విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు ఆపై రెగ్యూలర్ గా చాటింగ్ చేసేవారు. తన మాయమాటలతో నమ్మించి టాప్ లెస్ ఫొటోలు, న్యూడ్ ఫోటోలను మెయిల్ ద్వారా సంపాదించాడు. బాలిక పంపిన న్యూడ్ ఫొటోలను ఆయుధంగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. తనతో సెక్స్ చేయాలని బాలికను చాటింగ్ లో అడిగితే అందుకు మైనర్ బాలిక నిరాకరించింది.
బాలిక పంపిన న్యూడ్ ఫొటోలను ఓ వెబ్ సైట్ లో పోస్ట్ చేసి, స్క్రీన్ షాట్లు తీసి బాలికకు పంపించాడు. దీంతో కంగారు పడిన బాలిక అతడు చెప్పిన పనికి ఒప్పుకుంది. నూనిటాన్ లోని బెర్ముడా పార్కు హోటల్ లో రూమ్ లో కలుస్తానని చెప్పాడు. లివర్ పూల్ ఉన్న గ్రీనల్ దాదాపు 1000 మైళ్లకు పైగా ప్రయాణించి నూనిటాన్ చేరుకున్నాడు. హోటల్ రూములో బాలికపై బలవంతంగా రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తనకేం తెలియందన్నట్లుగా తాను ఉంటున్న లివర్ పూల్ కు వెళ్లిపోయాడు.
మైనర్ బాలికకు ఫేస్ బుక్ లో గ్రీనల్ పంపించిన సందేశాలను ఆమె తల్లి చూసింది. కూతుర్ని ఆ దుర్మార్గుడు బ్లాక్ మెయిల్ చేసి రేప్ చేశాడని తెలుసుకుని ఆవేశానికి లోనైంది. గ్రీనల్ పై ఫిర్యాదుచేయగా, పోలీసులు కేసు నమోదుచేశారు. తాజాగా గ్రీనల్ తాను తప్పుచేసినట్లు ప్రాధేయపడ్డాడు. బెయిల్ పై తనను విడుదల చేయాలని ప్రార్థించగా అతడి పిటీషన్ ను కోర్టు కొట్టిపారేసింది. ఇంగ్లండ్ లోని వార్విక్ క్రౌన్ కోర్టులో కేసు విచారణను నెలాఖరుకు వాయిదా వేశారు.