రాజస్థాన్‌ సర్కార్‌పై రాబర్ట్‌ వాద్రా ఫైర్‌ | Hound me, harass me', says Robert Vadra in FB post, about possible CBI probe in alleged land scam | Sakshi
Sakshi News home page

విమర్శలు ఎక్కుపెట్టిన రాబర్ట్‌ వాద్రా

Published Wed, Aug 23 2017 2:04 PM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM

రాజస్థాన్‌ సర్కార్‌పై రాబర్ట్‌ వాద్రా ఫైర్‌

రాజస్థాన్‌ సర్కార్‌పై రాబర్ట్‌ వాద్రా ఫైర్‌

సాక్షి, న్యూఢిల్లీ : బికనీర్‌ భూ ఒప్పందంపై సీబీఐ విచారణకు రంగం సిద్దమవుతున్న క్రమంలో రాబర్ట్‌​ వాద్రా రాజస్థాన్‌ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. తనను టార్గెట్‌గా చేసుకుని రాజస్థాన్‌ ప్రభుత్వం వేధిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భూ కుంభకోణంలో తన ప్రమేయం ఉన్నట్టు ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదని వాద్రా అన్నారు.

‘నన్ను ఎంతైనా వేధించండి...వెంటాడండి...ప్రాసిక్యూట్‌ చేసుకోండి..ఇలాంటి అసత్యాలు నిజాన్ని కప్పిపుచ్చలేవు’  అని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. రాజస్థాన్‌ ప్రభుత్వం తనపై సాగిస్తున్న కుట్రపూరిత ప్రచారంలో ఇది ఓ భాగమేనని ఆయన అన్నారు. బికనీర్‌ భూముల ఒప్పందంలో వాద్రా పాత్రను నిగ్గుతేల్చేందుకు రాజస్ధాన్‌ ప్రభుత్వం సీబీఐ విచారణ చేపట్టాలని కేం‍ద్రాన్ని కోరిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాదాన్యత సంతరించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement