సాక్షి, గుంటూరు: ఇంజనీరింగ్ విద్యార్థుల కీచక పర్వం గుంటూరు పట్టణంలో శనివారం వెలుగు చూసింది. తోటి విద్యార్థినితో సన్నిహితంగా ఉంటూ వీడియోలు చిత్రీకరించిన ఇద్దరు యువకులు.. వాటిని అడ్డుపెట్టుకుని కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేశారు. తాము చెప్పినట్టు వినకుంటే ఆ వీడియోలను వెబ్‌సైట్‌లో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. మూడేళ్లుగా ఆమెపై వేధింపుల పరంపర సాగుతోంది. ఈక్రమంలో బాధితురాలు దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు వరుణ్, కౌశిక్‌లను 24 గంటల్లోనే అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
(చదవండి: చంద్రదండు అధ్యక్షుడిపై వేధింపుల కేసు)
ఇద్దరు యువతుల ప్రమేయం
వీడియోలతో యువతిని వేధించిన కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితులు వరుణ్, కౌశిక్‌తో పాటు మరో ఇద్దరు యువతులకు ఈ కేసులో ప్రమేయమున్నట్టు వెల్లడైండి. వరుణ్ స్నేహితురాలి ద్వారా కౌశిక్ చెల్లెలికి బాధితురాలి వీడియోలు అందినట్టు పోలీసులు గుర్తించారు. కౌశిక్ ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయించాడు. వీడియోలు చూపిస్తూ కోరిక తీర్చాలని బాధితురాలిని వేధింపులకు గురిచేశాడు. కాగా, వీడియోలు బయటకు రావడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు యువతులపై కూడా పోలీసులు కేసులు పెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment